
న్యూఢిల్లీ: రిలయన్స్ ఇండస్ట్రీస్ చేతికి టెక్స్‌టైల్స్ కంపెనీ అలోక్ ఇండస్ట్రీస్ దక్కనున్నది. బ్యాంక్‌లకు రూ.23,000 కోట్ల మేర బకాయిల చెల్లింపుల్లో విఫలం కావడంతో అలోక్ ఇండస్ట్రీస్ కంపెనీపై దివాలా ప్రక్రియ కొనసాగుతోంది. ఈ ప్రక్రియలో భాగంగా రిలయన్స్ ఇండస్ట్రీస్ రూపొందించిన పరిష్కార ప్రణాళికకు అలోక్ ఇండస్ట్రీస్ రుణదాతలు ఆమోదం తెలిపారు. రుణదాతల్లో 72 శాతం మంది తమ ప్రణాళికకు ఆమోదం తెలిపారని రిలయన్స్ ఇండస్ట్రీస్ వెల్లడించింది. మరోవైపు అలోక్ ఇండస్ట్రీస్ కూడా ఈ విషయాన్ని ధ్రువీకరించింది.