ట్రినిడాడ్ వేదికగా వెస్టిండీస్‌తో జరుతున్న రెండో టెస్టులో టీమిండియా అద్భుత ప్రదర్శన కనబరుస్తోంది. తొలి ఇన్నింగ్స్‌లో 128 ఓవర్లు బ్యాటింగ్ చేసి 438 పరుగులకి ఆలౌట్ అయ్యింది. భారత బ్యాటర్లలో కోహ్లి(121) అద్బుతమైన సెంచరీతో చెలరేగగా.. కెప్టెన్ రోహిత్ శర్మ(80), జడేజా(61) పరుగులతో రాణించారు. ఇక మెుదటి టెస్టులో భారత బౌలర్ల ధాటికి చిత్తుగా ఓడిన విండీస్.. రెండో టెస్టులో మాత్రం ప్రతిఘటిస్తోంది. రెండో రోజు ఆట ముగిసేసరికి 86/1 స్కోరుతో ఉంది.
ఇక ఇది ఇలా ఉండగా.. తొలి ఇన్నింగ్స్‌లో రవీంద్ర జడేజా సెంచరీ సాధించకపోవడం తనను ఆశ్చర్యపరిచిందని భారత మాజీ బ్యాటర్ ఆకాశ్ చోప్రా అభిప్రాయపడ్డాడు. కాగా వరుస క్రమంలో రోహిత్ శర్మ, అజింక్యా రహానే వికెట్ల కోల్పోయిన అనంతరం జడేజా క్రీజలోకి వచ్చాడు. ఈ సమయంలో కోహ్లితో కలిసి భారత ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించాడు. ఐదో వికెట్‌కు కోహ్లితో కలిసి 159 పరుగుల కీలక బాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. ఇక ఓవరాల్‌గా 152 బంతులు ఎదుర్కొన్న జడ్డూ.. 5 ఫోర్లతో 61 పరుగులు చేసి పెవిలియన్‌కు చేరాడు.
చదవండి: Virat Kohli: కోహ్లిని హత్తుకుని కన్నీళ్లు పెట్టుకున్న విండీస్ క్రికెటర్ తల్లి.. వీడియో వైరల్
ఈ నేపథ్యంలో చోప్రా తన యూట్యూబ్ ఛానల్‌లో మాట్లాడుతూ.. "విరాట్ కోహ్లితో పాటు రవీంద్ర జడేజా చాలా సమయం పాటు క్రీజులో ఉన్నాడు. అటువంటింది జడేజా సెంచరీ చేయకపోవడం నన్ను ఆశ్చర్యపరిచింది. అతడు కచ్చితంగా సెంచరీ చేస్తాడని నేను భావించాను. గత రెండేళ్ల నుంచి ఫార్మాట్‌తో సంబంధం లేకుండా అతడు అద్భుతంగా రాణిస్తున్నాడు.
6 లేదా అంతకంటే తక్కువ స్ధానాల్లో బ్యాటింగ్ వచ్చి అద్భుతంగా ఆడుతున్న జాబితాలో అతడు రెండో స్ధానంలో ఉన్నాడు. జడ్డూ తన కెరీర్‌లో 2500 పైగా పరుగులు,250 పైగా వికెట్లు సాధించాడు. అతడు భారత జట్టు ఎక్స్ ఫ్యాక్టర్ అనడంలో ఎటువంటి సందేహం లేదు" అని పేర్కొన్నాడు.
చదవండి: Chahal: అందమైన ఫోటోలు షేర్ చేసిన ధనశ్రీ వర్మ.. టీమిండియా క్రికెటర్ ఫిదా!
Comments
Please login to add a commentAdd a comment