టీమిండియా స్టార్, టీ20 వరల్డ్ నంబర్ వన్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ పొట్టి ప్రపంచకప్ తాజా ఎడిషన్‌లో ఇంత వరకూ బ్యాట్ ఝులిపించనే లేదు. వరల్డ్‌కప్-2024లో భాగంగా తొలుత ఐర్లాండ్‌తో టీమిండియా తలపడగా.. సూర్య నాలుగు బంతులు ఎదుర్కొని కేవలం 2 పరుగులే చేశాడు.
ఇక చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో మ్యాచ్‌లోనూ మిస్టర్ 360 చేతులెత్తేశాడు. ఐదో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన సూర్య.. 8 బంతులు ఎదుర్కొని ఏడు పరుగులు మాత్రమే చేయగలిగాడు. హ్యారిస్ రవూఫ్ బౌలింగ్‌లో ఆమిర్‌కు క్యాచ్ ఇచ్చి నిష్క్రమించాడు.
ఇక ఈ మ్యాచ్‌లో టీమిండియా గెలిచినా సూర్య ఫామ్ మాత్రం ఆందోళనకరంగా పరిణమించింది. ముఖ్యంగా ఇలాంటి కీలక మ్యాచ్‌లలో సూర్య తేలిపోవడం విమర్శలకు దారితీసింది.
ప్రపంచకప్-2022 సమయంలోనూ పాక్‌తో మ్యాచ్‌లో సూర్యకుమార్ యాదవ్ 10 బంతుల్లో 15 రన్స్ చేసి నిష్క్రమించాడు. ఇక గతేడాది వన్డే వరల్డ్‌కప్ సమయంలోనూ ఒత్తిడిలో చిత్తయ్యాడు ఈ ముంబైకర్. ఆస్ట్రేలియాతో జరిగిన ఫైనల్లో 28 బంతులు ఎదుర్కొని కేవలం 18 పరుగులు మాత్రమే చేశాడు.
ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ ఓపెనర్ ఆకాశ్ చోప్రా సూర్యకుమార్ ఆట తీరు గురించి కీలక వ్యాఖ్యలు చేశాడు. ప్రధానమైన మ్యాచ్‌లలో చేతులెత్తేయడం సూర్యకు పరిపాటిగా మారిందని పేర్కొన్నాడు.
బిగ్ మ్యాచ్‌లలో ఒత్తిడిని తట్టుకోలేక
పాకిస్తాన్‌తో తాజా మ్యాచ్‌లో టీమిండియా బ్యాటింగ్ తీరును ప్రస్తావిస్తూ.. ‘‘పాకిస్తాన్ టాస్ గెలిచి ఇండియాను తొలుత బ్యాటింగ్ చేయమని అడిగింది. విరాట్ కోహ్లి.. ఆ తర్వాత రోహిత్ శర్మ అవుటయ్యారు.
ఆ సమయంలో రిషభ్ పంత్ బాధ్యతగా ఆడాడు. అతడికి తోడైన సూర్యకుమార్ ఎక్కువ సేపు క్రీజులో నిలవలేకపోయాడు. అదే ఇక్కడ పెద్ద ప్రశ్న.
మామూలుగా అయితే సూర్య బాగానే ఆడతాడు. కానీ బిగ్ మ్యాచ్‌లలో మాత్రం రాణింలేకపోతున్నాడు. గతంలో మెల్‌బోర్న్‌లో.. 2023 వరల్డ్‌కప్ సమయంలోనూ ఇలాగే జరిగింది. బిగ్ మ్యాచ్‌లలో అతడు ఒత్తిడిని తట్టుకోలేకపోతున్నాడా అనే ప్రశ్న తలెత్తుతోంది’’ అని ఆకాశ్ చోప్రా సూర్య ప్రదర్శనపై ఆందోళన వ్యక్తం చేశాడు.
చదవండి: Ind vs Pak: కావాలనే బంతులు వృథా చేశాడు: పాక్ మాజీ కెప్టెన్ ఫైర్
Comments
Please login to add a commentAdd a comment