కొనసాగుతున్న ఆర్థిక అనిశ్చితి నేపథ్యంలో ఈ ఏడాది (2023) ప్రథమార్థంలో గ్లోబల్ టెక్ సెక్టార్‌లో పెద్ద కంపెనీలు మొదలుకుని స్టార్టప్‌ల వరకు 2.12 లక్షల మందికిగా ఉద్యోగాలు కోల్పోయారు. లేఆఫ్స్ ట్రాకింగ్ సైట్ ‘లేఆఫ్స్ డాట్ ఎఫ్‌వైఐ’ గణాంకాల ప్రకారం.. జూన్ 30 వరకు 819 టెక్ కంపెనీలు 212,221 మంది ఉద్యోగులను తొలగించి ఇంటికి పంపాయి.
ఏడాదిన్నరలో 3.8 లక్షల మంది..
గతేడాది (2022) 1,046 టెక్ కంపెనీలు 1.61 లక్షల మందికిపైగా ఉద్యోగులను తొలగించాయి. 2022 సంవత్సరంతోపాటు 2023 జూన్ వరకు మొత్తంగా దాదాపు 3.8 లక్షల మంది టెక్ ఉద్యోగులు తమ జాబ్స్ కోల్పోయారు. ఇదిలా ఉంటే మరికొన్ని పెద్ద టెక్ కంపెనీలు ఉద్యోగులను తొలగింపును కొనసాగిస్తున్నాయి. గతంలో లెక్కకు మించి చేపట్టిన నియామకాలు, ప్రపంపవ్యాప్తంగా అనిశ్చిత ఆర్థిక పరిస్థితులు, కోవిడ్ సంక్షోభం నుంచి తగిలిన బలమైన దెబ్బలను ఆయా కంపెనీలు ఉద్యోగుల తొలగింపునకు కారణాలుగా చెబుతున్నాయి.
భారత్‌లోనూ దారుణంగానే పరిస్థితి
భారతీయ టెక్ పరిశ్రమలోనూ పరిస్థితి దారుణంగానే ఉంది. ఈ సంవత్సరం (2023) జూన్ చివరినాటి వరకు 11,000 మందికి పైగా భారతీయ స్టార్టప్ ఉద్యోగులు జాబ్స్ కోల్పోయారు. 2022 ఇదే కాలంలో పోల్చితే ఇది దాదాపు 40 శాతం ఎక్కువ. ప్రపంచవ్యాప్తంగా స్టార్టప్‌ల తొలగింపులలో 5 శాతం భారత్‌లోనే జరిగాయి. Inc42 డేటా ప్రకారం.. 2022లో ఫండింగ్ మందగమనం స్థిరపడినప్పటి నుంచి ఇప్పటి వరకు 102 భారతీయ స్టార్టప్‌లు 27,000 మందికిపైగా ఉద్యోగులను తొలగించాయి. ఐదు ఎడ్‌టెక్ యునికార్న్‌లు సహా దాదాపు 22 ఎడ్‌టెక్ స్టార్టప్‌లు ఇప్పటివరకు దాదాపు 10,000 మంది ఉద్యోగులను తొలగించాయి.
ఇదీ చదవండి: మాదేం లేదు! వర్క్ ఫ్రం ఆఫీస్‌పై ఇన్ఫోసిస్ సీఈవో కీలక వ్యాఖ్యలు
Comments
Please login to add a commentAdd a comment