చైనా వేదికగా జరుగుతున్న ఆసియాక్రీడల్లో భారత గోల్ఫర్ అదితి అశోక్ చరిత్ర సృష్టించింది. ఆదివారం జరిగిన మహిళల గోల్ఫ్ పోటీలో అదితి అశోక్ రజత పతకం కైవసం చేసుకుంది. తద్వారా ఆసియా క్రీడల్లో గోల్ఫ్ విభాగంలో పతకం సాధించిన తొలి భారతీయ మహిళగా అదితి రికార్డులకెక్కింది.
అండర్-17 స్కోర్‌తో నాలుగు రౌండ్ల పోటీని ముగించిన అదితి రెండో స్ధానంలో నిలిచింది. ఇక అండర్-19 స్కోర్‌తో అగ్రస్ధానంలో నిలిచిన థాయ్‌లాండ్ గోల్ఫర్ అర్పిచాయ యుబోల్ బంగారు పతకం సొంతం చేసుకుంది. ఇప్పటివరకు ఈ ఏడాది ఆసియాక్రీడల్లో భారత్ మొత్తం 41 పతకాలు సాధించింది. అందులో 11 బంగారు పతకాలు, 16 సిల్వర్, 14 కాంస్య పతకాలు ఉన్నాయి.
చదవండి: కొంచెం బాధగా ఉంది.. నాకు అలవాటు అయిపోయింది: చాహల్
Comments
Please login to add a commentAdd a comment