విజయ్ హజారే వన్డే ట్రోఫీ 2024-25 కోసం ఎంపిక చేసిన కేరళ జట్టులో టీమిండియా స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్‌కు చోటు దక్కకపోయిన సంగతి తెలిసిందే. ఈ టోర్నీ కోసం కేరళ క్రికెట్ ఆసోషియేషన్ నిర్వహించిన శిక్షణా శిబిరానికి గైర్హాజరైనందున అతడిని సెలక్టర్లు ఎంపిక చేయలేదు.
దీంతో అతడి స్ధానంలో తమ జట్టు పగ్గాలను సల్మాన్ నజీర్‌కు కేసీఎ అప్పగించింది. ఈ నేపథ్యంలో శాంసన్‌ను ఉద్దేశించి భారత మాజీ క్రికెటర్ ఆకాష్ చోప్రా కీలక వ్యాఖ్యలు చేశాడు. ఈ దేశవాళీ టోర్నీలో సంజూ భాగం కాకపోవడంతో ఛాంపియన్స్ ట్రోఫీకి కోసం వెళ్లే భారత జట్టులో ఛాన్స్ దక్కపోవచ్చు అని సంజూ అభిప్రాయపడ్డాడు.
"విజయ్ హజారే ట్రోఫీలో పాల్గోనే కేరళ జట్టులో సంజూ శాంసన్ పేరు లేకపోవడం ఆశ్చర్యపరిచింది. అతడిని ఎందుకు ఎంపిక చేయలేదో నాకు ఆర్ధం కావడం లేదు. వాయనాడ్‌లో నిర్వహించిన ప్రాక్టీస్ క్యాంపులో సంజూ పాల్గోలేదని, అందుకే కెసీఎ సెలక్టర్లు అతడిని ఎంపిక చేయలేదని కొంత మంది చెబుతున్నారు.
కాలి గాయం కారణంగా శిక్షణా శిబిరానికి ఎంపిక కాలేనని సంజూ కెసీఎకు ముందే తెలియజేసినట్లు మరి కొంతమంది అభిప్రాయపడుతున్నారు. కారణం ఏదమైనప్పటకి విజయ్ హజారే ట్రోఫీలో సంజూ భాగం కాలేకపోయాడు.
ఈ టోర్నీని సంజూ ప్రతిష్టాత్మకంగా తీసుకోవాల్సింది. ఎందుకంటే టీ20ల్లో అతడు అద్బుతమైన ఫామ్‌లో ఉన్నాడు. అటువంటిప్పుడు వన్డే క్రికెట్‌ను కూడా శాంసన్ దృష్టిలో పెట్టుకోవాలి. రిషబ్ పంత్ ఇంకా వన్డేల్లో పూర్తి స్ధాయిలో తన మార్క్‌ను చూపించలేకపోయాడు.
మరికొన్ని రోజుల్లో ఛాంపియన్స్ ట్రోఫీ కూడా జరగనుంది. ఈ టోర్నీ కోసమైన విజయ్ హజారే ట్రోఫీలో సంజూ ఆడాల్సింది. బహుశా శాంసన్‌ను ఛాంపియన్స్ కోసం భారత సెలక్టర్లు ఎంపిక చేయకపోవచ్చు" అనిచోప్రా తన యూట్యూబ్ ఛానల్‌లో పేర్కొన్నాడు.
చదవండి: IND vs AUS 4th Test: టీమిండియాకు భారీ షాక్.. స్టార్ ప్లేయర్‌కు గాయం!?
Comments
Please login to add a commentAdd a comment