హార్దిక్ పాండ్యా (PC: ipl.com)
IPL 2024- MI Vs RR- #Hardik Pandya: ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా పగ్గాలు చేపట్టిన తర్వాత హార్దిక్ పాండ్యాకు ఏదీ కలిసి రావడం లేదు. ఎక్కడకు వెళ్లినా ప్రేక్షకుల నుంచి హేళనలు.. చెత్త కెప్టెన్సీ కారణంగానే ముంబైకి వరుస ఓటములంటూ మాజీ క్రికెటర్లు, విశ్లేషకుల నుంచి విమర్శలు.
ఇక ఆటగాడిగానూ హార్దిక్ పాండ్యా స్థాయికి తగ్గ ప్రదర్శన చేయకపోవడం కూడా ముంబై అభిమానుల ఆగ్రహానికి కారణమవుతోంది. ఐపీఎల్-2024లో ఇప్పటి వరకు ఆడిన మూడు మ్యాచ్‌లలో కలిపి ఈ పేస్ ఆల్‌రౌండర్ 69 పరుగులు చేశాడు.
బ్యాటర్‌గా ఫర్వాలేదనిపించినా బౌలింగ్‌లో మాత్రం పూర్తిగా తేలిపోయాడు. ఇంత వరకు కేవలం ఒకే ఒక వికెట్ తీశాడు. ఇక రాజస్తాన్ రాయల్స్‌తో సోమవారం నాటి మ్యాచ్‌లో హార్దిక్ పాండ్యా అవుటైన తీరు కూడా విమర్శలకు తావిచ్చింది.
ఆరంభంలోనే వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డ ముంబైని తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా ఆదుకునే ప్రయత్నం చేశారు. ఐదో స్థానంలో వచ్చిన తిలక్ 29 బంతుల్లో 32 పరుగులు చేయగా.. పాండ్యా 21 బంతుల్లోనే 34 రన్స్ సాధించాడు.
అయితే, అప్పటికి ఇంకా పది ఓవర్లు మిగిలి ఉన్నా పాండ్యా అనవసరపు షాట్‌తో యజువేంద్ర చహల్ బౌలింగ్‌లో వికెట్ పారేసుకున్నాడు. రోవ్‌మన్ పావెల్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు.
Chahal strikes, Hardik departs ⚡#IPLonJioCinema #TATAIPL #MIvRR pic.twitter.com/oM7EOvnxvm
— JioCinema (@JioCinema) April 1, 2024
ఈ విషయం గురించి భారత మాజీ ఓపెనర్ ఆకాశ్ చోప్రా మాట్లాడుతూ.. ‘‘తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా మెరుగైన భాగస్వామ్యం నెలకొల్పేందుకు కృషి చేశారు. కానీ.. వీరిద్దరు ఇంకాసేపు క్రీజులో ఉంటే పరిస్థితి వేరేలా ఉండేది.
వాంఖడే పిచ్ 210 పరుగులు స్కోరు చేసేదిగా లేకపోవచ్చు. కానీ 160- 170 పరుగులు సాధించేందుకు ఆస్కారం ఉంది. అయినా.. పదో ఓవర్‌లో మూడో బంతికి యుజీ బౌలింగ్‌లో పాండ్యా సిక్సర్ కొట్టేందుకు యత్నించాడు.
నిజానికి తను బంతిని సరిగ్గా అంచనా వేస్తే ఫలితం వేరేలా ఉండేది. ఆ షాట్ ఆడి తను అవుటయ్యాడు. ఆ తర్వాత తిలక్ వర్మ కూడా పెవిలియన్ చేరాడు. వీరిద్దరి నిష్క్రమణ తీవ్ర ప్రభావం చూపింది’’ అని అభిప్రాయపడ్డాడు.
ఐపీఎల్-2024: ముంబై ఇండియన్స్ వర్సెస్ రాజస్తాన్ రాయల్స్ స్కోరు
►వేదిక: ముంబై.. వాంఖడే స్టేడియం
►టాస్: రాజస్తాన్ రాయల్స్.. బౌలింగ్
►ముంబై స్కోరు: 125/9 (20)
►రాజస్తాన్ స్కోరు: 127/4 (15.3)
►ఫలితం: ఆరు వికెట్ల తేడాతో రాజస్తాన్ విజయం
►ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: ట్రెంట్ బౌల్ట్(రాజస్తాన్- 3/22).
చదవండి: IPL 2024: గేమ్ చేంజర్.. అతడు ఉంటే ముంబై కచ్చితంగా గెలిచేది!
Comments
Please login to add a commentAdd a comment