రాజస్తాన్ రాయల్స్ (PC: iplt20.com)
"It's a shame if this team..: ఐపీఎల్-2024 ఆరంభానికి సమయం ఆసన్నమవుతోంది. మార్చి 22న ఈ మెగా ఈవెంట్‌కు చెన్నైలో తెరలేవనుంది. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్, కామెంటేటర్ ఆకాశ్ చోప్రా.. రాజస్తాన్ రాయల్స్‌ను ఉద్దేశించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
‘‘రాజస్తాన్ రాయల్స్ మెరుగైన జట్టు అనడంలో ఎలాంటి సందేహం లేదు. జోస్ బట్లర్, యశస్వి జైస్వాల్.. సంజూ శాంసన్, ధ్రువ్ జురెల్, షిమ్రన్ హెట్‌మెయిర్, రియాన్ పరాగ్.. వీరితో బ్యాటింగ్ విభాగం పటిష్టంగా కనిపిస్తోంది.
ఇక రోవ్‌మన్ పావెల్‌తో పాటు రవిచంద్రన్ అశ్విన్, యుజువేంద్ర చహల్, ఆడం జంపా, ట్రెంట్ బౌల్ట్ కూడా ఉండనే ఉన్నారు. విదేశీ ప్లేయర్లలో చాలా మందికి తుదిజట్టులో ఆడే అవకాశం రాదన్న మాట నిజమే.
అయితే, జట్టుకు అవసరాలకు అనుగుణంగా ఒక్కొక్కరికి ఒక్కోసారైనా ఛాన్స్ దక్కుతుంది. ఇప్పుడిక ఆవేశ్ ఖాన్ కూడా రాయల్స్‌తో చేరాడు. వీళ్లందరినీ చూస్తుంటే ఈ జట్టు ట్రోఫీ గెలుస్తుందని భావిస్తుందని అనుకోవచ్చా? అంటే కచ్చితంగా అవుననే అంటాను.
అయితే, గత సీజన్‌లో తాము ఇంపాక్ట్ ప్లేయర్‌ను వాడదలచుకోలేదని రాయల్స్ చెప్పింది. ఈసారి మాత్రం వాళ్లు ఇంపాక్ట్ ప్లేయర్‌ను ఎలా ఉపయెగించుకుంటుందన్న అంశం మీద విజయావకాశాలు ఆధారపడి ఉంటాయి.
ఇంత మంచి జట్టు ఉన్నా.. ఒకవేళ రాయల్స్ గనుక ఈసారి కనీసం ప్లే ఆఫ్స్ కూడా చేరలేదంటే నిజంగా అది సిగ్గుచేటే’’ అని ఆకాశ్ చోప్రా తన యూట్యూబ్ చానెల్ వేదికగా అభిప్రాయాలు పంచుకున్నాడు.
కాగా ఐపీఎల్-2022 సీజన్‌లో ఫైనల్ వరకు వెళ్లిన రాజస్తాన్ రాయల్స్ ఆఖరి మెట్టుపై గుజరాత్ టైటాన్స్ చేతిలో ఓడిపోయింది. ఇక గతేడాది ప్లే ఆఫ్స్(టాప్-4) కూడా చేరలేక ఐదో స్థానంతో సరిపెట్టుకుంది.
రాజస్తాన్ రాయల్స్ 2024 జట్టు
సంజూ శాంసన్ (కెప్టెన్), జోస్ బట్లర్, షిమ్రాన్ హిట్‌మెయిర్, యశస్వి జైస్వాల్, ధ్రువ్ జురెల్, రియాన్ పరాగ్, డోనోవన్ ఫెరీరా, కునాల్ రాథోడ్, రవిచంద్రన్ అశ్విన్, కుల్దీప్ సేన్, నవదీప్ సైనీ, ప్రసిద్ధ్ కృష్ణ, సందీప్ శర్మ, ట్రెంట్ బౌల్ట్, యజువేంద్ర చాహల్, ఆడమ్ జంపా, రోవ్‌మన్ పావెల్, శుభమ్ దూబే, టామ్ కోహ్లర్ కాడ్మోర్, నండ్రే బర్గర్, అబిద్ ముస్తాక్, అవేశ్ ఖాన్ (లక్నో సూపర్ జెయింట్స్ నుంచి స్వాపింగ్).
చదవండి: Anant- Radhika: రోహిత్ తిరుగు పయనం.. భయ్యాకు కోపం వచ్చిందంటే!
Comments
Please login to add a commentAdd a comment