
ఆసియా క్రీడల్లో తొలిసారి క్రికెట్‌కు చోటు దక్కిన విషయం తెలిసిందే. చైనాలో జరుగనున్న ఈ దఫా ఆసియా క్రీడల్లో భారత పురషుల క్రికెట్ జట్టుతో పాటు మహిళల క్రికెట్ జట్టు కూడా పాల్గొంటుంది. స్వర్ణమే లక్ష్యంగా భారత్ ఈ రెండు విభాగాల్లో పోటీపడుతుంది. ఈ క్రీడల కోసం బీసీసీఐ పటిష్టమైన పురుషుల జట్టును ఎంపిక చేసింది. రుతురాజ్ గైక్వాడ్ నేతృత్వంలోని టీమిండియా.. అక్టోబర్ 3న తమ తొలి మ్యాచ్ (క్వార్టర్ ఫైనల్ 1) ఆడుతుంది.
ఈ క్రీడల్లో భారత్‌తో పాటు పాకిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్ జట్లు నేరుగా క్వార్టర్స్‌కు అర్హత సాధించాయి. టీమిండియా క్వార్టర్స్‌లో గెలిస్తే.. అక్టోబర్ 6న సెమీఫైనల్ మ్యాచ్ ఆడుతుంది. భారత్ సెమీస్‌లో గెలిస్తే అక్టోబర్ 7న జరిగే ఫైనల్లో స్వర్ణం కోసం పోటీపడుతుంది. భారత్ ఆడే క్వార్టర్ ఫైనల్, సెమీస్ మ్యాచ్‌లు భారతకాలమానం ప్రకారం ఉదయం 6:30 గంటలకు ప్రారంభం కానుండగా.. ఫైనల్ మ్యాచ్ ఉదయం 11 గంటలకు మొదలవుతుంది. ఆసియా క్రీడల్లో క్రికెట్ టీ20 ఫార్మాట్‌లో జరుగనుంది.
కాగా, సెప్టెంబర్ 27న మొదలయ్యే గ్రూప్ మ్యాచ్‌లతో పురుషుల క్రికెట్ ఈవెంట్ ప్రారంభమవుతుంది. ఈ ఈవెంట్‌లో పాల్గొనే 9 జట్లు మూడు గ్రూప్‌లుగా విభజించబడ్డాయి. గ్రూప్-ఏలో నేపాల్, మంగోలియా, మాల్దీవ్స్.. గ్రూప్-బిలో జపాన్, కంబోడియా, హాంగ్‌కాంగ్.. గ్రూప్-సిలో మలేసియా, సింగపూర్, థాయ్‌లాండ్ జట్లు పోటీపడతాయి. ఒక్కో జట్టు తమ గ్రూప్‌లోని మిగతా రెండు జట్లతో చెరో మ్యాచ్ ఆడుతుంది. అనంతరం క్వార్టర్స్, సెమీస్, ఫైనల్స్ జరుగుతాయి.
కొత్త జెర్సీలో తళుక్కుమంటున్న భారత క్రికెటర్లు..
ఏషియన్ గేమ్స్ 2023లో భారత క్రికెటర్లు కొత్త జెర్సీతో బరిలోకి దిగుతారు. JSW స్పాన్సర్ చేసిన ఈ జెర్సీలోనే ఆసియా క్రీడల్లో పాల్గొనే మొత్తం భారత బృందం బరిలోకి దిగుతుంది. కొత్త జెర్సీలో భారత యువ క్రికెటర్లు తళుక్కుమంటున్నారు.
ఆసియా క్రీడల్లో పాల్గొనే భారత పురుషుల క్రికెట్ జట్టు.. రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), తిలక్ వర్మ, యశస్వి జైస్వాల్, రాహుల్ త్రిపాఠి, రింకూ సింగ్, వాషింగ్టన్ సుందర్, షాబాజ్ అహ్మద్, జితేశ్ శర్మ, ప్రభ్‌సిమ్రన్ సింగ్, రవి బిష్ణోయ్, ముకేశ్ కుమార్, ఆవేశ్ ఖాన్, అర్షదీప్ సింగ్, ఆకాశ్ దీప్
Comments
Please login to add a commentAdd a comment