
ఆసియా క్రీడల బ్యాడ్మింటన్ ఈవెంట్‌లో భారత స్టార్స్ పీవీ సింధు, కిడాంబి శ్రీకాంత్, ప్రణయ్ ప్రిక్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించారు. రెండో రౌండ్ మ్యాచ్‌ల్లో సింధు 21–10, 21–15తో వి చి సు (చైనీస్ తైపీ)పై, శ్రీకాంత్ 21–16, 21–11తో లీ యున్ జియు (కొరియా)పై, ప్రణయ్ 21–9, 21–12తో బత్‌దవా ముంఖ్‌బత్ (మంగోలియా)పై గెలిచారు. మహిళల డబుల్స్ తొలి రౌండ్‌లో పుల్లెల గాయత్రి–ట్రెసా జాలీ జోడీ 21–14, 21–12తో నబీహా–ఫాతిమత్ (మాల్దీవులు) జంటపై గెలిచి ప్రిక్వార్టర్ ఫైనల్ చేరింది.
స్క్వాష్ ‘మిక్స్‌డ్’లో పతకం ఖాయం
స్క్వాష్ ‘మిక్స్‌డ్ డబుల్స్’ విభాగంలో దీపిక పల్లికల్–హరీందర్ పాల్ సింగ్ జోడీ సెమీఫైనల్లోకి ప్రవేశించింది. దాంతో ఈ ఈవెంట్‌లో భారత్‌కు కనీసం కాంస్య పతకం ఖాయమైంది. క్వార్టర్ ఫైనల్లో దీపిక –హరీందర్ 7–11, 11–5, 11–4 స్కోరుతో ఫిలిప్పీన్స్‌కు చెందిన అరిబాడో–ఆండ్రూ గారికాపై గెలిచారు.
చదవండి: WC 2023: శ్రీలంకకు షాకిచ్చిన ఆఫ్గానిస్తాన్.. 6 వికెట్ల తేడాతో ఘన విజయం
Comments
Please login to add a commentAdd a comment