వైట్‌బాల్ క్రికెట్‌లో అదరగొడుతున్న టీమిండియా ఓపెనర్ శుబ్‌మన్ గిల్.. టెస్టుల్లో మాత్రం తన మార్క్‌ను చూపించలేకపోతున్నాడు. 2023 ఏడాదిలో మొత్తంగా 45 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన గిల్ 7 సెంచరీలు, 10 అర్ధసెంచరీల సాయంతో 2,118 పరుగులు చేశాడు. అయితే ఏడాది టెస్టుల్లో మాత్రం గిల్ 10 ఇన్నింగ్స్‌లలో కేవలం 258 పరుగులు మాత్రమే చేశాడు.
అందులో ఒకే ఒక సెంచరీ ఉంది. మిగితా ఆరు సెంచరీలు వన్డేలు, టీ20లో చేసినవే. తాజాగా దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టెస్టులో కూడా గిల్ దారుణంగా విఫలమయ్యాడు. రెండు ఇన్నింగ్స్‌లు కలిపి కేవలం 28 పరుగులు మాత్రమే చేశాడు. ఈ నేపథ్యంలో గిల్‌పై టీమిండియా మాజీ ఆటగాడు ఆకాష్ చోప్రా కీలక వ్యాఖ్యలు చేశాడు. స్వదేశంలో కాకుండా విదేశీ పిచ్‌లపై కూడా రాణిస్తానే అత్యుత్తమ టెస్టు బ్యాటర్‌గా పరిగిణించబడతారని చోప్రా తెలిపాడు.
తన యూట్యూబ్ ఛానెల్‌లో చోప్రా మాట్లాడుతూ.. దక్షిణాఫ్రికాతో తొలి టెస్టులో శుబ్‌మన్ గిల్ ప్రదర్శన నన్ను చాలా నిరాశపరిచింది. గిల్‌ను అభిమానులు ప్రిన్స్ ఆఫ్ ఇండియన్ క్రికెట్ అని పిలుచుకుంటారు. ప్రిన్స్ నుంచి రాజుగా మారాలంటే అతడు రెడ్‌బాల్ క్రికెట్‌లో నిలకడగా రాణించాలి.
ముఖ్యంగా సేనా(సౌతాఫ్రికా, ఇంగ్లండ్,న్యూజిలాండ్, ఆస్ట్రేలియా) దేశాల్లో అతడి గణంకాలను మెరుగుపరుచుకోవాలి. ఆసియాలో అతడి రికార్డులు అద్బుతంగా ఉన్నాయి. అదే సేనా దేశాల్లో అతడి రికార్డులు ఆసియాకు భిన్నంగా ఉన్నాయి. గిల్‌కు ఇంకా చాలా కెరీర్ ఉంది. అతడు రాబోయో రోజుల్లో సేనా దేశాల్లో కూడా అద్భుతమైన ప్రదర్శన కనబరుస్తాడని ఆశిస్తున్నాను అని చెప్పుకొచ్చాడు.
చదవండి: Test team of the year 2023: అత్యుత్తమ టెస్టు జట్టు ఇదే.. కోహ్లి, రోహిత్‌లకు నో ఛాన్స్
Comments
Please login to add a commentAdd a comment