ఆసియాక్రీడలు-2023 పురుషల క్రికెట్ క్వార్టర్ ఫైనల్లో నేపాల్‌పై టీమిండియా యువ ఓపెనర్ యశస్వీ జైశ్వాల్ విరోచిత శతకంతో చెలరేగాడు. 48 బంతులు ఎదుర్కొన్న జైశ్వాల్ 8 ఫోర్లు, 7 సిక్స్‌లతో 100 పరుగులు చేశాడు. కాగా ఇది జైశ్వాల్‌కు తొలి అంతర్జాతీయ టీ20 సెంచరీ. తద్వారా పలు అరుదైన రికార్డులను జైశ్వాల్ తన పేరిట లిఖించుకున్నాడు.
జైశ్వాల్ సాధించిన రికార్డులు ఇవే..
ఆసియాక్రీడల్లో సెంచరీ సాధించిన తొలి ఇండియన్‌గా జైశ్వాల్ రికార్డులకెక్కాడు. ఇప్పటివరకు ఈ క్రీడల్లో పురుషల, మహిళలల క్రికెట్‌లో ఎవరూ ఈ ఘనత సాధించలేదు. అదే విధంగా అంతర్జాతీయ టీ20ల్లో అత్యంత పిన్నవయస్సులో సెంచరీ చేసిన భారత ఆటగాడిగా యశస్వీ నిలిచాడు. 21 ఏళ్ల తొమ్మిది నెలల 13 రోజుల వయస్సులో జైశ్వాల్ ఈ ఘనతను అందుకున్నాడు.
అంతకుముందు ఈ రికార్డు టీమిండియా మరో యువ ఓపెనర్ శుబ్‌మన్ గిల్ పేరిట ఉండేది. గిల్ న్యూజిలాండ్‌పై 23 ఏళ్ల 146 రోజుల్లో సెంచరీ చేశాడు. తాజా మ్యాచ్‌తో గిల్ రికార్డును జైశ్వాల్ బ్రేక్ చేశాడు. అదే విధంగా ఇంటర్ననేషనల్ టీ20ల్లో సెంచరీ నమోదు చేసిన ఎనిమిదో భారత ఆటగాడిగా జైశ్వాల్ నిలిచాడు. ఈ జాబితాలో సురేష్ రైనా, విరాట్ కోహ్లి, కేఎల్ రాహుల్, రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, దీపక్ హుడా, శుబ్‌మన్ గిల్ ఉన్నారు. ఈ జాబితాలోకి జైశ్వాల్ కూడా చేరాడు.
చదవండి: Asian games 2023: యశస్వీ జైశ్వాల్ విధ్వంసకర సెంచరీ..
Comments
Please login to add a commentAdd a comment