హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: గత ఏడాదితో పోలిస్తే 2022–23లో మాల్స్ అద్దె ఆదాయం 30 శాతం పెరుగుతుందని రేటింగ్స్ ఏజెన్సీ ఇక్రా నివేదిక వెల్లడించింది. ‘ప్రధానంగా డిమాండ్ పెరగడం, కోవిడ్–19 వ్యాక్సిన్లు అత్యధికులకు ఇవ్వడం, మల్టీఫ్లెక్స్‌లు పునఃప్రారంభం ఇందుకు కారణం. 2021 ఆగస్ట్ నుంచి రిటైల్ మాల్స్ కార్యకలాపాల రికవరీ ప్రారంభమైంది.
ఒమిక్రాన్ కారణంగా క్లుప్త విరామం మినహా 2021–22 అర్ధ భాగం మెరుగ్గా కొనసాగింది. మూడవ త్రైమాసికంలో రిటైల్ వ్యాపారం విలువ పరంగా కోవిడ్ ముందస్తు స్థాయికి చేరుకుంది. నాల్గవ త్రైమాసికంలో ఈ వ్యాపార విలువను మించిపోయింది.
2022–23 మూడవ త్రైమాసికంలో కోవిడ్ పూర్వ స్థాయిలో వినియోగదార్ల రాక ఉంటుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మాల్స్‌కు 2019–20 స్థాయి కంటే 4–6 శాతం అధిక అద్దె ఆదాయం సమకూరుతుంది. ఆక్యుపెన్సీ మరింత మెరుగు అవుతుంది’ అని ఇక్రా వివరించింది.
Comments
Please login to add a commentAdd a comment