Asian Games 2023 Hockey: సింగపూర్‌పై భారత ఘన విజయం.. | Asian Games 2023 Hockey: Harmanpreet Singh Scores Four As India Beat Singapore 16-1 In Mens Hockey - Sakshi
Sakshi News home page

Asian Games 2023 Hockey: సింగపూర్‌పై భారత ఘన విజయం..

Published Tue, Sep 26 2023 9:54 AM | Last Updated on Tue, Sep 26 2023 11:00 AM

Harmanpreet Singh scores four as India beat Singapore 16-1 - Sakshi

చైనా వేదికగా జరగుతున్న ఆసియాక్రీడలు-2023లో భారత పురుషుల హాకీ జట్టు సత్తా చాటుతోంది. ప్రిలిమినరీ రౌండ్‌ పూల్‌-ఏ మ్యాచ్‌లో సింగపూర్‌పై 16-1 తేడాతో భారత్‌ ఘన విజయం సాధించింది. భారత జట్టులో హర్మన్‌ ప్రీత్‌ సింగ్‌ హ్యాట్రిక్ గోల్స్‌తో మెరిశాడు. ఓవరాల్‌గా హర్మన్‌ ప్రీత్‌ సింగ్‌ నాలుగు గోల్స్‌ చేయగా.. మన్‌దీప్‌ సింగ్‌ మూడు, వరుణ్‌కుమార్‌, అభిషేక్‌ తలా రెండు గోల్స్‌ చేశారు.

ఇక ఈ విజయంతో పూల్‌-ఏ పాయింట్ల పట్టికలో భారత్‌ అగ్రస్ధానాన్ని సుస్థిరం చేసుకుంది. ప్రతి పూల్‌లో మొదటి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు సెమీఫైనల్‌కు అర్హత సాధిస్తాయి. భారత తమ తదుపరి మ్యాచ్‌లో జపాన్‌తో తలపడనుంది. కాగా మొదటి మ్యాచ్‌లో ఉజ్బెకిస్థాన్‌ను 16-0 తేడాతో భారత్‌ చిత్తు చేసిన సంగతి తెలిసిందే.
చదవండి: World Cup 2023: భారత్‌ను ఓడించిన జట్టు వరల్డ్‌కప్‌ గెలుస్తుంది.. మా జట్టుకు దిష్టి పెట్టకు!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement