ట్రంప్ ఆర్డర్పై టెక్ దిగ్గజాల సవాల్ | Tech companies to meet on legal challenge to Trump immigration order | Sakshi
Sakshi News home page

ట్రంప్ ఆర్డర్పై టెక్ దిగ్గజాల సవాల్

Published Tue, Jan 31 2017 10:48 AM | Last Updated on Sat, Aug 25 2018 7:50 PM

ట్రంప్ ఆర్డర్పై టెక్ దిగ్గజాల సవాల్ - Sakshi

ట్రంప్ ఆర్డర్పై టెక్ దిగ్గజాల సవాల్

ఏడు ముస్లిం దేశాలపై నిషేధం విధిస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న ఇమ్మిగ్రేషన్ ఆర్డర్పై  టెక్ దిగ్గజాలు న్యాయపోరాటం దిశగా కదులుతున్నాయి. ట్రంప్ ఆర్డర్ను ఛాలెంజ్ చేస్తూ వేయబోయే దావాకు సపోర్టుగా అమికస్ బ్రీఫ్స్ను ఫైల్ చేయడానికి గ్రూఫ్ ఆఫ్ టెక్నాలజీ కంపెనీలు మంగళవారం ఓ మీటింగ్ నిర్వహించబోతున్నాయి. ఈ మీటింగ్లో దావాకు మద్దతుగా సమర్పించబోయే ఈ లీగల్ డాక్యుమెంట్పై చర్చించనున్నాయి. ఈ విషయాన్ని మీటింగ్ నిర్వహించబోయే కంపెనీ అధికార ప్రతినిధి చెప్పారు. సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ టూల్స్ రూపొందించే గిట్ హబ్ ఈ మీటింగ్కు టెక్ దిగ్గజాలు ఆల్ఫాబెట్ ఇంక్ గూగుల్,  ఎయిర్బీఎన్బీ ఇంక్, నెట్ఫ్లిక్స్ ఇంక్ వంటి కంపెనీలకు ఆహ్వానాలు పంపినట్టు సంబంధిత వర్గాలు చెప్పాయి.
 
అయితే దీనిపై గూగుల్, నెట్ఫ్లిక్స్ అధికారులు ఇంకా స్పందించలేదు. గతవారం ట్రంప్ జారీచేసిన ట్రావెల్ బ్యాన్పై టెక్నాలజీ సెక్టార్ చాలా ఆగ్రహంగా ఉంది. ఏడు దేశాలపై నిషేధం విధించడాన్ని తీవ్రంగా తప్పుబడుతున్న టెక్ దిగ్గజాలు, ఇతర దేశాల్లో ఉన్న తమ ఇమ్మిగ్రేట్లను వెనక్కి రప్పించడానికి కంపెనీలు ఫైనాన్సియల్ సపోర్టును అందిస్తున్నాయి. ట్రంప్ ఆర్డర్ తమ బిజినెస్లపై ప్రతికూల ప్రభావాన్ని చూపనున్నాయని ఇప్పటికే అమెజాన్.కామ్, ఎక్స్పీడియా ఇంక్ వంటి కంపెనీలు ఆందోళన వ్యక్తంచేశాయి.    

దీనికి సంబంధించిన మరిన్ని వార్తలకై చదవండి

(అమెరికా దిక్కులు పిక్కటిల్లేలా..)

(ఇది ముస్లింలపై నిషేధంకాదు: ట్రంప్‌)

(ట్రంప్‌ ‘నిషేధం’: ఐసిస్‌ విజయోత్సవాలు)

(ట్రంప్‌ చెప్పింది పచ్చి అబద్ధం!)

(అమెరికాను సమర్థించిన సౌదీ, అబుదాబి)

(ట్రంపోనమిక్స్‌ మనకు నష్టమా? లాభమా?)

(ట్రంప్‌గారు మా దేశంపై నిషేధం విధించండి!)

(ట్రంప్‌కు దిమ్మతిరిగే షాకిచ్చిన సీఈవో!)

(వీసా హోల్డర్స్పై ట్రంప్ కొరడా)

 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement