రష్యా, ఉక్రెయిన్ మధ్య జరిగిన యుద్ధంలో ఉక్రెయిన్ ఆర్ధిక వ్యవస్థ భారీగా దెబ్బతినింది. ఉక్రెయిన్‌ను ఆదుకోవడానికి టెక్ దిగ్గజం గూగుల్ 10 మిలియన్ డాలర్ల (రూ. 83 కోట్ల కంటే ఎక్కువ) విలువైన స్టార్టప్ సపోర్ట్ ఫండ్‌ను ప్రకటించింది. చాలా మంది ప్రజలు దేశాన్ని దాటి వెళ్లిపోతున్నారు. దీంతో దేశంలోని వ్యాపారాలను నిర్వహించుకోవడానికి గూగుల్ ఈ సపోర్ట్ ఫండ్ ప్రకటించింది.
ఉక్రెయిన్ దేశంలో పెద్దపెద్ద భవనాలు, హాస్పిటల్స్, స్కూల్స్ వంటివి కూడా బాగా దెబ్బతిన్నాయి. నిత్యావరాలకే కష్టమైన ఉక్రెయిన్‌ను ఆదుకోవడానికి ప్రపంచంలోని చాలా దేశాలు ముందుకు వస్తున్నాయి. ఇప్పటికే గూగుల్ కంపెనీ 2022 మార్చిలో ఫండ్ ప్రకటించింది.
ఉక్రెయిన్‌ను గూగుల్ ఇప్పటికి కూడా తన మద్దతు అందిస్తూనే ఉంది. యుద్ధం మొదలైనప్పటి నుంచి సహాయక చర్యలకు మద్దతుగా 45 మిలియన్ డాలర్ల నగదు అందించినట్లు సమాచారం. గూగుల్ ఫండింగ్‌ను ప్రారంభించినప్పటి నుంచి ఉక్రెయిన్ ఫండ్ సపోర్ట్‌తో స్టార్టప్‌లు 15.8 మిలియన్ ఫాలో ఆన్ ఫండింగ్‌ను పొందాయి. దీంతో ఆ దేశంలో ఉపాధి గణనీయంగా పెరిగినట్లు కంపెనీ వెల్లడించింది.
ఇదీ చదవండి: విల్లాగా మారిన విమానం.. ఫిదా అవుతున్న జనం - వీడియో
Comments
Please login to add a commentAdd a comment