ముంబై: ముకేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ జియో జోష్‌తో మాతృసంస్థ రిలయన్స్ ఇండస్ట్రీస్ భారీగా పుంజుకుంది. ఏప్రిల్ నెలలో జియో కస్టమర్లు పెరగడంతో మార్కెట్లో రిలయన్స్ కౌంటర్‌కు డిమాండ్ పుట్టింది. దాదాపు 3.37 శాతం జంప్‌చేసి బుధవారం నాటి మార్కెట్ లో టాప్ విన్నర్‌గా నిలిచింది.
4జీ సేవల మొబైల్ సంస్థ జియోకు కొత్తగా 3.9 మిలియన్లమంది వినియోగదారులు జత కలిశారు. ఏప్రిల్ నెలలో భారీగా వినియోగదారులు పెరగడంతో రిలయన్స్ ఇండస్ట్రీస్ షేరు భారీగా లాభపడింది. మంత్ ఆన్ మంత్ 3.56 వృద్ధిని సాధించి మార్కెట్ లీడర్లు భారతి ఎయిర్‌టెల్, వోడాఫోన్‌లను అధిగమించింది.
టెలికాం రెగ్యులేటర్ అందించిన సమాచారం ప్రకారం ఏప్రిల్ 30, 2017 నాటికి రిలయన్స్ జియో మొత్తం చందాదారులు మార్చిలో 10.86 కోట్ల నుంచి 11.26 కోట్లకు పెరిగింది .ఽ వైర్లెస్ సబ్స్క్రైబర్ల విషయంలో జియో మార్కెట్ వాటా మార్చి నెలాఖరు 9.29 శాతం నుంచి 9.58 శాతానికి చేరింది. ఉచిత 4జీ సేవలకు స్వస్తి చెప్పినప్పటికీ కంపెనీ వినియోగదారులు పెరగడంతో ఈ కౌంటర్‌కు డిమాండ్ పుంజుకుంది. రిలయన్స్ ఇండస్ట్రీస్ లో జియో చిన్నభాగమే అయినప్పటికీ కీలక పాత్ర పోషిస్తోందని ఎనలిస్టులు చెబుతున్నారు. జయో ఉచిత సేవలు, సరసమైన ధరల నిర్ణయం కొంతకాలంగాభారీ చందాదారులను సంపాదించడానికి సహాయపడిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. గత ఏడాది సెప్టెంబరులో రిలయన్స్ జియో తన సేవలను ప్రారంభించింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ జియోలో 25 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టిందని అంచనా.
ఆర్‌ఐఎల్‌కు జియో జోష్
Published Wed, Jun 14 2017 3:46 PM | Last Updated on Tue, Sep 5 2017 1:37 PM
Advertisement