వెస్టిండీస్‌తో టీ20 సిరీస్‌కు 15 మంది సభ్యులతో కూడిన భారత జట్టును బీసీసీఐ బుధవారం ఎంపిక చేసింది. అయితే ఈ సిరీస్‌కు ఎంపిక చేసిన భారత జట్టుపై మాజీ క్రికెటర్‌లు ఆసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ జట్టులో ఐపీఎల్ హీరో రింకూ సింగ్, యువ ఓపెనర్ రుత్‌రాజ్ గైక్వాడ్‌లకు చోటు దక్కలేదు. వీరిద్దరికి టీ20 జట్టులో చోటు దక్కుతుందని అంతా భావించారు.
కానీ సెలక్టర్లు మాత్రం వారిని పరిగణలోకి తీసుకోలేదు. ఈ క్రమంలో భారత మాజీ క్రికెటర్ ఆకాష్ చోప్రా ఆసక్తికర వాఖ్యలు చేశాడు. ముఖ్యంగా అద్బుతమైన ఫామ్‌లో ఉన్న రుత్‌రాజ్ గైక్వాడ్‌ను ఎంపిక చేయకపోవడాన్ని ఆకాష్ చోప్రా తప్పుబట్టాడు. అదే విధంగా టీ20 జట్టులో కూడా చోటు దక్కించుకున్న యువ ఓపెనర్ యశస్వీ జైశ్వాల్‌పై ప్రశంసల వర్షం కురిపించాడు.
"ప్రతీ సిరీస్‌కు జట్టు ఎంపిక చేసినప్పుడు ఎవరో ఒక ఆటగాడికి అన్యాయం జరుగుతోంది. దాని గురించి కొన్ని రోజులు పాటు చర్చనడుస్తోంది. ఇప్పుడు విండీస్ సిరీస్ వంతు వచ్చింది. విండీస్‌తో టీ20 సిరీస్‌కు సెలక్టర్లు ముగ్గురు ఓపెనర్లు ఎంపిక చేశారు. కానీ రుతురాజ్ గైక్వాడ్‌కు మాత్రం చోటు దక్కలేదు. సెలక్టర్లు నిర్ణయం నన్ను ఆశ్చర్యపరిచింది.
ఎందుకంటే అతడు ప్రస్తుతం అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. కాబట్టి కిషన్ స్ధానంలో రుత్‌రాజ్‌ను ఎంపిక చేయాల్సింది. కిషన్ గత కొంత కాలంగా టీ20ల్లో రాణించలేకపోతున్నాడు. ఐపీఎల్‌లో కూడా విఫలమయ్యాడు. ఇక యశస్వి జైస్వాల్ ప్రస్తుతం భారత క్రికెట్‌లో ఒక సంచలనం.
అతడు ఐపీఎల్‌లో కూడా అద్భుతంగా రాణించాడు. అదే జోరును విండీస్ టూర్‌లో కూడా కొనసాగిస్తాడని భావిస్తున్నాను. డొమినికా టెస్టుతో జైశ్వాల్ డెబ్యూ చేసే అవకాశం ఉందని" తన యూట్యూబ్ ఛానల్‌లో చోప్రా పేర్కొన్నాడు.
విండీస్‌తో టి20 సిరీస్‌కు భారత జట్టు:
ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), శుబ్‌మన్ గిల్, యశస్వి జైస్వాల్, తిలక్ వర్మ, సూర్య కుమార్ యాదవ్ (వైస్ కెప్టెన్), సంజు శాంసన్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా (కెప్టెన్), అక్షర్ పటేల్, యుజ్వేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్, రవి బిష్ణోయ్, అర్ష్దీప్ సింగ్, ఉమ్రాన్ మాలిక్, అవేష్ ఖాన్, ముఖేష్ కుమార్.
చదవండి: IND vs WI: బౌండరీల వర్షం కురిపించిన రోహిత్, జైశ్వాల్.. వీడియో వైరల్
Comments
Please login to add a commentAdd a comment