భారతదేశంలోని అతిపెద్ద ప్రైవేట్ కంపెనీ రిలయన్స్ ఇండస్ట్రీస్ తన రిలయన్స్ ఫౌండేషన్ ద్వారా కంపెనీ ఉద్యోగులు, వారి కుటుంబాలకు అదేవిధంగా అసోసియేట్లు, భాగస్వాములకు కలిపి 10 లక్షలకు పైగా కోవిడ్-19 వ్యాక్సిన్లు ఇచ్చినట్లు పేర్కొంది. రిలయన్స్ ఫౌండేషన్ ఏప్రిల్ లో వ్యాక్సినేషన్ డ్రైవ్ ప్రారంభించినట్లు కంపెనీ పేర్కొంది. ఇప్పటి వరకు అర్హత కలిగిన మొత్తం ఉద్యోగుల్లో 98 శాతం మంది కోవిడ్-19 వ్యాక్సిన్ కనీసం ఒక డోస్ తీసుకున్నారు. అంతేగాకుండా, రిలయన్స్ ఫౌండేషన్ ద్వారా దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న కమ్యూనిటీలకు ఉచిత వ్యాక్సినేషన్ వేయడం ప్రారంభించినట్లు సంస్థ తెలిపింది.
ఇందులో 'వి కేర్ ఇనిషియేటివ్' కింద అదనంగా 10 లక్షల మోతాదులు ఇవ్వనున్నట్లు వారు తెలిపారు. ఇది అతి పెద్ద ఉచిత కార్పొరేట్ వ్యాక్సినేషన్ కార్యక్రమం. ప్రస్తుత కరోనా సంక్షోభంపై పోరాడటానికి ఇది ఒక్కటే మార్గం. గత నెలలో జరిగిన రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ వార్షిక సర్వసభ్య సమావేశంలో పేర్కొన్నట్లు రిలయన్స్ ఫౌండేషన్ చైర్ పర్సన్ నీతా ఎమ్. అంబానీ సాధారణ సమాజానికి టీకాలు వేయదనీ కట్టుబడి ఉన్నట్లు తెలిపారు. "ఈ మిషన్ దేశవ్యాప్తంగా అమలు చేయడం ఒక అతిపెద్ద పని. ప్రతి భారతీయుడి భద్రత, రక్షణ మా వాగ్దానం" అని ఆమె చెప్పింది. కోవిడ్-19 మహమ్మారి నుంచి రిలయన్స్ ఫౌండేషన్ అంతర్గత, బాహ్య సమాజాలను రక్షించే తమ సామాజిక బాధ్యత అని సంస్థ పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment