బార్బోడస్ వేదికగా గురువారం వెస్టిండీస్‌తో జరగనున్న తొలి వన్డేలో తలపడేందుకు టీమిండియా సిద్దమైంది. ఈ మ్యాచ్‌లో ఇవాళ సాయంత్రం 7:00 గంటలకు ప్రారంభం కానుంది. టెస్టు సిరీస్‌లో విండీస్‌ను చిత్తు చేసిన టీమిండియా.. అదే జోరును వన్డేల్లో కొనసాగించాలని భావిస్తోంది. మరోవైపు హెట్‌మైర్, థామస్ వంటి సీనియర్ల రాకతో కలకలాడుతున్న విండీస్.. టెస్టు సిరీస్ ఓటమికు బదులు తీర్చుకోవాలని భావిస్తోంది.
ఈ క్రమంలో విండీస్‌తో తొలి వన్డేకు టీమిండియా ప్లేయింగ్ ఎలెవన్‌ను భారత మాజీ క్రికెటర్ ఆకాష్ చోప్రా ఎంచుకున్నాడు. తన ఎంచుకున్న జట్టులో వికెట్ కీపర్‌గా సంజూ శాంసన్‌కు అవకాశం ఇచ్చాడు. "నా వరకు అయితే టీమిండియా ఇన్నింగ్స్‌ను శుభ్‌మన్ గిల్, రోహిత్ శర్మలు ప్రారంభిస్తారు. అందులో ఎటువంటి సందేహం లేదు. కానీ కొంతమంది కిషన్‌ను ఓపెనర్‌గా పంపాలని భావిస్తున్నారు.
కానీ అలా జరగదు. ఎందుకంటే అతడికి పూర్తిగా జట్టులోనే చోటు దక్కదు. ఇక మూడో స్ధానంలో విరాట్ కోహ్లి ఎలాగూ ఉంటాడు. వరుసగా నాలుగు, ఐదు స్ధానాల్లో సూర్యకుమార్ యాదవ్, సంజూ శాంసన్ బ్యాటింగ్ రావాలి. అదే విధంగా ఆల్‌రౌండర్లగా హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్ జట్టులో ఉండాలి. అక్షర్ పటేల్ ప్రస్తుతం అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు.
అతడికి కచ్చితంగా ఛాన్స్ ఇవ్వాలి. జడ్డూ, అక్షర్‌కు తోడుగా కుల్దీప్‌ను మరోస్పిన్నర్‌గా జట్టులోకి తీసుకోవాలి. ఈ మ్యాచ్‌కు శార్ధూల్ ఠాకూర్ అవసరం లేదు. ఎందుకంటే హార్దిక్ పాండ్యా రూపంలో ఫాస్ట్‌బౌలింగ్ ఆల్‌రౌండర్ జట్టులో ఉంటాడు. మరోవైపు సిరాజ్ అందుబాటులో లేడు కాబట్టి జయదేవ్ ఉనద్కట్‌ను ఆడించాలి. మరోవైపు స్పీడ్ గన్ ఉమ్రాన్ మాలిక్‌కు జట్టులో చోటువ్వాలి. కచ్చితంగా అతడు ఎక్స్ ఫ్యాక్టర్ అవుతాడని" ఆకాష్ చోప్రా తన యూట్యూబ్ ఛానల్‌లో పేర్కొన్నాడు.
చదవండి: IND vs WI: వెస్టిండీస్‌తో తొలి వన్డే.. టీమిండియా క్రికెటర్ రీఎంట్రీ! 9 ఏళ్ల తర్వాత తొలి మ్యాచ్
Comments
Please login to add a commentAdd a comment