
ఆసియా క్రీడలు 2023లో భారత్ పతకాల ఖాతా తెరిచింది. ఆదివారం భారత ఖాతాలో రెండు పతకాలు వచ్చి చేరాయి. మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ టీమ్ ఈవెంట్‌లో ఇండియా రజిత పతకం సొంతం చేసుకుంది. ఈ ఈవెంట్‌లో మెహులీ ఘోష్, రమిత, ఆషి చౌక్సే షూటర్లతో కూడిన భారత జట్టు.. 1886 స్కోర్‌తో రెండో స్ధానంలో నిలిచింది. దీంతో సిల్వర్ మెడల్ భారత్‌ను వరించింది. ఇక 1896 స్కోర్‌తో మొదటి స్ధానంలో నిలిచిన చైనా బంగారు పతకాన్ని ఎగరేసుకుపోయింది.
మరోవైపు రోయింగ్‌లో కూడా భారత్ సిల్వర్ మెడల్ కైవసం చేసుకుంది. రోయింగ్ లైట్ వెయిట్ డబుల్ స్కల్స్ ఫైనల్లో అర్జున్ లాల్, అరవింద్ సింగ్ రెండో స్ధానంలో నిలిచారు. ఇక మొదటి స్ధానంలో నిలిచిన చైనా గోల్డ్ మెడల్ సొంతం చేసుకుంది.
చదవండి: Asian Games 2023: ఉవ్వెత్తున ఎగసిన ‘ఆసియా’ ఉత్సవం.. పతకాల వేటకు రంగం సిద్దం