వాషింగ్టన్ : అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారీ షాక్ తగిలింది. హెచ్1బీ వీసాలతో సహా వర్కింగ్ వీసాలపైవీసాల జారీని తాత్కాలికంగా రద్దు చేస్తూ అధ్యక్షుడు ట్రంప్ తీసుకున్న నిర్ణయాన్ని కోర్టు అడ్డుకుంది. ఈ ఏడాది జూన్‌లో అధ్యక్షుడు ట్రంప్ జారీ చేసిన హెచ్1బీ వీసా నిషేధంపై నిలువరిస్తూ ఫెడరల్ జడ్జి ఉత్తర్వులు జారీ చేశారు. కాలిఫోర్నియా జిల్లా జడ్జి జెఫ్రీ వైట్ గురువారం ఈ ఉత్తర్వులు జారీ చేశారు. అంతేకాదు ట్రంప్ తన రాజ్యాంగ అధికారాన్ని మించిపోయారని వ్యాఖ్యానించారు. దీంతో హెచ్1 బీ వీసా ఆంక్షలను తక్షణమే అడ్డుకుంటుందని నేషనల్ అసోసియేషన్ ఆఫ్ మానుఫ్యాక్చరర్స్ ప్రతినిధులు తెలిపారు. (ఆమెకు పాజిటివ్ : ట్రంప్‌కు కరోనా పరీక్ష)
నేషనల్ అసోసియేషన్ ఆఫ్ మానుఫ్యాక్చరర్స్, యూఎస్ ఛాంబర్ ఆఫ్ కామర్స్, నేషనల్ రిటైల్ ఫెడరేషన్ , టెక్ నెట్ ప్రాతినిధ్యం వహిస్తున్న సంస్థలు దాఖలు చేసిన పిటిషన్ పై న్యాయమూర్తి ఈ ఆదేశాలిచ్చారు.
ఆర్థిక పునరుద్ధరణ, వృద్ధి ఆవిష్కరణలు అవసరమైన సమయంలో తమకు అడ్డంకులు కల్పించారని వాదించాయి. కీలకమైన కష్టసాధ్యమైన ఉద్యోగాలను నిరోధిస్తున్నవీసా పరిమితులపై ఈ తీర్పు ఊరటనిస్తుందని పేర్కొన్నారు. కరోనా వైరస్ మహమ్మారి నేపథ్యంలో ఈ ఏడాది చివరి వరకు పలు వీసాలను నిలిపివేస్తున్నామని, అమెరికన్లకే ఉద్యోగాలు అన్నదే తమ నినాదమంటూ ట్రంప్ గత జూన్ 22 న ఉత్తర్వులు జారీ చేశారు. హెచ్1బీ, హెచ్ 4, హెచ్ 2బీ, జే, ఎల్ వీసా సహా ఇతర విదేశీ వీసాలను జారీపై తాత్కాలిక నిషేధం విధించిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment