legal challenge
-
ట్రంప్ ఆర్డర్‌పై టెక్ దిగ్గజాల సవాల్
ఏడు ముస్లిం దేశాలపై నిషేధం విధిస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న ఇమ్మిగ్రేషన్ ఆర్డర్‌పై టెక్ దిగ్గజాలు న్యాయపోరాటం దిశగా కదులుతున్నాయి. ట్రంప్ ఆర్డర్‌ను ఛాలెంజ్ చేస్తూ వేయబోయే దావాకు సపోర్టుగా అమికస్ బ్రీఫ్స్ను ఫైల్ చేయడానికి గ్రూఫ్ ఆఫ్ టెక్నాలజీ కంపెనీలు మంగళవారం ఓ మీటింగ్ నిర్వహించబోతున్నాయి. ఈ మీటింగ్‌లో దావాకు మద్దతుగా సమర్పించబోయే ఈ లీగల్ డాక్యుమెంట్‌పై చర్చించనున్నాయి. ఈ విషయాన్ని మీటింగ్ నిర్వహించబోయే కంపెనీ అధికార ప్రతినిధి చెప్పారు. సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ టూల్స్ రూపొందించే గిట్ హబ్ ఈ మీటింగ్‌కు టెక్ దిగ్గజాలు ఆల్ఫాబెట్ ఇంక్ గూగుల్, ఎయిర్‌బీఎన్‌బీ ఇంక్, నెట్‌ఫ్లిక్స్ ఇంక్ వంటి కంపెనీలకు ఆహ్వానాలు పంపినట్టు సంబంధిత వర్గాలు చెప్పాయి. అయితే దీనిపై గూగుల్, నెట్‌ఫ్లిక్స్ అధికారులు ఇంకా స్పందించలేదు. గతవారం ట్రంప్ జారీచేసిన ట్రావెల్ బ్యాన్పై టెక్నాలజీ సెక్టార్ చాలా ఆగ్రహంగా ఉంది. ఏడు దేశాలపై నిషేధం విధించడాన్ని తీవ్రంగా తప్పుబడుతున్న టెక్ దిగ్గజాలు, ఇతర దేశాల్లో ఉన్న తమ ఇమ్మిగ్రేట్లను వెనక్కి రప్పించడానికి కంపెనీలు ఫైనాన్సియల్ సపోర్టును అందిస్తున్నాయి. ట్రంప్ ఆర్డర్ తమ బిజినెస్‌లపై ప్రతికూల ప్రభావాన్ని చూపనున్నాయని ఇప్పటికే అమెజాన్.కామ్, ఎక్స్పీడియా ఇంక్ వంటి కంపెనీలు ఆందోళన వ్యక్తంచేశాయి. దీనికి సంబంధించిన మరిన్ని వార్తలకై చదవండి (అమెరికా దిక్కులు పిక్కటిల్లేలా..) (ఇది ముస్లింలపై నిషేధంకాదు: ట్రంప్) (ట్రంప్ ‘నిషేధం’: ఐసిస్ విజయోత్సవాలు) (ట్రంప్ చెప్పింది పచ్చి అబద్ధం!) (అమెరికాను సమర్థించిన సౌదీ, అబుదాబి) (ట్రంపోనమిక్స్ మనకు నష్టమా? లాభమా?) (ట్రంప్‌గారు మా దేశంపై నిషేధం విధించండి!) (ట్రంప్‌కు దిమ్మతిరిగే షాకిచ్చిన సీఈవో!) (వీసా హోల్డర్స్పై ట్రంప్ కొరడా) -
జల్లికట్టుకు మరో చిక్కు
• తమిళనాడు చట్టాన్ని సవాల్ చేసిన జంతుహక్కుల కార్యకర్తలు • పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన అత్యున్నత న్యాయస్థానం • 30న విచారణ న్యూఢిల్లీ: సంప్రదాయ జల్లికట్టు క్రీడకు మరోసారి న్యాయపరమైన సవాల్ ఎదురైంది. జల్లికట్టును పునరుద్ధరిస్తూ తమిళనాడు ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేయడం, ఆ వెంటనే అసెంబ్లీలో తీర్మానాన్ని ఆమోదించి చట్టంగా రూపొందించచడాన్ని సవాల్ చేస్తూ జంతు సంక్షేమ బోర్డు (ఏడబ్ల్యూబీఐ) సహా ఇతర సంస్థలు దాఖలు చేసిన పిటిషన్లను విచారించేందుకు సర్వోన్నత న్యాయస్థానం అంగీకరిచింది. ఈ నెల 30వ తేదీన ఏడబ్ల్యూబీఐతోపాటు, ఇతర సంస్థలు దాఖలుచేసిన అన్ని పిటిషన్లను ఒకేసారి విచారిస్తాం’అని ధర్మాసనం పేర్కొంది. జల్లికట్టు పేరిట జంతువులను యధేచ్ఛగా హింసిస్తున్నారంటూ అంతర్జాతీయ జంతు కారుణ్య సంస్థ పెటా చేసిన వాదనను సమర్థించిన ధర్మాసనం. గత ఏడాది చివరిలో ఈ సంప్రదాయ క్రీడను నిషేధించడం తెలిసిందే. అయితే జల్లికట్టు సంక్రాతి(పొంగల్) సందర్భంగా నిర్వహించే క్రీడ కావడంతో పండుగ వేళ తమిళనాడు వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. మెరీనా బీచ్ వేదికగా గతవారం భారీ నిరసనలు జరిగాయి. దీంతో తమిళనాడు ప్రభుత్వం హుటాహుటిన ఆర్డినెన్స్ జారీ చేసింది. ఆ మరునాడే అసెంబ్లీలో జల్లికట్టుకు అనుకూలంగా తీర్మానం చేసింది. జల్లికట్టు పోస్టర్ వద్ద త్రివర్ణపతాకంలా నిలిచిన చెన్నైలోని ఎవర్విన్ పాఠశాల విద్యార్థులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు జల్లికట్టుపై రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఆర్డినెన్స్‌ను సుప్రీం కోర్టు కొట్టివేస్తుందనే అనుమానాల నేపథ్యంలో సుప్రీకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ మార్కండేయ కట్జూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జల్లికట్టుపై తమిళ సర్కారు జారీచేసిన ఆర్డినెన్స్ తాతాలికమైనదేఅయినా, శాసన సభ ఆమోదంతో అది చట్టంగా మారిందని గుర్తుచేశారు. అసెంబ్లీ ఆమోదించిన బిల్లులును సుప్రీంకోర్టులో సవాల్‌చేసే అవకాశం ఉన్నప్పటికీ, రాజ్యాంగంలోని అధికరణ 254(2) ప్రకారం జల్లికట్టు బిల్లుకు రక్షణ లభిస్తుందని, అందువల్ల జల్లికట్టు అభిమానులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కట్జూ వ్యాఖ్యానించారు