West Indies vs India, 1st Test: ‘‘బ్యాటింగ్ ఆర్డర్‌లో తాను మూడో స్థానంలో ఆడాలనకుంటున్నట్లు శుబ్‌మన్ గిల్ జట్టు మేనేజ్‌మెంట్‌తో చెప్పాడు. ఈ విషయం నాకు ఆశ్చర్యం కలిగించింది. ఎందుకంటే భారత క్రికెట్‌లో సాధారణంగా ఇలాంటివి ఎప్పుడూ జరుగవు.
బ్యాటింగ్ పొజిషిన్ గురించి ఓ ఆటగాడు ఇలా యాజమాన్యానికి విజ్ఞప్తి చేయడం.. వాళ్లు అందుకు ఒప్పుకోవడం అరుదు. నాకు తెలిసి గతంలో ఎవరూ ఇలా అడుగలేదు.. ఇలాంటి సౌలభ్యం పొందనూ లేదు. అయితే, గిల్ ఇలా అడగడం వల్ల ఓ మేలు జరిగింది.
యశస్వి జైశ్వాల్‌కు టీమిండియా ఓపెనర్‌గా అవకాశం వచ్చింది’’ అని టీమిండియా మాజీ క్రికెటర్, కామెంటేటర్ ఆకాశ్ చోప్రా అన్నాడు. వెస్టిండీస్‌తో టెస్టు సిరీస్ నేపథ్యంలో ఓపెనర్‌గా రాలేనంటూ శుబ్‌మన్ గిల్ తమతో చెప్పినట్లు కెప్టెన్ రోహిత్ శర్మ వెల్లడించిన విషయం తెలిసిందే.
నాకు, ద్రవిడ్‌కు చెప్పాడు
తన కెరీర్‌లో ఎక్కువగా మూడు, నాలుగు స్థానాల్లోనే బ్యాటింగ్ చేశానని గిల్.. తనతో, కోచ్ రాహుల్ ద్రవిడ్‌తో చెప్పాడని.. అతడి అభ్యర్థనకు తాము సానుకూలంగా స్పందించినట్లు తెలిపాడు. ఈ క్రమంలో డొమినికా వేదికగా విండీస్‌తో బుధవారం ఆరంభమైన టెస్టులో ముంబై యువ బ్యాటర్ యశస్వి జైశ్వాల్ అరంగేట్రం చేసి.. రోహిత్‌కు జోడీగా బరిలోకి దిగాడు.
విదేశీ గడ్డ మీద కష్టమే
ఈ పరిణామాలపై ఆకాశ్ చోప్రా స్పందిస్తూ.. గిల్ విషయంలో యాజమాన్యం వ్యవహరించిన తీరు తనకు ఆశ్చర్యం కలిగించిందన్నాడు. ఏదేమైనా యశస్వికి మంచి జరిగిందని పేర్కొన్నాడు. అదే విధంగా.. ‘‘టెస్టుల్లో ముఖ్యంగా విదేశీ గడ్డ మీద ఓపెనర్‌గా ఆడటం అత్యంత సవాలుతో కూడుకున్న విషయం.
నంబర్ 3 కూడా చాలెంజింగ్‌గానే ఉంటుంది. అయితే, నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు వస్తే పిచ్ పరిస్థితులు అంచనా వేసి కాస్త నిలదొక్కుకునే సమయం ఉంటుంది’’ అని ఈ మాజీ ఓపెనర్ అభిప్రాయపడ్డాడు. కాగా వెస్టిండీస్‌తో తొలి రోజు ఆటలో రవిచంద్రన్ అశ్విన్ ఐదు వికెట్లతో చెలరేగాడు.
యశస్వి శుభారంభం
ఈ నేపథ్యంలో ఆతిథ్య కరేబియన్ జట్టు 150 పరుగులకే తొలి ఇన్నింగ్స్ ముగించింది. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన భారత జట్టుకు ఓపెనర్లు యశస్వి, రోహిత్ శుభారంభం అందించారు. మొదటి రోజు ఆట ముగిసే సరికి వికెట్ నష్టపోకుండా టీమిండియా 80 పరుగులు చేయగలిగింది. యశస్వి 40, రోహిత్ 30 పరుగులతో క్రీజులో ఉన్నారు.
చదవండి: Ind Vs WI: మనం తప్పు చేశామా అని పశ్చాత్తాపపడేలా చేశాడు! తొలిరోజే
బ్యాట్ పట్టనున్న టీమిండియా మాజీ స్టార్స్.. ఫ్యాన్స్‌కు పండగే
Comments
Please login to add a commentAdd a comment