ప్యారిస్ వేదికగా జరుగుతున్న పారాలింపిక్స్‌లో భారత షూటర్లు అదరగొడుతున్నారు. షూటింగ్ విభాగంలో భారత్ ఖాతాలో మరో పతకం చేరింది. మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఎస్‌హెచ్1 ఫైనల్ లో రుబీనా ఫ్రాన్సిస్ కాంస్య పతకం సాధించింది.
మధ్యప్రదేశ్‌కు చెందిన 25 ఏళ్ల రుబీనా.. ఫైనల్లో 211.1 స్కోర్‌తో మూడో స్ధానంలో నిలిచి కాంస్యం పతకం సొంతం చేసుకుంది. ఇరాన్‌కు చెందిన సారే జవాన్‌మర్డి 236.8 స్కోరుతో స్వర్ణ పతకాన్ని గెలుచుకున్నారు.
టర్కీ షూటర్ ఐసెల్ ఓజ్గాన్ రజతం కైవసం చేసుకుంది. కాగా ఇప్పటివరకు ఈ పారాలింపిక్స్‌లో భారత్ మొత్తం ఐదు పతకాలు సాధించాయి. అందులో నాలుగు పతకాలు షూటర్లు సాధించినవే కావడం గమనార్హం.
మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ స్టాండింగ్ ఎస్‌హెచ్-1 షూటింగ్ విభాగంలో అవని లేఖర స్వర్ణం సాధించిగా.. ఇదే ఈవెంట్‌లో మోనా అగర్వాల్ కాంస్యం గెలుచుకుంది. పురుషుల షూటింగ్ 10మీ ఎయిర్ పిస్టల్ ఎస్ హెచ్1లో మనీష్ నర్వాల్ రజత పతకాన్ని సాధించాడు.
BRONZE 🥉 For INDIA 🇮🇳
Rubina Francis wins bronze medal in the Women's 10m Air Pistol SH1 Final with a score of 211.1⚡️#Paris2024 #Cheer4Bharat #Paralympic2024 #ParaShooting@mansukhmandviya @MIB_India @PIB_India @IndiaSports @ParalympicIndia @PCI_IN_Official @Media_SAI… pic.twitter.com/iSBUZ6KNS7— Doordarshan Sports (@ddsportschannel) August 31, 2024
Comments
Please login to add a commentAdd a comment