Ben Stokes- Ravindra Jadeja: ‘‘రవీంద జడేజా అద్భుతంగా ఆడుతున్నాడు. ఏడో స్థానంలో బ్యాటింగ్ దిగుతాడు. అంతేనా.. 10 ఓవర్ల పాటు(వన్డేలో) బౌలింగ్ చేయడం కూడా గ్యారెంటీ. ఇక టెస్టుల్లో కేవలం టీమిండియా తరఫున మాత్రమే కాదు..
ప్రపంచం మొత్తంలో ప్రస్తుతం అతడే అత్యుత్తమ ఆల్‌రౌండర్.. బెన్ స్టోక్స్ కంటే కూడా జడేజా బెస్ట్. ఎందుకంటే స్టోక్స్ ఎక్కువగా బౌలింగ్ చేయలేడు. ఒంటిచేత్తో మ్యాచ్‌లు గెలిపించగల సత్తా జడేజాకు సొంతం.
కానీ రావాల్సినంత గుర్తింపు రాలేదు
కానీ అనుకున్నంత స్థాయిలో అతడికి రావాల్సినంత గుర్తింపు రాలేదు. ఏదేమైనా టెస్టుల్లో జడేజా బెస్ట్ ఆల్‌రౌండర్ అని కచ్చితంగా చెప్పగలను’’ అంటూ టీమిండియా మాజీ బ్యాటర్ ఆకాశ్ చోప్రా.. ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాపై ప్రశంసలు కురిపించాడు.
టెస్టుల్లో ఇద్దరూ..
కాగా ప్రస్తుతం టీమిండియా స్టార్ జడేజా, ఇంగ్లండ్ టెస్టు జట్టు సారథి బెన్ స్టోక్స్.. ఇద్దరూ టెస్టుల్లో అత్యుత్తమ ఆల్‌రౌండర్లుగా కొనసాగుతున్నారు. ఐసీసీ ర్యాంకింగ్స్‌లో జడ్డూ గత కొంతకాలంగా నంబర్ 1లో కొనసాగుతుండగా.. స్టోక్స్ నాలుగో స్థానంలో ఉన్నాడు.
జడ్డూ, స్టోక్స్ గణాంకాలు ఇలా
ఇక ఇప్పటి వరకు 67 అంతర్జాతీయ టెస్టులాడిన జడేజా.. 2804 పరుగులు చేయడంతో పాటు.. 275 వికెట్లు పడగొట్టాడు. స్టోక్స్ 97 టెస్టుల్లో 6117 పరుగులు సాధించడంతో పాటు 197 వికెట్లు తీశాడు.
ఈ నేపథ్యంలో వీరిద్దరిలో బెస్ట్ ఎవరంటే తాను జడ్డూ వైపే మొగ్గు చూపుతానని ఆకాశ్ చోప్రా పేర్కొన్నాడు. ఇందుకు గల కారణాలు విశ్లేషిస్తూ పైవిధంగా స్పందించాడు. కాగా ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ 2021-23 సైకిల్‌లో జడ్డూ 13 టెస్టుల్లో 47 వికెట్లు పడగొట్టాడు.
ఇందులో మూడు 5- వికెట్ హాల్స్ ఉన్నాయి. ఇక లెఫ్టార్మ్ స్పిన్నర్ అత్యుత్తమ గణాంకాలు 7/42. అదే విధంగా.. రెండు సెంచరీలు.. మూడు ఫిఫ్టీలతో 721 పరుగులు రాబట్టాడు.
వన్డేల్లో రీఎంట్రీ.. రికార్డు సృష్టించి
ఇక స్టోక్స్ విషయానికొస్తే.. ఈ లెఫ్టాండ్ బ్యాటర్ 18 మ్యాచ్‌లలో.. రెండు శతకాలు, నాలుగు హాఫ్ సెంచరీల సాయంతో 971 పరుగులు సాధించాడు. అదే విధంగా 30 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడీ రైట్ ఆర్మ్ పేసర్. కాగా ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు విజ్ఞప్తి మేరకు స్టోక్స్ వన్డేల్లో తన రిటైర్మెంట్‌ను వెనక్కి తీసుకున్నాడు.
న్యూజిలాండ్‌తో సిరీస్‌లో ఎంట్రీ ఇచ్చిన అతడు.. మూడో వన్డేలో ఏకంగా 182 పరుగులతో చెలరేగి ఇంగ్లండ్ తరఫున వన్డేల్లో అత్యధిక స్కోరు సాధించిన బ్యాటర్‌గా నిలిచాడు. మరోవైపు.. జడ్డూ ఆసియా వన్డే కప్-2023 ఆడాడు. వీరిద్దరు భారత్ వేదికగా వన్డే ప్రపంచకప్-2023లో ఎలా ఆడాతారో చూడాలిక!
చదవండి: Ind vs Aus: కనీసం ఆ జట్టులో కూడా పనికిరాడా? కెప్టెన్ కావాల్సినోడు..
Comments
Please login to add a commentAdd a comment