ముకేష్ అంబానీ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్(ఆర్‌ఐఎల్) ప్రమోటర్ గ్రూపు సంస్థలో బ్లాక్ డీల్ కుదుర్చుకుంది.
ముంబై: ముకేష్ అంబానీ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్(ఆర్‌ఐఎల్) ప్రమోటర్ గ్రూపు సంస్థలో బ్లాక్ డీల్ కుదుర్చుకుంది. తద్వారా సుమారు 10 శాతానికి పైగా వాటాలు చేతులు మారాయి. బీఎస్‌ఈలో 12.58 శాతం వాటాకు సమానమైన 39.6 కోట్ల షేర్లు ఈ లావాదేవీ ద్వారా ట్రేడయ్యాయి. ప్రతిపాదిత బదిలీలు ప్రమోటర్ గ్రూప్‌లోనే జరిగినట్లు కంపెనీ పేర్కొంది.
ఈ మేరకు మార్చి 2 న 2017 ఆర్ఐఎల్ స్టాక్ ఎక్సేంజ్‌లకు సమాచారం అందించింది. 'ఇంటర్ సే' బదిలీ ద్వారా 1,190 మిలియన్ షేర్లను ఇతర ప్రమోటర్ గ్రూపు సంస్థలకు బదిలీ జరిగినట్టు తెలిపింది. ఈ డీల్ ప్రకారం 38. 74 శాతం ఓటింగ్ హక్కులు లేదా 36.7 శాతం షేర్ క్యాపిటల్ బదిలీ అయినట్టు.
కాగా ఈ బ్లాక్ డీల్ వార్తలతో రిలయన్స్ షేరు 1 శాతానికిపై గా నష్టపోయింది.