ఇజ్రాయెల్ - హమాస్ మధ్య గత కొన్ని రోజులుగా భీకర పోరు జరుగుతున్న సంగతి అందరికి తెలిసిందే. ఇప్పటికే కొన్ని కంపెనీలు తమ ఉద్యోగుల భద్రతను దృష్టిలో ఉంచుకుని వర్క్ ఫ్రమ్ హోమ్ అవకాశం కల్పించాయి. మరి కొన్ని కంపెనీలు తమ కార్య కలాపాలను ఇతర దేశాలకు తరలించడానికి సన్నాహాలు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.
ప్రతి సంవత్సరం ఐటీ రంగం ద్వారా బాగా లాభాలను ఆర్జిస్తున్న ఇజ్రాయెల్ పరిస్థితి నేడు ఆందోళనకరంగా ఉంది. ఈ దేశంలో గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి కంపెనీలు తమ కార్యకలాపాలను నిర్వహిస్తున్నాయి. ఇందులో లక్షల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు.
అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్ వంటి దేశాలకు చెందిన కీలకమైన ప్రాజెక్టులను ఇజ్రాయెల్‌లోని కంపెనీలు నిర్వహిస్తున్నాయి. యుద్ధ వాతావరణంలో ఉన్న ఈ దేశంలో నిర్వహణ సజావుగా ముందుకు సాగే సూచనలు ప్రస్తుతం కనిపించడం లేదు. కావున ఈ కంపెనీల చూపు ఇండియా వంటి దేశాలమీద పడింది.
ఇదీ చదవండి: I am not a robot: ఇది ఎందుకొస్తుంది? అసలు విషయం తెలిస్తే షాక్ అవుతారు!
కేవలం పరిస్థితుల ప్రభావం మాత్రమే కాకుండా.. ఐటీ కంపెనీలలో పనిచేసేవారిలో కొందరు సైన్యంలో విధులు నిర్వహించడానికి వెళ్లినట్లు సమాచారం. కావున ఉద్యోగుల కొరత కూడా ఏర్పడింది. దీంతో అవసరమైన నైపుణ్యం కలిగిన ఉద్యోగులు మనదేశంలో ఉండటం వల్ల చాలా కంపెనీలు భారతదేశంవైపు మొగ్గు చూపుతున్నాయి. ఇదే జరిగితే మనదేశంలో మరిన్ని ఉద్యోగాలు పెరిగే అవకాశం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment