టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) సీఈఓ అండ్ ఎండీ కె కృతివాసన్ వర్క్ ఫ్రమ్ హోమ్ విషయం గురించి మాట్లాడుతూ.. రిటర్న్ టు ఆఫీస్ పాలసీ చాలా బాగా పనిచేస్తోందని, రానున్న రోజుల్లో మరింత మంది ఉద్యోగులు ఆఫీసులకు వస్తారని వెల్లడించారు.
ఇప్పటికే 65 శాతం మంది ఉద్యోగులు వారానికి 3 నుంచి 5 రోజులు ఆఫీసుకు వస్తున్నారని, ఈ సంఖ్య రాబోయే రోజుల్లో మరింత పెరిగే అవకాశం ఉందని వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ (WEF) పర్యటనలో ఉన్న కృతివాసన్ ఆశాభావం వ్యక్తం చేశారు. మేము రిటర్న్ టు ఆఫీస్ విధానం ప్రకటించిన కొంత కాలానికి ప్రత్యర్థి కంపెనీలు కూడా దీన్నే అనుసరించడం మొదలుపెట్టేశాయి.
రిటర్న్ టు ఆఫీస్ విధానం అమలు చేయడం కంపెనీకి బాగా కలిసొచ్చిందని, దీంతో సిబ్బందిని మరింత మోటివేట్ చేయడానికి అవకాశం లభించిందని స్పష్టం చేశారు.
కరోనా మహమ్మారి తీవ్రత భారీగా పెరిగిన సమయంలో TCSతో పాటు అనేక ఇతర సంస్థలు కూడా తమ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ వెసులుబాటు కల్పించింది. ఆ తరువాత కరోనా తీవ్రత తగ్గుముఖం పట్టడంతో ఐటీ సంస్థలు రొటేషన్ పద్దతిలో ఉద్యోగులు మళ్ళీ ఆఫీసులకు రావడానికి సన్నాహాలు చేశాయి.
ఇదీ చదవండి: ఉద్యోగులకు షాకిచ్చిన సుందర్ పిచాయ్ - మరిన్ని లేఆప్స్ పక్కా!
అప్పటి సీఈఓ రాజేశ్ గోపీనాథన్ 2025 నాటికి 25 శాతం మంది ఉద్యోగులు మాత్రమే ఆఫీసులకు వచ్చే అవకాశం ఉందని భావించారు, కానీ ఇప్పటికే 65 శాతం మంది ఆఫీసుకు వస్తున్నారు. కంపెనీ గత ఏడాది వందల మంది ఉద్యోగులను తొలగించింది కూడా.
గతంలో ఉద్యోగుల సంఖ్య తగ్గినప్పటికీ.. రానున్న రోజుల్లో అవసరానికి తగ్గట్టుగా ఉద్యోగులను నియమించుకోవడానికి సన్నాహాలు చేస్తున్నట్లు, వచ్చే త్రైమాసికం నాటికి 5 వేల నుంచి 6 వేల మందిని నియమించుకుంటే కంపెనీ తొలగించిన ఉద్యోగులకు సమానమవుతుందని కృతివాసన్ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment