టీ20 వరల్డ్‌కప్-2024 ఛాంపియన్స్‌గా భారత్ నిలిచిన సంగతి తెలిసిందే. ఫైనల్లో దక్షిణాఫ్రికాను చిత్తు చేసిన టీమిండియా.. రెండో సారి టీ20 వరల్డ్‌కప్ ట్రోఫీని ముద్దాడింది. గత 13 ఏళ్లగా ఊరిస్తున్న వరల్డ్‌కప్ ట్రోఫీ.. ఎట్టకేలకు రోహిత్ శర్మ సారథ్యంలో భారత్ సొంతమైంది.
2011లో ధోని సారథ్యంలో ప్రపంచకప్ టైటిల్‌ను గెలుచుకున్న భారత్.. మళ్లీ ఇప్పుడు రోహిత్ నాయకత్వంలోనే వరల్డ్‌కప్ కల సాధ్యమైంది. భారత్‌కు వరల్డ్‌కప్‌కు అందించిన రోహిత్ శర్మపై సర్వాత్ర ప్రశంసల వర్షం కురుస్తోంది.
ఈ జాబితాలో భారత మాజీ క్రికెటర్ ఆకాష్ చోప్రా చేరాడు. ప్రపంచకప్ గెలిచిన మూడో భారత కెప్టెన్‌గా రోహిత్‌ని యావత్ దేశం ఎప్పటికీ గుర్తుంచుకుంటందని చోప్రా కొనియాడాడు. కాగా వరల్డ్‌కప్ విజయానంతరం రోహిత్ అంతర్జాతీయ టీ20 క్రికెట్‌కు గుడ్‌బై చెప్పేశాడు.
"రోహిత్ ఒక అద్భుతమైన నాయకుడు. అతడి కెప్టెన్సీ కెరీర్‌లో ఐదు ఐపీఎల్ ట్రోఫీలు ఉన్నాయి. అతడు ఛాంపియన్స్ లీగ్‌లో సైతం ముంబైకు టైటిల్‌ను అందించాడు. ఇప్పుడు టీ20 ప్రంపచకప్‌ను సైతం భారత్‌కు అందించి.. తన అంతర్జాతీయ టీ20 కెరీర్‌ను ముగించాడు.
ఒక లీడర్‌కు ఇంతకుమించి ఇంకేమి కావాలి. కేవలం ముగ్గురు భారత కెప్టెన్‌లు మాత్రమే ప్రపంచ కప్ ట్రోఫీని గెలుచుకోగలిగారు. కపిల్ దేవ్, ఎంఎస్ ధోనీ వంటి దిగ్గజాల సరసన హిట్‌మ్యాన్ చేరాడు. రోహిత్ సాధించిన ఈ వరల్డ్‌కప్ విజయం కొన్ని తాబ్దాల పాటు గుర్తుండిపోతుంది.
రోహిత్ కెప్టెన్సీ అత్యుత్తమంగా ఉంటుంది. అతడు ఆటగాళ్లకు పూర్తి స్వేఛ్చను ఇస్తాడు. ఎవరికి అడిగినా రోహిత్ భయ్యా చాలా మంచి కెప్టెన్ చెబుతారు. రోహిత్ మంచివాడు కాదని చెప్పే ఒక్క వ్యక్తి కూడా ఉండడు. రోహిత్ 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారమని" తన యూట్యూబ్ ఛానలో ఆకాష్ చోప్రా పేర్కొన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment