Asian Games Mens T20I 2023 - Nepal vs Mongolia: ఆసియా క్రీడలు-2023లో నేపాల్ క్రికెటర్ కుశాల్ మల్లా సంచలన ఇన్నింగ్స్‌తో మెరిశాడు. 34 బంతుల్లోనే శతకం సాధించి చరిత్ర సృష్టించాడు. అంతర్జాతీయ టీ20 ఫార్మాట్‌లో తక్కువ బంతుల్లోనే వంద పరుగుల మార్కు అందుకుని ఫాస్టెస్ట్ సెంచరీ నమోదు చేశాడు.
తద్వారా టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, సౌతాఫ్రికా స్టార్ డేవిడ్ మిల్లర్(35 బాల్స్ సెంచరీ) పేరిట సంయుక్తంగా ఉన్న రికార్డు బద్దలు కొట్టాడు. మంగోలియాతో మ్యాచ్ సందర్భంగా చైనా వేదికగా బుధవారం ఈ ఫీట్ నమోదు చేశాడు.
మెన్స్ క్రికెట్ ఈవెంట్ మొదలు
కాగా ఆసియా క్రీడల్లో భాగంగా బుధవారం నేపాల్, మంగోలియా హొంగ్జూలోని పిన్‌ఫెంగ్ క్యాంపస్ క్రికెట్ ఫీల్డ్‌లో పోటీకి దిగాయి. గ్రూప్-ఏలో భాగమైన ఈ జట్ల మధ్య పోరుతో మెన్స్ టీ20 క్రికెట్ ఈవెంట్‌కు తెరలేచింది. టాస్ గెలిచిన మంగోలియా తొలుత బౌలింగ్ ఎంచుకుంది.
ఈ క్రమంలో నేపాల్ ఓపెనర్లు విఫలం కాగా.. వన్‌డౌన్‌లో వచ్చిన కుశాల్ మల్లా 50 బంతుల్లో 137, ఐదో స్థానంలో వచ్చిన దీపేంద్ర సింగ్ ఆరీ 10 బంతుల్లో 52 పరుగులతో సంచలన ఇన్నింగ్స్ ఆడారు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి నేపాల్ 314 పరుగులు చేసింది.
చదవండి: పసికూనపై ఇంగ్లండ్ ప్రతాపం.. ఫిలిప్ సాల్ట్ విధ్వంసం.. 28 బంతుల్లోనే..!
Comments
Please login to add a commentAdd a comment