దక్షిణాఫ్రికాతో నాలుగు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో తలపడేందుకు టీమిండియా సిద్దమైంది. ఈ సిరీస్‌లో భాగంగా తొలి టీ20 ఇరు జట్ల మధ్య శుక్రవారం డర్బన్ వేదికగా జరగనుంది. ఈ సిరీస్‌లో సఫారీలను సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలోని యువ భారత జట్టు ఢీకొట్టనుంది.
ప్రోటీస్ సిరీస్‌కు యశస్వీ జైశ్వాల్, గిల్, రిషబ్ పంత్, బుమ్రా వంటి సీనియర్ ఆటగాళ్లు దూరమయ్యారు. దీంతో సౌతాఫ్రికా పర్యటనకు రమణ్‌దీప్ సింగ్, విజయ్‌కుమార్ వైశ్యాఖ్, యశ్ దయాల్ వంటి కొత్త ముఖాలకు భారత జట్టులో సెలక్టర్లు చోటు కల్పించారు.
ఈ నేపథ్యంలో యువ ఓపెనర్ అభిషేక్ శర్మను ఉద్దేశించి భారత మాజీ క్రికెటర్ ఆకాష్ చోప్రా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అభిషేక్ శర్మకు ఈ సిరీస్ డూ ఆర్ డై వంటిది అని చోప్రా అభిప్రాయపడ్డాడు. కాగా జింబాబ్వే సిరీస్‌తో టీ20ల్లో అంతర్జాతీయ అరంగేట్రం చేసిన అభిషేక్.. జైశ్వాల్ బ్యాకప్ ఓపెనర్‌గా కొనసాగుతున్నాడు.
జైశ్వాల్ గైర్హాజరీ సిరీస్‌లలో అభిషేక్‌కు సెలక్టర్లు చోటిస్తున్నారు. అయితే జింబాబ్వే సిరీస్‌లో సెంచరీ మినహా ఇప్పటివరకు అభిషేక్ చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేకపోయాడు. ఇప్పటివరకు 8 ఇన్నింగ్స్‌లు ఆడిన అభిషేక్.. 22.71 సగటుతో కేవలం 159 పరుగులు మాత్రమే చేశాడు.
"అభిషేక్ శర్మ ఈ సిరీస్‌లో చావోరెవో తెల్చుకోవాల్సిందే. ఎందుకంటే ఈ సిరీస్‌లో అభిషేక్ రాణించికపోతే వచ్చే ఏడాది ఆరంభంలో జరగనున్న ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్‌కు అతడిని కచ్చితంగా పక్కనపెట్టేస్తారు. అభిషేక్ శర్మ అద్భుతమైన ఆటగాడు అనడంలో ఎటువంటి సందేహం లేదు.
అతడి బ్యాటింగ్ స్టైల్ అంటే నాకు ఎంతో ఇష్టం. జింబాబ్వే పర్యటనలో సెంచరీ కూడా సాధించాడు. కానీ ఆ తర్వాత ఇప్పటివరకు అభిషేక్ చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేదని" చోప్రా తన యూట్యూబ్ ఛానల్‌లో పేర్కొన్నాడు.
చదవండి: IND-A vs AUS-A: నిప్పులు చెరిగిన భారత బౌలర్లు.. 223 పరుగులకు ఆసీస్ ఆలౌట్
Comments
Please login to add a commentAdd a comment