
వన్డే వరల్డ్‌కప్‌లో ఆస్ట్రేలియా స్టార్ ఓపెనర్ ట్రావిస్ హెడ్ అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. ఆసీస్ ఆరోసారి వరల్డ్ ఛాంపియన్స్‌గా నిలవడంలో హెడ్‌ది కీలక పాత్ర. . భారత్‌తో జరిగిన ఫైనల్లో 137 పరుగులతో హెడ్ కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ఓవరాల్‌గా మెగా టోర్నీలో కేవలం 5 మ్యాచ్‌లు మాత్రమే ఆడిన హెడ్.. 44 సగటుతో 220 పరుగులు చేశాడు. కాగా ఈ వరల్డ్‌కప్ హీరో ఐపీఎల్-2024 మినీ వేలంలో రూ.2 కోట్ల కనీస తన పేరును రిజిస్టర్ చేసుకున్నాడు.
అద్భుత ఫామ్‌లో ఉన్న అతడి కోసం ఫ్రాంచైజీలు కాసుల వర్షం కురిపించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో భారత మాజీ ఓపెనర్ ఆకాష్ చోప్రా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. వేలంలో ట్రావిస్ హెడ్‌ను దక్కించుకోవడానికి పంజాబ్ కింగ్స్ ఫ్రాంచైజీ ప్రయత్నించాలని అకాష్ చోప్రా అభిప్రాయపడ్డాడు.
"మిని వేలంలో పంజాబ్ కింగ్స్ అఫ్గాన్ ఆల్‌రౌండర్ అజ్మతుల్లా ఒమర్జాయ్ కోసం ప్రయత్నించనున్నట్లు తెలుస్తోంది. సామ్ కుర్రాన్ స్ధానంలో అతడిని ఆడించే ఛాన్స్ ఉంది. నా వరకు అయితే కుర్రాన్ కంటే ఒమర్జాయ్ బాగా రాణిస్తాడని అనుకుంటున్నాను. అయితే ఒమర్జాయ్‌తో పాటు ట్రావిడ్ హెడ్ కోసం కూడా పంజాబ్ ట్రై చేయాలి.
అతడు జానీ బెయిర్‌స్టోకు హెడ్ ప్రత్యామ్నయంగా ఉంటాడు. అతడికి బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్ చేసే స్కిల్ కూడా ఉంది. అదే విధంగా భారత బౌలర్ కావాలనుకుంటే లార్డ్ శార్ధూల్ ఠాకూర్ కూడా అందుబాటులో ఉన్నాడు" అని తన యూట్యాబ్ ఛానల్‌లో చోప్రా పేర్కొన్నాడు. కాగా ఐపీఎల్-2024 మినీవేలం డిసెంబర్ 19న దుబాయ్ వేదికగా జరగనుంది.
చదవండి: World Cup 2023: వన్డే వరల్డ్‌కప్ ఫైనల్ పిచ్‌కు ఐసీసీ రేటింగ్.. ఎంతంటే?