గ్లోబల్‌గా ఉచిత వైఫై సేవలు | Free Global Wi-Fi Service Chinese Company Unveils First Satellite | Sakshi
Sakshi News home page

గ్లోబల్‌గా ఉచిత వైఫై సేవలు: తొలి శాటిలైట్‌ లాంచ్‌

Published Sat, Dec 1 2018 9:00 AM | Last Updated on Sat, Dec 1 2018 9:18 AM

Free Global Wi-Fi Service Chinese Company Unveils First Satellite  - Sakshi

బీజింగ్‌ : టెక్నాలజీ రంగంలోనూతన ఆవిష్కరణలకు సంబంధించి చైనా టెక్నాలజీ సంస్థ  మరో సంచలనానికి శ్రీకారం చుట్టింది. గ్లోబల్‌గా ఉచిత వైఫై సేవలను ను అందించేందుకు  ప్రణాళికలు సిద్ధం  చేసింది.  ప్రత్యర్థి టెక్‌ దిగ్గజాలు గూగుల్‌, స్పేస్‌ఎక్స్‌లాంటి  సంస్థల మాదిరిగా ప్రపంచవ్యాపితంగా ఉచిత వైఫై సేవలను అందించేందుకు తొలి అడుగు వేసింది. ప్రణాళికలో  భాగంగా చైనాకు చెందిన  కంపెనీ లింక్‌స్యూర్‌ నెట్‌వర్క్‌  తన మొదటి శాటిలైట్‌ను లాంచ్‌ చేసింది.  

చైనాలో జియుక్వాన్ శాటిలైట్ లాంచ్ సెంటర్  ద్వారా దీన్ని ప్రారంభించింది.స్థానిక టెలికాం నెట్‌వర్క్‌లు కవర్‌చేయని ప్రాంతాల్లో కూడా యూజర్లు  తమ శాటిలైట్‌ద్వారా ఇంటర్నెట్‌ సేవలనువినియోగించు కోవచ్చంటూ స్థానిక మీడియా రిపోర్టు చేసింది. ఈ ప్రాజెక్టు కోసం సుమారు రూ.3వేలకోట్లను పెట్టుబడిగా పెడుతున్నట్టు లింక్‌స్యూర్‌ నెట్‌వర్క్‌ సీఈవో వాంగ్‌ జింగ్‌ యింగ్‌ తెలిపారు. అంతేకాదు 2020 నాటికి అంతరిక్షంలో 10 ఉపగ్రహాలను లాంచ్‌  చేస్తామన్నారు.  అలాగే 2026 నాటికి 272 ఉపగ్రహాలను విడుదల చేయాలన్న ప్రణాళికతో ఉన్నట్టు ఆయన వెల్లడించారు.

కాగా  ప్రస్తుతం, గూగుల్, స్పేస్‌ఎక్స్‌, వన్‌ వెబ్‌, టెలి సాట్‌వంటి అనేక విదేశీ టెక్నికల్ కంపెనీలు ఇప్పటికే ఇంటర్నెట్ ఇంటర్నెట్ యాక్సెస్ కోసం ఉపగ్రహాలను లాంచ్‌  చేసే ప్రణాళికలను ప్రకటించాయి. ఈ క‍్రమంలో  స్పేస్‌ఎక్స్‌ 7వేలకు పైగా స్టార్‌లింక్‌ ఇంటర్నెట్‌ శాటిలైట్లను ప్రవేశపెట్టేందుకు అమెరికా ఫెడరల్‌ కమ్యూనికేషన్‌ కమిషన్‌(ఎఫ్‌సీసీ) అనుమతి పొందింది. మొత్తం12వేల ఉపగ్రహాలను విడుదల చేయాలనేది స్పేస్ఎక్స్ లక్ష్యం. అయితే ఈ ప్రక్రియ మొత్తం పూర్తికావడానికి మరో ఆరు సంవత్సరాలకు పైగా పడుతుందని ఇటీవల వెల్లడించింది. ఐక్యరాజ్యసమితి సమాచారం ప్రకారం, 2017 చివరి నాటికి  ఇంటర్నెట్‌ సేవలు అందుబాటులో లేని ప్రజలు 3.9 బిలియన్లకు పైనే.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement