శ్రేయస్ అయ్యర్ (PC: BCCI)
IPL 2024- T20 WC 2024: టీమిండియా బ్యాటర్ శ్రేయస్ అయ్యర్‌కు టీ20 ప్రపంచకప్ జట్టులో చోటు కష్టమేనని భారత మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా అన్నాడు. సెలక్టర్లు అతడిని పక్కనపెట్టినట్లు ఇప్పటికే సంకేతాలిచ్చారని పేర్కొన్నాడు. ఐపీఎల్-2024లో సత్తా చాటితేనే తిరిగి భారత టీ20 జట్టులో స్థానం పొందే అవకాశం ఉంటుందని అభిప్రాయపడ్డాడు.
కాగా ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు కెప్టెన్‌గా ఉన్న భారత మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్.. వెన్నునొప్పి కారణంగా గత సీజన్ మొత్తానికి దూరమయ్యాడు. ఆ తర్వాత భారత టీ20 జట్టులో పునరాగమనం చేసిన అతడు ఫర్వాలేదనిపించాడు.
వన్డే వరల్డ్‌కప్-2023లోనూ సత్తా చాటాడు. అయితే, గత కొన్ని రోజులుగా కెరీర్‌లో గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నాడు అయ్యర్. క్రమశిక్షణా రాహిత్యానికి పాల్పడ్డాడనే కారణంతో భారత క్రికెట్ నియంత్రణ మండలి అతడి సెంట్రల్ కాంట్రాక్టును రద్దు చేసింది.
ఈ నేపథ్యంలో భారత జట్టులో శ్రేయస్ అయ్యర్ పునరాగమనంపై క్రికెట్ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. ఈ క్రమంలో జూన్‌లో మొదలుకానున్న టీ20 ప్రపంచకప్-2024 జట్టులో అతడికి చోటు దక్కుతుందా లేదా అన్న అంశంపై ఆకాశ్ చోప్రా తన అభిప్రాయాలు పంచుకున్నాడు.
భారత టీ20 జట్టు నుంచి అవుట్! వరల్డ్‌కప్‌లో నో ఛాన్స్!
‘‘శ్రేయస్ అయ్యర్... ప్రస్తుతం నీ పేరు భారత టీ20 జట్టులో లేదు. ఒకవేళ ఐపీఎల్ తాజా ఎడిషన్‌లో నువ్వు సత్తా చాటితే రీఎంట్రీ ఇచ్చే అవకాశం ఉంటుంది. 550కి పైగా పరుగులు సాధిస్తే సెలక్టర్లు కచ్చితంగా ఈ పేరును పరిగణనలోకి తీసుకుంటారు.
ఐపీఎల్‌లో అదరగొడితేనే కీలక సభ్యుడిగా జట్టులో చోటిస్తారు. కానీ ప్రస్తుతం అతడి పేరు పరిశీలనలో లేదన్నది వాస్తవం’’ అని ఆకాశ్ చోప్రా పేర్కొన్నాడు. కాగా ఐపీఎల్-2023లో శ్రేయస్ అయ్యర్ స్థానంలో నితీశ్ రాణా కేకేఆర్‌ను ముందుకు నడిపించాడు. కానీ కనీసం ప్లే ఆఫ్స్‌నకు కూడా చేర్చలేకపోయాడు.
ఈ నేపథ్యంలో తిరిగి కేకేఆర్ పగ్గాలు చేపట్టిన శ్రేయస్ అయ్యర్.. కెప్టెన్‌గా, బ్యాటర్‌గా రాణిస్తేనే వరల్డ్‌కప్ అవకాశాలను సజీవం చేసుకోగలడు. ఐపీఎల్ పదిహేడో ఎడిషన్‌లో ప్రదర్శనపైనే అతడి అంతర్జాతీయ టీ20 కెరీర్ ఆధారపడి ఉందని చెప్పవచ్చు!!
ఇదిలా ఉంటే.. మార్చి 22న ఐపీఎల్-2024కు తెరలేవనుంది. చెన్నై సూపర్ కింగ్స్- రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మధ్య చెపాక్‌లో ఆరంభ మ్యాచ్ జరుగనుంది. ఇక కేకేఆర్ మార్చి 23న సొంతమైదానంలో సన్‌రైజర్స్ హైదారాబాద్‌తో తమ తొలి మ్యాచ్ ఆడనుంది.
చదవండి: # RCB: మేమేం ఏడ్వటం లేదు... అబ్బే ఇవి కన్నీళ్లుకావు!
Comments
Please login to add a commentAdd a comment