
టోక్యో: పారాలింపిక్స్‌లో షూటింగ్ విభాగంలో భారత అథ్లెట్లు సత్తా చాటుతున్నారు. తాజాగా పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్(SH1) ఈవెంట్‌లో సింగ్‌రాజ్ అదానా కాంస్య పతకం సాధించాడు. కాగా, మహిళా షూటర్ అవని లేఖారా 10మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో బంగారు పతకం సాధించి చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. మొత్తంగా సింగ్‌రాజ్ అదానా కాంస్యంతో భారత పతకాల సంఖ్య 8కి చేరింది. ఇందులో 2 స్వర్ణాలు, 4 రజతాలు, 2 కాంస్య పతకాలు ఉన్నాయి.