
లెక్కపెట్టగలవా.. చిల్లర లెక్కపెట్టగలవా!
మంచిర్యాల అగ్రికల్చర్: దగ్గర ఉన్న పెద్ద నోట్లను ఖాతాలో వేసుకొని చిన్న నోట్లను తీసుకుందామని బ్యాంకుకు వెళ్తే బ్యాంకు వారు ఇచ్చే చిల్లరను చూసి జనం అశ్చర్యపోవాల్సి వస్తోంది. తీసుకున్న చిల్లరను జేబులో పెట్టుకొని వస్తామనుకుంటే పొరపడినట్లే..! ఏ వంద నోటో.. యాభై నోటో.. ఇస్తారనుకుని బ్యాంకుకు వెళ్తే గతంలో ఎన్నడూ లేని విధంగా పది రూపాయల కాయిన్‌స ఖాతాదారులకు అందిస్తున్నారు.
ఆర్‌బీఐ నుంచి బ్యాంకులకు సరిపడా నగదు రాకపోవడంతో చిల్లర అందిస్తున్నారు. వెయి నుంచి మొదలుకుని ఆరు వేల రూపాయల వరకు చిల్లర ఇస్తున్నారు. కాగా.. మూట కట్టించి ఇచ్చిన కాటన్ సంచి బ్యాంకు వారికి తిరిగి ఇవ్వకుంటే బ్యాంక్ పాస్ బుక్ ఇవ్వడం లేదు. దీంతో ఖాతాదారులు బ్యాంకుల వద్దే గంటల తరబడి ఉండి బిల్లలు లెక్కించారు.