2024లో కూడా టెక్ పరిశ్రమలో ఉద్యోగాల కోతలు భారీగానే ఉన్నాయి. ఇప్పటి వరకు ఏకంగా 32,000 మంది టెకీలు తమ ఉద్యోగాలను కోల్పోయినట్లు Layoffs.fyi డేటాలో వెల్లడించింది.
తాజాగా Snap Inc కంపెనీ 10 శాతం మంది ఉద్యోగులను (540 మంది) తగ్గించినట్లు ప్రకటించింది. దీనితో పాటు Okta Inc సాఫ్ట్‌వేర్ కంపెనీ కూడా ఈ నెల ప్రారంభంలోనే.. ఖర్చులను తగ్గించుకోవడానికి సిబ్బందిలో ఏకంగా 7 శాతం మంది ఉద్యోగులను (400 మంది) తగ్గించింది.
అమెజాన్, సేల్స్ ఫోర్స్, మెటా వంటి దిగ్గజ కంపెనీలు సైతం 2024లో ప్రారంభం నుంచి సిబ్బందిని తొలగిస్తూనే ఉన్నాయి. ఉద్యోగులను తొలగించడానికి ప్రధాన కారణం పెరుగుతున్న ఖర్చులను తగ్గించుకోవడం మాత్రమే కాదు, ఏఐ వంటి టెక్నాలజీలను ఉపయోగించుకోవడానికి కూడా.. అని స్పష్టమవుతోంది.
ప్రస్తుతం చాలా కంపెనీలు 'ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్' (AI) ఉపయోగించుకోవడానికి.. ఇందులో నైపుణ్యం కలిగిన ఉద్యోగులను నియమించుకోవడానే సుముఖత చూపుతున్నాయి. దీంతో కొత్త నియమాల సంఖ్య తగ్గడమే కాకుండా.. ఉన్న ఉద్యోగులను కూడా ఇంటికి పంపిస్తోంది.
ఇదీ చదవండి: ఒకటే రీజన్.. 3500 మంది ఉద్యోగులు బయటకు..!
ఊదుతున్న ఉద్యోగాల సంగతి పక్కన పెదిర్తే.. ఏఐ టెక్నాలజీలో నైపుణ్య కలిగిన లేదా ప్రస్తుతం వినియోగంలో ఉన్న టెక్నాలజీలలో నైపుణ్యాని కలిగిన ఉద్యోగులకు డిమాండ్ అధికంగా ఉంది. ఈ కారణంగానే గత డిసెంబర్ నుంచి జనవరి వరకు పలు కంపెనీలు 2000 మంది ఉద్యోగులను నియమించుకున్నాయి. దీంతో ఏఐ నైపుణ్యం కలిగిన ఉద్యోగుల సంఖ్య 17479కి చేరినట్లు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment