rubeena
-
Paris Paralympics: భారత్ ఖాతాలో మరో పతకం.. రుబీనాకు కాంస్యం
ప్యారిస్ వేదికగా జరుగుతున్న పారాలింపిక్స్‌లో భారత షూటర్లు అదరగొడుతున్నారు. షూటింగ్ విభాగంలో భారత్ ఖాతాలో మరో పతకం చేరింది. మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఎస్‌హెచ్1 ఫైనల్ లో రుబీనా ఫ్రాన్సిస్ కాంస్య పతకం సాధించింది. మధ్యప్రదేశ్‌కు చెందిన 25 ఏళ్ల రుబీనా.. ఫైనల్లో 211.1 స్కోర్‌తో మూడో స్ధానంలో నిలిచి కాంస్యం పతకం సొంతం చేసుకుంది. ఇరాన్‌కు చెందిన సారే జవాన్‌మర్డి 236.8 స్కోరుతో స్వర్ణ పతకాన్ని గెలుచుకున్నారు. టర్కీ షూటర్ ఐసెల్ ఓజ్గాన్ రజతం కైవసం చేసుకుంది. కాగా ఇప్పటివరకు ఈ పారాలింపిక్స్‌లో భారత్ మొత్తం ఐదు పతకాలు సాధించాయి. అందులో నాలుగు పతకాలు షూటర్లు సాధించినవే కావడం గమనార్హం. మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ స్టాండింగ్ ఎస్‌హెచ్-1 షూటింగ్ విభాగంలో అవని లేఖర స్వర్ణం సాధించిగా.. ఇదే ఈవెంట్లో మోనా అగర్వాల్ కాంస్యం గెలుచుకుంది. పురుషుల షూటింగ్ 10మీ ఎయిర్ పిస్టల్ ఎస్ హెచ్1లో మనీష్ నర్వాల్ రజత పతకాన్ని సాధించాడు. BRONZE 🥉 For INDIA 🇮🇳Rubina Francis wins bronze medal in the Women's 10m Air Pistol SH1 Final with a score of 211.1⚡️#Paris2024 #Cheer4Bharat #Paralympic2024 #ParaShooting@mansukhmandviya @MIB_India @PIB_India @IndiaSports @ParalympicIndia @PCI_IN_Official @Media_SAI… pic.twitter.com/iSBUZ6KNS7— Doordarshan Sports (@ddsportschannel) August 31, 2024 -
స్వావలంబనకు చుక్కాని... రుబీనా!
'అది హైదరాబాద్, దారుల్షిఫా, మలక్‌పేట్, నూర్ఖాన్ బజార్‌లోని బాల్షెట్టీ ఖేత్ గ్రౌండ్. పది నుంచి పదిహేనేళ్ల వయసు బాలికలు ఆనందంగా కేరింతలు కొడుతున్నారు. వారి మధ్యలో ఓ అరవై ఏళ్ల మహిళ. ఆ మహిళకు హైఫైవ్ ఇస్తూ, ఫిస్ట్ పంచ్‌లతో ఆడుకుంటున్నారు. ఆ బాలికలు సంతోషంగా రెక్కలు విచ్చుకోవడానికి కారణం ఆ మహిళ. ఆమె పేరు రుబీనా నఫీస్ ఫాతిమా. అమ్మాయిలు గడపదాటి బయటకు రావడానికి ఆంక్షలున్న కుటుంబాల ఆడపిల్లలకు ఆకాంక్షల రెక్కలు తొడిగారామె. ఆశయాల లక్ష్యాలను వారి మెడలో హారంగా వేశారు. ఇందుకోసం సఫా అనే సంస్థను స్థాపించారు. బాలికలు తమ కలలను సాధించుకోవడానికి తగిన సాధన కోసం గ్రౌండ్‌ను వారి కోసం కేటాయిచేలా చేశారు. ఇస్లాం సంప్రదాయాల గౌరవానికి విఘాతం కలగని విధంగా దుస్తులు ధరించి ఫుట్‌బాల్ ప్రాక్టీస్ చేస్తారు. పదిహేనేళ్లుగా వ్యవస్థీకృతంగా సేవలందిస్తున్న రుబీనా నఫీస్ ఫాతిమా తన స్వచ్ఛంద సేవా ప్రస్థానాన్ని ‘సాక్షి’తో పంచుకున్నారు.' తాతగారి స్ఫూర్తితో.. ‘‘మా నాన్న లెఫ్టినెంట్ కల్నల్ ఖాన్. అమ్మ మిలటరీ స్కూల్లో టీచర్. మా కుటుంబం అభ్యుదయ భావాలతో ఎదగడానికి కారణం మా తాతగారు సులేమాన్ ఆఫ్తాబ్ అలీ (అమ్మవాళ్ల నాన్న). మహిళలు చదువుకోవాలని, ఆర్థికంగా ఎవరి మీదా ఆధారపడకూడదని, అప్పుడే సమాజంలో మహిళకు గౌరవం దక్కుతుందని చెప్పేవారు. ఆయన అమ్మను అలాగే పెంచారు. ఇక పేరెంట్స్ ఉద్యోగరీత్యా దేశంలోని అనేక ప్రాంతాల్లో పెరిగాను. సెక్యులర్ వాతావరణంలో పెరగడంతో పాటు అన్ని రకాల సంస్కృతులను గౌరవించడం నేర్చుకున్నాను. ఆడపిల్ల అనే కారణంగా ఇంట్లో నాకు ఎటువంటి ఆంక్షలూ లేవు. బాడ్మింటన్ ప్లేయర్‌గా జాతీయస్థాయిలో ఆడాను కూడా. ఇరవై ఏళ్లకే స్వచ్ఛంద సంస్థతో కలిసి పని చేశాను. పెళ్లి తర్వాత భర్తతో΄ాటు సౌదీ అరేబియాకు వెళ్లాను. అక్కడ మంత్రిత్వ శాఖలో ఉద్యోగం చేసిన భారతీయ మహిళను. కొంతకాలానికి ఇండియాకి వచ్చేశాం. ఇక్కడకు వచ్చిన తర్వాత సొంతంగా బిజినెస్ మొదలుపెట్టి దారుణమైన నష్టాలను చూశాను. ఆ తర్వాత నాకు బాగా తెలిసిన పర్యాటక రంగంలో శిక్షణ, ప్లేస్‌మెంట్స్ నన్ను విజేతగా నిలిపింది. నాకు సర్వీస్ మీదున్న ఆసక్తికొద్దీ కొంత సమయం మహిళల కోసం పని చేయడం మొదలుపెట్టాను. సేవలను మరింత సమగ్రంగా చేయడం కోసం సీఎస్ఐఎమ్ నుంచి సర్టిఫికేట్ కోర్సులు చేశాను. మా తాత, నాన్నగారి పేర్లు కూడా వచ్చేటట్లు నా సేవా సంస్థకు సఫా అనే పేరు ఖాయం చేసుకున్నాను. సఫా ద్వారా 2008 నుంచి ముస్లిమ్ మహిళల ఆర్థిక సామాజిక పురోగతి కోసం పని మొదలుపెట్టాను. అప్పటినుంచి కొత్త అనుభవాలు ఎదురయ్యాయి. ఈ గ్రౌండ్లో క్రీడాకారులు పుట్టారు! సాధారణంగా మగపిల్లలను స్వేచ్ఛగా పెరగనిస్తారు. బాలికలకు కూడా ఆడుకోవాలని ఉంటుంది. వాళ్లు ఆడుకోవడానికి నేను అండగా నిలిచాను. ఒకరోజు ఓ వ్యక్తి బైక్‌తో నేరుగా గ్రౌండ్ మధ్యకు వచ్చేసి బాలికలు ఆడుకోవడాన్ని ప్రశ్నించారు. ఫుట్‌బాల్ ప్రాక్టీస్ చేస్తున్న ఆడపిల్లల మీద మగపిల్లలు రాళ్లు రువ్వారు. జీహెచ్ఎమ్సీ అధికారులతో మాట్లాడి ఈ గ్రౌండ్‌ను రోజూ రెండు గంటలపాటు బాలికల కోసం రిజర్వ్ చేయించాను. ఆ సమయంలో మగవాళ్లు గ్రౌండ్లో అడుగుపెట్టడానికి వీల్లేకుండా అడ్డుకోగలిగాం. ఇప్పుడు రోజూ బాలికలు పెద్ద సంఖ్యలో వచ్చి ఆడుకుంటున్నారు. ఈ గ్రౌండ్ నుంచి ఇద్దరు బాలికలు డిస్ట్రిక్ట్ లెవెల్ ఫుట్‌బాల్ ప్లేయర్లుగా ఎదిగారు. నగరంలో 542 గ్రౌండ్స్ ఉన్నాయి. ప్రతి గ్రౌండ్ లోనూ బాలికల కోసం రెండు గంటలు కేటాయించి ఆటలను ప్రోత్సహించాలి. క్రీడాకారులుగా ఎదుగుతారు. కనీసం సూర్యరశ్మి తగిలేలా మెలిగితే శారీరకంగా, మానసికంగా ఉల్లాసంగా ఉంటారు. ‘గోల్స్ ఫర్ గాళ్స్’ సంస్థ బాలికల్లో నాయకత్వ లక్షణాలు పెంపొందించడానికి శిక్షణనిస్తుంది. ఆ శిక్షణ కోసం పాత బస్తీ నుంచి బాలికలు వెళ్లడం గొప్ప విజయం అనే చెప్పాలి. పేదమహిళల ఆర్థిక స్వావలంబన సాధన మాత్రమే కాదు, ఒక గొప్ప సామాజిక సంస్కరణ చేయగలిగానని గర్వంగా చెప్పగలను. – రుబీనా నఫీస్ ఫాతిమా, సంఘ సేవకురాలు ఇంటింటికీ వెళ్లాను! మహిళలను చైతన్యవంతం చేయడానికి గడపగడపకూ వెళ్లాను. వాళ్ల ఇళ్లలో కూర్చుని బయట ప్రపంచం గురించి చెప్పాను. మహిళ ఎలా ఎదగవచ్చో వివరించాను. వాళ్లతో మాట్లాడిన తరవాత నాకు తెలిసినదేమిటంటే... మహిళలకు ఆలోచనలున్నాయి, ఆశయాలున్నాయి, ఆకాంక్షలున్నాయి. వాటన్నింటినీ మొగ్గలోనే తుంచి వేస్తున్న ఆంక్షలు కూడా ఉన్నాయి. పెద్దల గౌరవానికి భంగం కలిగించకుండా, మనోభావాలకు విఘాతం కలగకుండా ఎదగడం నేర్పించాను. బోలా నగర్లో చిన్నగదిలో రెండు సెకండ్ హ్యాండ్ టైలరింగ్ మెషీన్లతో మొదలైన నా సర్వీస్ ఇప్పుడు స్కిల్ ట్రైనింగ్, లైవ్లీహుడ్, క్లౌడ్ కిచెన్, ధనక్బజార్ వంటి పదిహేను ప్రాజెక్టులకు విస్తరించింది. ఆరువందల మందికి వండగలిగిన ఇండస్ట్రియల్ కిచెన్ ఉంది. లుక్మా బ్రాండ్ తో మా మహిళలు తయారు చేసే ఆహార ఉత్పత్తులకు ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా గుర్తింపు ఉంది. ‘ఆర్టిజానియా’ పేరుతో టైలరింగ్ సెంటర్లు నడుస్తున్నాయి. ఉద్యోగం కోసం బయటకు వెళ్లడానికి ఇష్టపడని వాతావరణం ఇంకా ఉంది. అలాంటి కొంతమంది ఇళ్లలోనే హ్యాండీక్రాఫ్ట్సŠ, ఇతర వస్తువులు తయారు చేసి వారానికొకసారి మేము ఏర్పాటు చేసే ధనక్ బజార్లో స్టాల్ పెట్టుకుని విక్రయిస్తారు. చదువుకు నోచుకోక ఇంతవరకూ పెన్ను వాడని వాళ్లు కూడా పెన్ హోల్డర్లు తయారు చేస్తున్నారు. వీటన్నింటినీ స్ట్రీమ్‌లైన్ చేయడం ఒక ఎత్తయితే బాలికలను క్రీడాకారులుగా తయారు చేయడం మాత్రం కత్తిమీద సాములా మారింది. శిక్షణనిచ్చాను... పని చూపించాను! నేను ఎవరికీ ఏదీ ఉచితంగా ఇవ్వలేదు. పని నేర్పిస్తాను, పని చేసుకునే వెసులుబాటు కల్పిస్తాను. వాళ్లు తమ కాళ్ల మీద తాము నిలబడాలి. ఒకరు సంపాదించి, ఐదుగురు తినాలంటే ఆ ఇల్లు ఆర్థికంగా ఎదిగేది ఎప్పటికి? ఇద్దరు సంపాదిస్తుంటే... పిల్లలకు మంచి చదువు సాధ్యమవుతుంది. అందుకే మహిళల ఆర్థిక వృద్ధి మీద దృష్టి కేంద్రీకరించాను. స్వయం ఉపాధి మార్గాల కోసం జీహెచ్ఎంసీతో అనుసంధానమయ్యాం. స్వయం సహాయక బృందాలుగా ఏర్పడి ప్రభుత్వ పథకాలను ఉపయోగించుకుంటూ మహిళలు సాధికారత సాధిస్తున్నారు. సఫా సేవలు హైదరాబాద్ నగరంలో 48 స్లమ్ ఏరియాలకు విస్తరించాయి. మొత్తానికి పాతబస్తీలో ఒక నిశ్శబ్ద విప్లవాన్ని తీసుకురాగలిగాను. బాలికలు చదువుకుంటున్నారు, మహిళలు సొంతంగా డబ్బు సంపాదించుకుంటున్నారు. పిల్లల, పోషణ, పెంపకం గురించి బాధ్యతగా ఉంటున్నారు. తల్లి సంపాదిస్తున్నప్పుడే పిల్లలు ఆమెను గౌరవిస్తారు అని తాతగారు చెప్పిన మాటను ఆచరణలో చూస్తున్నాను’’ అన్నారు రుబీనా నఫీజ్ ఫాతిమా. – వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి. ఫొటోలు : మోర్ల అనిల్ కుమార్ ఇవి చదవండి: ఖైదీల రూటు జ్యూట్ వైపు -
ఫైసలా
వచ్చినవాళ్లలో ఎవరో జన్నతుల్ ఫిర్దౌస్ రాసినట్టున్నారు. మంచి వాసనొస్తోంది. కాని అసలు కంపంతా హుసేన్ చేశాడు. పంచాయితీ కూచుంది. బల్లపీటల మీద కూచున్నోళ్లు బల్లపీటల మీద ఉన్నారు.నులక మంచాల మీద కూచున్నోళ్లు నులక మంచాల మీద ఉన్నారు. వరండాలో చాటుగా ఘోషా పాటిస్తున్న ఆడవాళ్లు మాటకు అవసరం రాకపోతుందా అన్నట్టు కాచుకుని ఉన్నారు. ఒకవైపు హుసేను ఒకవైపు జుబేదా నిల్చున్నారు. మూడు నెలలుగా గొడవ జరుగుతూ ఉంది. గొడవ చేస్తున్నవాడు హుసేను. టీచరుద్యోగానికి వెళ్లిన జుబేదా ఇంకో స్కూలు సారు సైకిల్ మీద కూచుని కనిపించిందని గొడవ.‘పెళ్లయిన ఏడేళ్లలో మూడు కడుపులు పోయాయి. ముగ్గురు పిల్లలు పుట్టారు. పిల్లల సంచి పలుచనైందని డాక్టరమ్మ చెప్పి గోలీలు రాసిచ్చింది. కాని ఎన్నిగోలీలు వాడినా బహిష్టప్పుడు నొప్పితో బంతిలా మారిపోతున్నా. నేను ఉద్యోగం చేసే ఊరు బస్సులు తిరిగే ఊరు కాదు. పొద్దునొక జీపు సాయంత్రం ఒక జీపు తిరుగుతాయి. నొప్పికి వీలుగాక కాస్త ఇంటిదాక వదలమంటే, పాపం అన్నలాంటోడు, వచ్చి వదిలాడు. అది తప్పా’ అని జుబేదా జవాబు చెప్పింది. కాని వినట్లేదు. అసలు సంవత్సరం ఆరు నెలలుగా సతాయిస్తున్నాడు.‘నువ్వు దొడ్డుగైనావు. నా దోస్తులు చూసి నవ్వుతున్నారు’ అన్నాడొకసారి.‘నువ్వు మాత్రం పెళ్లయినప్పుడు ఎట్టున్నావో అట్టే ఉన్నావా. బొర్రా పిర్రా పెంచలేదా. నాది ఊబవొళ్లు. నీకు సేవ జేసిజేసి, పిల్లల్ని కనీకనీ ఈ ఒళ్లు వచ్చింది’ అంది జుబేదా.‘నలుగురితో మీద మీద పడి మాట్లాడుతున్నావు’‘నాది సర్కారు నౌకరీ. నలుగురితో కలుపుగోలుగా ఉండటమే నా కొలువు. కాదంటే చెప్పు మానేసి ఇంట్లో కూచుంటా’ఊహూ. వినట్లేదు.సంగతి తర్వాత తెలిసింది. ఊళ్లో ఒంటెద్దుబండి తిప్పే మస్తాను కూతురు ఫాతిమా వెనుక పడుతున్నాడట.ఆ పిల్ల మీద మోజుతో ఏదో ఒక కారణం చూసుకొని తన్ని పుట్టింటికి పంపుతున్నాడు.‘వాని మీద గత్తర పడ. వానికి సావు రాను. వాని కనుగుడ్లలో పువ్వులు పుయ్య. వాడి చేతుల్లో పుండ్లు పడ’ అని కూతురు ఇంటికొచ్చినప్పుడల్లా జుబేదా తల్లి తిట్లు లంకించుకుంటుంది.‘మీ ఇళ్లల్లో ఒక్కో మగాడు ఇద్దరు ముగ్గుర్ని చేసుకుంటారు గదా. ఇదేం కొత్త’ అంది ఇరుగమ్మ. ‘రా చూద్దూరా. మా అయ్య చేసుకున్నాడా. మా తాత చేసుకున్నాడా. మా ఫుప్పా చేసుకున్నాడా. మా ఆయన చేసుకున్నాడా. చేసుకునే బద్మాష్‌గాళ్లు ఏ కులం మతంలో అయినా ఉంటారు. చేసుకోనివాళ్లు కూడా ఎక్కడైనా ఉంటారు. నా ప్రాణానికే దొరికాడు ఇలాంటి లత్తుకోరుగాడు’ అంది జుబేదా తల్లి. ‘ఆ మస్తానుకు బుద్ధి లేదా. పెళ్లయినోడు పిల్ల వెంట పడుతుంటే బుద్ధి చెప్పాలి గదా. పిల్లనట్ట వదిలేస్తాడా సోబతు పొమ్మని’ అంది పొరుగమ్మ.‘ఆ మస్తానుగాడికి ముగ్గురు కూతుళ్లు. ఒక పిల్ల పెళ్లికే నంగా అయ్యి గల్లీల పడ్డాడు. ఇంకో ఇద్దరు బిడ్డల నిఖాలు ఎక్కడ జరిపిస్తాడు? పూట పూటకు దిక్కులు చూడాల్సిన పరిస్థితి. ఇంటి పిల్ల రెండోదానిగానో మూడోదానిగానో వెళ్లినా వేళకు రెండు ముద్దలైనా తింటుందని ఆశ పడుతున్నాడు గాబోలు. ఆకలికి మనుషుల్ని అమ్ముకునే బేహాలతు ఉన్నంత కాలం ఇలాంటి వాళ్లు ఉండనే ఉంటారు. అసలు వాళ్లను అని ఏం ప్రయోజనం. మన బంగారం మంచిదైతే కదా’ అంది జుబేదా.ఇలాంటి తకరార్లు, తగాదాలు జరిగి మొగునికి బుద్ధి చెప్పే విషయంగా పంచాయితీ కూచోబెట్టింది జుబేదా. టోపీలు, గడ్డాలు, సుర్మాలు, బుర్ఖాలు అన్నీ కొలువు దీరాయి.‘మరి ఏమంటావు హుసేనా?’ అన్నాడు మసీదు పెద్ద.హుసేను ముందుకొచ్చి, జంకూ గొంకూ లేకుండా ‘నాకిద్దరూ గావాలె’ అన్నాడు.‘అట్టెట్ట కుదురుద్ది’ అని ఘోషాలో నుంచి ఎవరో ఆడామె అనబోయింది.‘ఆడోళ్లు నోరు ముయ్యండి. మగాళ్లం మాట్లాడుతున్నాం కదా’ కసిరాడు మసీదు పెద్ద. ‘నాకు ఇద్దర్ని పోషించే హోస్లా ఉంది. పోషించే హోస్లా ఉన్నప్పుడు చేసుకొమ్మని మతం చెప్పింది గదా. ఇంకేంటి’ అన్నాడు హుసేను.మసీదు పెద్ద ఫాతిమాని పిలిపించాడు. ‘పెళ్లయినోణ్ణి కోరుతున్నావ్. వాణ్ణి కోరడం మంచి పనేనా?’ ఫాతిమా పక్కా ఇరాదాతో అంది– ‘నాకు వాడు గావాలె’. ‘ఏం మస్తానా. పెళ్లయినవాడికిచ్చి నీ కూతురి గొంతు కోద్దామనుకుంటున్నావా?’మస్తాన్ ఏమీ మాట్లాడలేదు. తల వొంచుకుని కూచున్నాడు. ‘ఇంకేంది పంచాయితీ తేలిపోయింది. ఇద్దరూ పడి ఉండండి’ అన్నాడు మసీదు పెద్ద. ‘ఏంటి?’ అంది జుబేదా ముందుకొచ్చి. ‘పోషించే హోస్లా ఉందంటున్నాడుగా నీ మొగుడు. నువ్వుంటావు. అదీ ఉంటుంది. అదే తీర్పు’ అన్నాడు మసీదు పెద్ద. ‘అయితే నా తీర్పు వినండి’ అంది జుబేదా. ‘ఒళ్లు దొడ్డుగయ్యింది ముక్కు సొట్టబొయ్యింది అని నెపం పెట్టి ఇవాళ ఇంకోదాన్ని తీసుకొస్తున్నాడు. రేపు ఆ రెండోదాన్ని నువ్వు నల్లగున్నావు రాత్రేళ సల్లగున్నావు అని వేరేదాన్ని తేకుండా ఉంటాడా? నేనూ మనిషినే. ఒకమ్మ కడుపున పుట్టిన్దాన్నే. చదువుకున్నా.ఉద్యోగం ఉంది. నా బతుకు నేను బతగ్గలను. నన్ను గౌరవించని మొగుడు నాకెందుకు. హోస్ల ఉంటే ఇంకోదాన్ని తెచ్చుకోమని చెప్పిన మతమే సరిపడని మగాణ్ణి వదిలించుకొమ్మని కూడా చెప్పింది. బహిష్టు నొప్పప్పుడు తంగేడు పుల్ల నవిలితే నొప్పి పోతుందని నవిలా. పోలేదు. పిల్లలసంచి తీసి పారెయ్ పోతుంది అని డాక్టరమ్మ చెప్తే రేపొస్తానని వచ్చా. ఈ పుల్ల పంచాయితీ ఎంత మందమో తెలిసిపోయింది. నా పిల్లలసంచి లాగే వీణ్ణి కూడా తీసి అవతల పారేస్తున్నా. నాకు ఖులా ఇప్పించండి’ అని, బోర్లేసిన చేతులను నడుం మీద ఉంచి అందరి వైపు తీక్షణంగా చూస్తూ నిలబడింది జుబేదా. కథ ముగిసింది. రుబీనా పర్వీన్ రాసిన ‘ఖులా’ కథ ఇది.ఇస్లాంలో పెళ్లి అగ్రిమెంట్లాంటిది. అందులో నుంచి బయటపడటానికి మగవాడికి ‘తలాక్’ ఏర్పాటు ఎలా ఉందో స్త్రీకి ‘ఖులా’ ఏర్పాటు అలా ఉంది. తగిన నోటీసు ఇచ్చి తలాక్ ఎలా చెప్పవచ్చో తగిన నోటీస్ ఇచ్చి ఖులా కూడా చెప్పవచ్చు. ముస్లిం స్త్రీ ఖులా తీసుకోదలిస్తే ఆపే శక్తి ఎవరికీ లేదు. తమను ఇబ్బంది పెట్టే మగవాళ్లకు ఖులా ఇచ్చే ఆడవాళ్ల సంఖ్య హైదరాబాద్‌లో పెరిగిందని ఇటీవలి అధ్యయనం చెప్పింది. ఏ స్త్రీకైనా జీవితంలో ఆత్మగౌరవమే ప్రథమం. మతం ద్వితీయం. అది ఏ మతమైనా సరే. పునః కథనం: ఖదీర్ - రుబీనా పర్వీన్ -
రుబీనా సమస్య ఇప్పటికైనా తీరేనా..!
కరాచీ: ఎట్టకేలకు భారత్‌లోని జమ్ము జైలులో ఉంటున్న పాక్ మహిళ రుబీనా సమస్యకు పరిష్కారం దొరకనుంది. మరో జైలులో ఉంటున్న ఆమె కూతురుకు కూడా ఉపశమనం కలగనుంది. దాదాపు నాలుగేళ్ల తర్వాత పాకిస్థాన్‌కు ఆమె విషయంలో కదలిక వచ్చింది. ఆమె తమ దేశస్తురాలో కాదో పరిశీలించి, వివరాలు తెలుసుకుని, తమ దేశానికి తీసుకెళ్లేందుకు నిర్ణయించుకుంది. పాకిస్థాన్ అంతర్గత వ్యవహారాల మంత్రి చౌదరీ నిసార్ అలీ ఖాన్ సోమవారం ఈ మేరకు తమ ఉన్నతాధికారులను ఆదేశించారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. పాకిస్థాన్‌కు చెందిన రుబీనా అనే మహిళ తన భర్త మైనర్ కూతురుతో ఢిల్లీకి వచ్చింది. అయితే ఆమె భర్త ఢిల్లీలో మోసం చేసి విడిచిపెట్టి వెళ్లాడు. అయితే, చుట్టుపక్కలవారు ఆమెపై జాలితో డబ్బు సాయం చేయగా నాడు వాఘా సరిహద్దుకు వెళ్లింది. అయితే, ఆమె దగ్గర ట్రావెలింగ్ పత్రాలు లేకపోవడంతో అక్కడి పాక్ అధికారులు ఆమెను అనుమతించలేదు. ఈ సంఘటన నాలుగేళ్ల కిందట చోటు చేసుకుంది. దీంతో వారిని కశ్మీర్లో భారత పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం ఆ వివరాలను పాక్ హైకమిషనర్‌కు తెలియజేయగా వారిని తమ దేశస్తులుగా గుర్తించేందుకు నిరాకరించడంతోపాటు వారికి సహాయం చేసేందుకు కూడా నిరాకరించింది. దీంతో వారిని నాలుగేళ్లుగా జమ్ములోని రెండు వేర్వేరు జైలులో పోలీసులు ఉంచుతున్నారు. ఈమె కేసును విచారిస్తున్న మిర్ షాఫకత్ అనే న్యాయవాది కూడా గతంలో కోర్టుకు వివరణ ఇచ్చారు. రుబీనా పాకిస్థాన్‌లోని సింద్ ప్రావిన్స్‌లోగల హైదరాబాద్‌కు చెందిన మహిళ అని, తన భర్తతో కలిసి 2012 నవంబర్‌లో ఢిల్లీకి వచ్చిందని 2012లోనే వాదనలు వినిపించారు. అయినప్పటికీ అప్పుడు చలించని పాక్ తాజాగా స్పందించింది. రుబీనా పాక్ జాతీయురాలిగా గుర్తిస్తే తిరిగి మాతృదేశానికి తీసుకొచ్చే ఏర్పాట్లు చేయాలని కూడా ఆమె ఆయన తాజా ఆదేశాల్లో కోరారు.