Asian Games 2023: భారత్‌ ఖాతాలో మరో గోల్డ్‌ మెడల్‌ | Indian Shooters Clinch Gold In Trap 50 Mens Team Event At Asian Games | Sakshi
Sakshi News home page

Asian Games 2023: భారత్‌ ఖాతాలో మరో గోల్డ్‌ మెడల్‌

Published Sun, Oct 1 2023 5:49 PM | Last Updated on Sun, Oct 1 2023 6:17 PM

Indian Shooters Clinch Gold In Trap 50 Mens Team Event At Asian Games - Sakshi

ఏషియన్‌ గేమ్స్‌ 2023లో భారత్‌ పతకాల వేటలో దూసుకుపోతుంది. ఆదివారం భారత్‌ ఖాతాలో మరో స్వర్ణం చేరింది. పురుషుల ట్రాప్‌ షూటింగ్‌ టీమ్‌ ఈవెంట్‌లో భారత షూటర్లు పృథ్వీరాజ్‌ తొండైమాన్‌, క్యానన్‌ చెనై, జొరావర్‌ సింగ్‌ సంధు గోల్డ్‌ మెడల్‌ సాధించాడు. ఈ పతకంతో భారత్‌ ఖాతాలో 12వ గోల్డ్‌ మెడల్‌ చేరింది. ఓవరాల్‌గా భారత్‌ ఖాతాలో ప్రస్తుతం 44 మెడల్స్‌ (12, 16, 16) ఉన్నాయి.

పతకాల పట్టికలో భారత్‌ నాలుగో స్థానంలో కొనసాగుతుండగా.. చైనా 229 పతకాలతో (121 గోల్డ్‌, 71 సిల్వర్‌, 37 బ్రాంజ్‌) అగ్రస్థానంలో దూసుకుపోతుంది. రిపబ్లిక్‌ ఆఫ్‌ కొరియా 121 పతకాలతో (30, 33, 58) రెండో స్థానంలో, జపాన్‌ 108 మెడల్స్‌తో (29, 39, 40) మూడో స్థానంలో ఉన్నాయి.

ఇదిలా ఉంటే, మెన్స్‌ ట్రాప్‌-50 టీమ్‌ ఈవెంట్‌లో పృథ్వీరాజ్‌ తొండైమాన్‌, క్యానన్‌ చెనై, జొరావర్‌ సింగ్‌ సంధు త్రయం స్వర్ణం సాధించడానికి ముందు మహిళల ట్రాప్‌ టీమ్‌ ఈవెంట్‌లో భారత్‌ సిల్వర్‌ మెడల్‌ సొంతం చేసుకుంది.. మనీశా కీర్‌, ప్రీతి రజక్‌, రాజేశ్వరి కుమారి  టీమ్‌ భారత్‌కు 16వ సిల్వర్‌ మెడల్‌ అందించింది. దీనికి ముందు అదితి అశోక్‌ గోల్ఫ్‌లో భారత్‌కు రజత పతకం అందించింది. అదితి ఆసియా క్రీడల్లో గోల్ఫ్‌ విభాగంలో పతకం సాధించిన తొలి భారతీయ మహిళగా రికార్డులకెక్కింది. అంత‌కుముందు 1982లో లక్ష్మనన్ సింగ్ భారత్‌కి గోల్ఫ్‌లో స్వర్ణం అందించాడు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement