గత సీజన్‌లో కెప్టెన్‌గా వ్యవహరించిన మార్క్రమ్ (PC: ipl.com)
ఐపీఎల్-2024 ఆరంభానికి కౌంట్‌డౌన్ మొదలైంది. మార్చి 22న ఈ మెగా ఈవెంట్‌కు చెపాక్ వేదికగా తెరలేవనుంది. డిఫెండింగ్ చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్- రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మధ్య ఆరంభ మ్యాచ్ జరుగనుంది.
ఈ క్రమంలో మరుసటి రోజే అంటే మార్చి 23న సన్‌రైజర్స్ హైదరాబాద్ కోల్‌కతా నైట్ రైడర్స్‌తో తమ తొలి మ్యాచ్ ఆడనుంది. కోల్‌కతా వేదికగా ఈ మ్యాచ్ జరుగనుంది.
ఇదిలా ఉంటే.. గత కొన్నేళ్లుగా పేలవ ప్రదర్శనతో విమర్శలు మూటగట్టుకుంటున్న సన్‌రైజర్స్ ఈసారి మరో కొత్త కెప్టెన్‌తో ముందుకు రానుంది. ఆస్ట్రేలియా సారథి, వన్డే వరల్డ్‌కప్-2023 విజేత ప్యాట్ కమిన్స్‌పై కోట్లు కుమ్మరించి తన నాయకుడిగా ప్రకటించింది.
ఈ క్రమంలో సౌతాఫ్రికా కెప్టెన్ ఐడెన్ మార్క్రమ్‌పై వేటు వేసింది. ఇక జట్టులో వీరిద్దరితో పాటు మరో ఆరుగురు విదేశీ ప్లేయర్లు కూడా ఉన్నారు. నిబంధనల ప్రకారం తుదిజట్టులో కేవలం నలుగురు ఫారిన్ ప్లేయర్లను మాత్రమే ఆడించాలి.
ఈ నేపథ్యంలో సన్‌రైజర్స్ ప్లేయింగ్ ఎలెవన్ ఎలా ఉండబోతుందా అన్న చర్చల నడుమ.. టీమిండియా మాజీ ఓపెనర్, కామెంటేటర్ ఆకాశ్ చోప్రా తన జట్టును ప్రకటించాడు. విదేశీ ప్లేయర్ల కోటాలో కెప్టెన్ ప్యాట్ కమిన్స్‌తో పాటు.. ట్రవిస్ హెడ్, హెన్రిచ్ క్లాసెన్, మార్కో జాన్సెన్‌లకు తన టీమ్‌లో చోటిచ్చాడు.
‘‘అభిషేక్ శర్మ, ట్రవిస్ హెడ్.. ఇద్దరు లెఫ్టాండర్లతో ఓపెనింగ్ చేయించాలనుకుంటే వీరికి ఇన్నింగ్స్ ఆరంభించే అవకాశం ఇవ్వాలి. లేదంటే అభిషేక్‌ను వన్‌డౌన్‌లో ఆడించి.. మయాంక్ అగర్వాల్‌ను ఓపెనర్‌గా పంపాలి.
ఆ తర్వాతి స్థానాల్లో రాహుల్ త్రిపాఠి, హెన్రిచ్ క్లాసెన్, వాషింగ్టన్ సుందర్, మార్కో జాన్సెన్, ప్యాట్ కమిన్స్, భువనేశ్వర్ కుమార్, మయాంక్ మార్కండే, జయదేవ్ ఉనాద్కట్/ఉమ్రాన్ మాలిక్/టి. నటరాజన్‌లను పంపించాలి’’అని ఆకాశ్ చోప్రా అభిప్రాయపడ్డాడు.
ఒకవేళ స్పిన్ పిచ్‌లపై ఆడాల్సి వస్తే.. మార్కో జాన్సెన్ స్థానంలో వనిందు హసరంగను తీసుకుంటే బాగుంటుందని ఆకాశ్ చోప్రా సూచించాడు. షాబాజ్ అహ్మద్ రూపంలో మరో స్పిన్ బౌలింగ్ ఆప్షన్ కూడా ఉంది కాబట్టి పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొన్నాడు.
కాగా ఆకాశ్ చోప్రా తన తుదిజట్టులో ఐడెన్ మార్క్రమ్‌కు చోటు ఇవ్వకపోవడం గమనార్హం. గత సీజన్‌లో అతడు 13 ఇన్నింగ్స్ ఆడి సగటు 22.55తో 248 పరుగులు సాధించాడు.
ఐపీఎల్ 2024- సన్‌రైజర్స్ హైదరాబాద్- ఆకాశ్ చోప్రా తుదిజట్టు:
అభిషేక్ శర్మ, ట్రవిస్ హెడ్, మయాంక్ అగర్వాల్, రాహుల్ త్రిపాఠి, హెన్రిచ్ క్లాసెన్, వాషింగ్టన్ సుందర్, మార్కో జాన్సెన్, ప్యాట్ కమిన్స్, భువనేశ్వర్ కుమార్, మయాంక్ మార్కండే, జయదేవ్ ఉనాద్కట్/ఉమ్రాన్ మాలిక్/టి. నటరాజన్.
ఐపీఎల్-2024- సన్‌రైజర్స్ జట్టు:
అబ్దుల్ సమద్
ఐడెన్ మార్క్రమ్*
రాహుల్ త్రిపాఠి
గ్లెన్ ఫిలిప్స్*
హెన్రిచ్ క్లాసెన్*
మయాంక్ అగర్వాల్..
అన్మోల్ ప్రీత్ సింగ్
ఉపేంద్ర సింగ్ యాదవ్
నితీష్ కుమార్ రెడ్డి
అభిషేక్ శర్మ
మార్కో జాన్సెన్*
వాషింగ్టన్ సుందర్
సన్వీర్ సింగ్
భువనేశ్వర్ కుమార్
టి.నటరాజన్
మయాంక్ మార్కండే
ఉమ్రాన్ మాలిక్
ఫజల్హక్ ఫరూఖీ*
షాబాజ్ అహ్మద్ (ఆర్సీబీ నుంచి ట్రేడింగ్)
ట్రావిస్ హెడ్ * (వేలం - 6.80 కోట్లు)
వనిందు హసరంగ* (వేలం - 1.50 కోట్లు)
ప్యాట్ కమిన్స్* (వేలం - 20.50 కోట్లు)
జయదేవ్ ఉనాద్కట్ (వేలం - 1.60 కోట్లు)
ఆకాశ్ సింగ్ (వేలం - 20 లక్షలు)
ఝతావేద్ సుబ్రమణియన్ (వేలం - 20 లక్షలు)
*- విదేశీ ఆటగాళ్లు.
చదవండి: హార్దిక్ రిటైర్ అవ్వటమే బెటర్: భారత మాజీ పేసర్ షాకింగ్ కామెంట్స్
Comments
Please login to add a commentAdd a comment