గతంలో ఫేస్‌బుక్ కంపెనీలో ఉద్యోగం కోల్పోయిన వ్యక్తులలో ఒకరు ఇప్పుడు ఓ సొంత కంపెనీ స్టార్ట్ చేసి ఏడాదికి ఏకంగా రూ.27 కోట్లు సంపాదిస్తున్న ఉదంతం వెలుగులోకి వచ్చింది. ఇంతకీ ఎవరా వ్యక్తి.. ఉద్యోగం కోల్పోయిన తరువాత ఏ కంపెనీ స్టార్ట్ చేసాడనే వివరాలు వివరంగా ఇక్కడ తెలుసుకుందాం.
2005లో ఫేస్‌బుక్ కంపెనీలో ప్రొడక్ట్ మేనేజర్‌గా పనిచేసిన 'నోహ్ కాగన్'.. టెక్ ప్రపంచంలో ఉన్నత స్థానాలకు చేరాలని కలలు కన్నారు. అయితే కంపెనీ సమాచారం మీడియాకు లీక్ చేశారనే ఆరోపణల కారణంగా ఫేస్‌బుక్ సంస్థ నుంచి బయటకు రావాల్సి వచ్చింది. కంపెనీ నుంచి బయటకు వచ్చిన తరువాత బాగా అలోచించి సొంతంగా ఎదగాలని నిర్ణయించుకున్నారు.
అప్పటికే ఫేస్‌బుక్, ఇంటెల్, మింట్.కామ్ వంటి దిగ్గజ టెక్ కంపెనీలలో పనిచేసిన అనుభవం ఉన్న నోహ్ కాగన్ 2010లో సొంత డిస్కౌంట్ సాఫ్ట్‌వేర్ వెబ్‌సైట్ 'యాప్‌సుమో' (AppSumo) ప్రారంభించారు. ప్రారంభంలో ఆశించిన లాభాలు రాకపోయినప్పటికీ పట్టు వదలకుండా కృషి చేసారు.
అంకిత భావంతో పనిచేయడంతో కంపెనీ లాభాల వైపు అడుగులు వేయడం ప్రారంభించింది. గత సంవత్సరం యాప్‌సుమో 80 మిలియన్ డాలర్లను ఆర్జించింది. ఇందులో లాభమే 7 మిలియన్ డాలర్ల కంటే ఎక్కువ కావడం గమనార్హం. అంటే ఇతనికి వచ్చిన లాభం భారతీయ కరెన్సీ ప్రకారం సుమారు రూ. 27 కోట్లు.
ఇదీ చదవండి: సత్య నాదెళ్ళ కీలక ప్రకటన.. 75 వేల మహిళలకు అవకాశం
ఇజ్రాయల్ నుంచి వలస వచ్చి అమెరికాలో స్ధిరపడిన కగన్ టెక్ పరిశ్రమ ద్వారా ప్రస్తుతం కోట్లు సంపాదిస్తున్నారు. తాను ప్రారంభంలో మైక్రోసాఫ్ట్ కంపెనీలో పనిచేయాలన్నట్లు 'నోహ్ కాగన్' వెల్లడించారు. అప్పట్లో బిల్ గేట్స్ ఐకానిక్ పర్సన్ అని.. ఆయనకు ప్రభావితమై ఆయన బాటలోనే నడవాలని అనుకోవడం వల్లనే టెక్ ప్రపంచంలో అడుగులు వేసినట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment