చైనాలోని హాంగ్జౌ వేదికగా జరుగుతున్న ఏషియన్ గేమ్స్-2023లో మంగోలియా మహిళల క్రికెట్ జట్టు మరోసారి ఘోర ప్రదర్శన కనబరిచింది. వరుసగా రెండో మ్యాచ్‌లో ఓడిన మంగోలియా.. టోర్నీ నుంచి ఇంటిముఖం పట్టింది.
ఈ ఈవెంట్లో భాగంగా బుధవారం హాంకాంగ్‌తో జరిగిన క్వాలిఫయర్ మ్యాచ్‌లో ఏకంగా 180 పరుగుల తేడాతో మంగోలియా ఓటమి పాలైంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన హాంకాంగ్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 202 పరుగులు చేసింది.
హాంకాంగ్ బ్యాటర్లలో కెప్టెన్ కారీ చాన్ (70) పరుగులతో అద్భుత ఇన్నింగ్స్ ఆడగా.. యీ షాన్ టోనోట్(34 నాటౌట్),మర్యం బీబీ(30) పరుగులతో రాణించారు. కాగా మంగోలియన్ బౌలర్లు ఏకంగా 36 పరుగులు ఎక్స్ట్రాస్గా ఇవ్వడం గమనార్హం.
22 పరుగులకే ఆలౌట్
అనంతరం 203 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన మంగోలియా 12.4 ఓవర్లలో కేవలం 22 పరుగులకే కుప్పకూలింది. హాంకాంగ్ బౌలర్లలో అలిసన్ సియు, కానీ చాన్ తలా రెండు వికెట్లు సాధించగా.. బీబీ, యూసఫ్, అమండా చెయుంగ్ చెరో వికెట్ సాధించారు.
కాగా అంతకుముందు మ్యాచ్‌లో కూడా ఇండోనేషియాపై మంగోలియా ఈ తరహా ప్రదర్శనే చేసింది. ఇండోనేషియాతో జరిగిన మ్యాచ్‌లో మంగోలియా కేవలం 15 పరుగులకే ఆలౌటైంది. దీంతో అంతర్జాతీయ టీ20ల్లో అత్యల్ప స్కోర్ నమోదు చేసిన రెండో జట్టుగా మంగోలియా చెత్త రికార్డు నెలకొల్పింది.
చదవండి: ODI World Cup 2023: వరల్డ్‌కప్‌కు ముందు దక్షిణాఫ్రికాకు బిగ్ షాక్.. స్టార్ ప్లేయర్ ఔట్!
Indonesia Women win comprehensively over Mongolia Women in this Asian Games fixture. The Indonesians put up a huge total on the board first, then bowled out their opposition for just 15 runs!#AsianGames pic.twitter.com/FgxMI1mIub
— AsianCricketCouncil (@ACCMedia1) September 19, 2023
Comments
Please login to add a commentAdd a comment