ఆసియా క్రీడల స్క్వాష్ ఈవెంట్‌లో భారత్ రెండు స్వర్ణ పతకాలపై గురి పెట్టింది. మిక్స్‌డ్ డబుల్స్‌లో దీపిక పల్లికల్–హరీందర్‌పాల్ జోడీ ఫైనల్లోకి దూసుకెళ్లగా... భారత్‌కే చెందిన అనాహత్ సింగ్–అభయ్ సింగ్ జంట సెమీఫైనల్లో ఓడిపోయి కాంస్య పతకాన్ని సొంతం చేసుకుంది. పురుషుల సింగిల్స్‌లో సౌరవ్ ఘోషాల్ కూడా తుది పోరుకు అర్హత సాధించాడు.
బుధవారం జరిగిన మిక్స్‌డ్ డబుల్స్ సెమీఫైనల్స్‌లో దీపిక–హరీందర్ ద్వయం 7–11, 11–7, 11–9తో లీ కా యి–వోంగ్ చి హిమ్ (హాంకాంగ్) జంటను ఓడించింది. అనాహత్–అభయ్ జోడీ 11–8, 2–11, 9–11తో అజ్మాన్ ఐఫా–మొహమ్మద్ కమాల్ (మలేసియా) జంట చేతిలో ఓడిపోయింది. పురుషుల సింగిల్స్ సెమీఫైనల్లో సౌరవ్ 11–2, 11–1, 11–6తో చి హిన్ హెన్రీ (హాంకాంగ్)పై గెలుపొందాడు.
Comments
Please login to add a commentAdd a comment