ఐపీఎల్-2024లో ఫైనల్ పోరుకు మరి కొన్ని తెరలేవనుంది. చెపాక్ వేదికగా జరగనున్న టైటిల్ పోరులో కోల్‌కతా నైట్‌రైడర్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లు తాడోపేడో తెల్చుకోనున్నాయి.
ఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్ ఆకాష్ చోప్రా టైటిల్ విజేతను ఎంచుకున్నాడు. కేకేఆర్ ఛాంపియన్స్‌గా నిలుస్తుందని చోప్రా జోస్యం చెప్పాడు. అయితే ఎస్ఆర్‌హెచ్‌ను తక్కువ అంచనా వేయద్దని, ఆ జట్టు టైటిల్‌ను సొంతం చేసుకున్న ఆశ్చర్యపోనక్కర్లలేదని చోప్రా చెప్పుకొచ్చాడు.
"ఎస్ఆర్‌హెచ్-కేకేఆర్ ఫైనల్ మ్యాచ్ ఉత్కంఠ భరితంగా సాగనుంది. ఈ మ్యాచ్ వన్‌సైడ్ గేమ్ అయితే కాదు. కేకేఆర్‌కు గెలిచే ఛాన్స్ ఉంది. అయితే హైదరాబాద్ గట్టీ పోటీ ఇస్తుందని నేను భావిస్తున్నాను.
ఒకవేళ సన్‌రైజర్స్ కప్ కొట్టినా ఆశ్చర్యపోనక్కర్లలేదు. ఈ క్యాష్‌రిచ్ లీగ్‌లో ఎస్ఆర్‌హెచ్‌కు ఇది మూడో ఫైనల్ కాగా.. కేకేఆర్‌కు నాలుగో ఫైనల్. ఇరు జట్లు టైటిల్ కోసం తీవ్రంగా శ్రమిస్తాయి అనడంలో ఎటువంటి సందేహం లేదు.
ఈ ఫైనల్ మ్యాచ్‌లో హెడ్ కంటే అభిషేక్ శర్మ కీలకంగా మారనున్నాడు. ఎందుకంటే ప్రత్యర్ధి జట్టులో లెఫ్టార్మ్ పేసర్ మిచెల్ స్టార్క్ ఉండడంతో హెడ్‌కు మరోసారి కష్టాలు తప్పవు.
బౌలింగ్‌లో ప్యాట్ కమ్మిన్స్, భువనేశ్వర్ కుమార్, టి నటరాజన్ చెలరేగితే కేకేఆర్‌ను తక్కువ స్కోర్‌కే కట్టడి చేయవచ్చు. ముఖ్యంగా రాహుల్ త్రిపాఠి ఫామ్‌ల ఉండడం సన్‌రైజర్స్ కలిసొచ్చే ఆంశం.
కానీ అతడు రిస్క్‌తో కూడిన షాట్లు ఆడుతున్నాడు. అది అన్ని సమయాల్లో జట్టుకు మంచిది కాదు. ఎస్ఆర్‌హెచ్ సమిష్టిగా రాణిస్తే మరోటైటిల్‌ను తమ ఖాతాలో వేసుకోవచ్చు" అని తన యూట్యూబ్ ఛానల్‌లో చోప్రా పేర్కొన్నాడు
Comments
Please login to add a commentAdd a comment