Oil Refinery
-
4 రోజుల నిరసనకు 4ఏళ్ల శిక్ష
భూమిపై వాతావరణ మార్పులు, కాలుష్యానికి కారణమవుతున్న శిలాజ ఇంధనాల తవ్వకానికి ప్రభుత్వం అనుమతి ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ నాలుగు రోజులపాటు శాంతియుతంగా నిరసన తెలిపిన నలుగురు సామాజిక కార్యకర్తలకు నాలుగేళ్ల చొప్పున జైలుశిక్ష పడింది. మరో కార్యకర్తకు ఐదు సంవత్సరాల జైలు శిక్ష విధించారు. పురాతన ప్రజాస్వామ్య దేశమని చెప్పుకొనే యునైటెడ్ కింగ్డమ్(యూకే)లో జరిగిన ఈ ఘటన చర్చనీయాంశంగా మారింది. కోర్టు తీర్పును ప్రజలు, ప్రజాస్వామ్యవాదులు తప్పుపడుతున్నారు. యూకేలోని ఉత్తర సముద్రంలో చమురు తవ్వకాలకు 2022లో అప్పటి ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసింది. లైసెన్స్‌లు ఇచ్చేసింది. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ 2022 నవంబర్‌లో ‘జస్ట్ స్టాప్ ఆయిల్’అనే నినాదంతో సామాజిక కార్యకర్తలు నిరసన బాటపట్టారు. అనుమతులు రద్దు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నిరసన కార్యక్రమాలను 22 ఏళ్ల గ్రెస్సీ గెథిన్ అనే యువతి ముందుండి నడిపించింది. ఈ ఉద్యమం పలువురిని ఆకర్శించడంతో వారు ఇందులో భాగస్వాములయ్యారు. భూగోళాన్ని కలుషితం చేసే చమురు తవ్వకాలు వద్దంటూ నినదించారు. లండన్ చుట్టూ ఉన్న మేజర్ రింగ్ రోడ్డుపై నాలుగు రోజులపాటు నిరసన తెలిపారు. ప్లకార్డులు ప్రదర్శించారు. చెట్లు, భవనాలపైకి ఎక్కి బిగ్గరగా నినాదాలు చేశారు. ఇదంతా పూర్తిగా శాంతియుతంగానే సాగింది. హింస అనే మాటే లేదు. ఆస్తులకు గానీ, ప్రజలకు గానీ ఎలాంటి నష్టం వాటిల్లలేదు.లక్షల డాలర్ల నష్టం వాటిల్లిందట! రింగ్ రోడ్డుపై బైఠాయింపులు, నిరసనలతో వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగిందని, ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని ఆరోపిస్తూ గ్రెస్సీ గెథిన్తోపాటు పలువురు సామాజిక కార్యకర్తలపై పోలీసులు అభియోగాలు మోపారు. దాదాపు రెండేళ్లపాటు లండన్ కోర్టులో విచారణ జరిగింది. ‘జస్ట్ స్టాప్ ఆయిల్’నిరసనల వల్ల నాలుగు రోజులపాటు రింగ్ రోడ్డుపై 7 లక్షలకుపైగా వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగిందని పోలీసుల తరఫున ప్రాసిక్యూటర్లు వాదించారు. దీనివల్ల దేశ ఆర్థిక వ్యవస్థకు 9.80 లక్షల డాలర్ల నష్టం వాటిల్లిందని చెప్పారు. రోడ్డుపై పరిస్థితిని చక్కదిద్దడానికి పోలీసులు 1.3 మిలియన్ డాలర్లు ఖర్చు చేయాల్సి వచి్చందని తెలిపారు. నిరసనకారులు కుట్రపూరితంగానే ప్రజలకు ఇక్కట్లు కలుగజేశారని ఆరోపించారు. ప్రాసిక్యూటర్ల వాదనతో లండన్ కోర్టు ఏకీభవించింది. గ్రెస్సీ గెథిన్తోపాటు లూయిసీ లాంకాస్టర్, డేనియల్ షా, లూసియాకు నాలుగేళ్ల చొప్పున జైలుశిక్ష విధిస్తూ ఈ ఏడాది జూలైలో తీర్పు వెలువరించింది. ‘జస్ట్ స్టాప్ ఆయిల్’సహా వ్యవస్థాపకుడు రోజర్ హల్లామ్ ఐదేళ్లపాటు జైలు శిక్ష విధించింది. ప్రస్తుతం దోషులంతా జైలులో ఉన్నారు. వారి విడుదల కోసం సామాజిక కార్యకర్తలు పోరాడుతున్నారు. న్యాయం పోరాటం కొనసాగిస్తున్నారు. అహింసాయుతంగా జరిగిన నిరసనలకు నాలుగేళ్ల చొప్పున జైలుశిక్ష విధించడం యూకే చరిత్రలో ఇదే మొదటిసారి కావడం గమనార్హం. శాంతియుత నిరసనలకు సైతం జైలుశిక్ష విధించేలా యూకేలో రెండు వివాదాస్పద చట్టాలు అమల్లో ఉన్నాయి. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఖమ్మంలో నూనె శుద్ధి కర్మాగారం
సాక్షి, హైదరాబాద్: దేశంలో ఆయిల్‌పామ్ సాగులో అతిపెద్దదైన గోద్రెజ్ ఆగ్రోవెట్ లిమిటెడ్ రూ.250 కోట్లతో ఖమ్మం జిల్లాలో వంట నూనెల శుద్ధి కర్మాగారాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. 30 టీపీహెచ్ (టోటల్ పెట్రోలియం హైడ్రోకార్బన్) సామర్ధ్యంతో ఏర్పాటయ్యే ఈ ఫ్యాక్టరీని క్రమంగా 60 టీపీహెచ్‌లకు విస్తరిస్తారు. ఈ ఫ్యాక్టరీ ద్వారా పామాయిల్‌ను శుద్ధి చేస్తారు. ఈ మేరకు గోద్రెజ్ ఆగ్రోవెట్ లిమిటెడ్ ఎండీ బలరామ్‌సింగ్ యాదవ్ గురువారం రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావుతో భేటీ అయ్యారు. ఈ ఫ్యాక్టరీ 2025–26 నాటికి పూర్తి స్థాయిలో పనిచేస్తుందని, కో జనరేషన్ ద్వారా విద్యుత్ ఉత్పత్తిలో స్వయం సమృద్ధిని సాధిస్తుందన్నారు. పది గోద్రెజ్ సమాధాన్ సెంటర్ల ద్వారా రైతులకు అందుబాటులో ఉంటుందని, ఇప్పటికే ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో సేవలు అందిస్తోందని చెప్పారు. శాటిలైట్, డ్రోన్ల ద్వారా సాగు విస్తీర్ణాన్ని పర్యవేక్షించడంతో పాటు వేర్వేరు యాప్‌ల ద్వారా రైతులకు సేవలు అందిస్తామన్నారు. ఈ యూనిట్ ఏర్పాటు ద్వారా 250 మందికి ప్రత్యక్షంగా, 500 మందికి పరోక్షంగా ఉపాధి లభించనుంది. వంట నూనెల దిగుమతిని తగ్గించేందుకు రాష్ట్రంలో 20 లక్షల ఎకరాల్లో ఆయిల్‌పామ్ సాగును ప్రోత్సహించడం ద్వారా పసుపు విప్లవం దిశగా శరవేగంగా అడుగులు వేస్తున్నట్లు కేటీఆర్ పేర్కొన్నారు. ఈ భేటీలో ఎంపీ రంజిత్‌రెడ్డితో పాటు ఐటీ, పరిశ్రమల శాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్ రంజన్ తదితరులు పాల్గొన్నారు. -
‘మేఘా’కు మంగోలియా ప్రాజెక్ట్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశీ మౌలిక సదుపాయాల దిగ్గజం మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ (ఎంఈఐఎల్) తాజాగా మంగోలియా మార్కెట్లో అడుగుపెట్టింది. దేశీయంగా తొలి గ్రీన్‌ఫీల్డ్ ఆయిల్ రిఫైనరీని నిర్మించే భారీ కాంట్రాక్టును దక్కించుకుంది. దీని విలువ 790 మిలియన్ డాలర్లు. మంగోల్ రిఫైనరీ ప్రాజెక్టుకు సంబంధించి ఎల్వోఏ (లెటర్ ఆఫ్ ఆఫర్ అండ్ యాక్సెప్టెన్సీ)ను అందుకున్నట్లు ఎంఈఐఎల్ తెలిపింది. ఇంజినీరింగ్, ప్రొక్యూర్మెంట్, కన్స్ట్రక్షన్ (ఈపీసీ) ప్రాతిపదికన ఈ కాంట్రాక్టు కింద ఓపెన్ ఆర్ట్ యూనిట్లు, యుటిలిటీలు, ప్లాంటు భవంతులు, క్యాప్టివ్ పవర్ ప్లాంట్లు మొదలైనవి నిర్మించాల్సి ఉంటుందని వివరించింది. ప్రాజెక్ట్ పూర్తయిన తర్వాత ఈ రిఫైనరీలో రోజుకు 30,000 బ్యారెల్స్, ఏడాదికి 1.5 మిలియన్ టన్నుల ముడి చమురును ప్రాసెస్ చేయవచ్చు. కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ (ఎంఈఏ) తలపెట్టిన భాగస్వామ్య అభివృద్ధి ప్రయత్నాల్లో భాగంగా, భారత ప్రభుత్వ ఆర్థిక సహాయ సహకారాలతో మంగోలియా ఈ ప్రాజెక్టును నిర్మించనుంది. దీనికి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఇంజినీర్స్ ఇండియా (ఈఐఎల్) ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ కన్సల్టెంట్‌గా వ్యవహరించనుంది. ఇరు దేశాల మధ్య సంబంధాలు మరింత మెరుగుపడేందుకు, హైడ్రోకార్బన్స్ రంగంలో తమ వ్యాపార విస్తరణ వ్యూహాలకు ఈ ప్రాజెక్టు కీలకంగా ఉండగలదని కంపెనీ తెలిపింది. దీనితో రష్యన్ ఇంధనంపై మంగోలియా ఆధారపడటం తగ్గుతుందని, అలాగే తమ పెట్రోలియం ఉత్పత్తుల అవసరాలను స్వయంగా తీర్చుకునేందుకు ఇది దోహదపడుతుందని పేర్కొంది. స్థానికంగా చిన్న పరిశ్రమలు, ప్రజల ఉపాధి అవకాశాల వృద్ధికి ఈ ప్రాజెక్టు తోడ్పడనుంది. -
ఇది టీజర్ మాత్రమే.. అసలు కథ ముందుంది.. రిలయన్స్ వార్నింగ్
Reliance Industries: ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలు, ఎదుర్కొంటున్న సవాళ్లను దృష్టిలో ఉంచుకుని అంతర్జాతీయంగా ఆర్థిక మాంద్యం ముప్పు పొంచి ఉందని రిలయన్స్ సంస్థ హెచ్చరించింది. ప్రపంచంలో అతిపెద్ద ముడి చమురు రిఫైనింగ్ ఫ్యాక్టరీ గల రిలయన్స్.. ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికం (2022-23 ఏప్రిల్-జూన్) అంచనాల కంటే తక్కువ లాభాలను ఆర్జించిన సంగతి తెలిసిందే. అయితే భవిష్యత్తులో లాభాల విషయంలో ఫలితాలు అనుకున్నంత ఆశాజనకంగా ఉండకపోవచ్చని పేర్కొంది. రిలయన్స్ జాయింట్ చీఫ్ ఫైనాన్సియల్ ఆఫీసర్ వీ శ్రీకాంత్ ఈ విషయమై మాట్లాడుతూ.. పెరుగుతున్న సరుకు రవాణా, ఇన్పుట్ ధరల కారణంగా అధిక నిర్వహణ ఖర్చులు వంటి అనేక సవాళ్లను ఎదర్కోవాల్సిన పరిస్థితి ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. జూన్ త్రైమాసికంలో ముడి సరుకుల ధరలు 76% పెరిగాయి. ఇదిలా ఉంటే, ఈ నెలాఖరులోగా ప్రపంచ ఆర్థిక వృద్ధిరేటు ఔట్‌లుక్‌ను తగ్గించనున్నట్లు అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) ప్రకటించింది. పెరుగుతున్న ఆహారం, ఇంధన ధరలు, మార్కెట్లకు మూలధన ప్రవాహం మందగించడం, కొనసాగుతున్న మహమ్మారి, చైనాలో మందగమనం లాంటివి వీటికి పెనుసవాళ్లుగా మారాయి. చదవండి: విమాన ప్రయాణంలో ఫోన్లో ఫ్లైట్ మోడ్ ఎందుకు ఆన్ చేస్తారో తెలుసా? -
ఆయిల్ రిఫైనరీలో భారీ ప్రమాదం.. 100 మంది కార్మికుల మృతి
సాక్షి, న్యూఢిల్లీ: నైజీరియాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. పర్మిషన్ లేకుండా నిర్వహిస్తున్న చమురు శుద్ధి కర్మాగారంలో భారీ పేలుడు సంభవించింది. నైజీరియాలోని దక్షిణ రాష్ట్రమైన ఇమోలోని చమురు శుద్ధి కర్మాగారంలో ఈ దుర్ఘటన జరిగింది. సుమారు 100 మందికిపైగా కార్మికులు ప్రమాదంలో మరణించినట్టు తెలుస్తోంది. చమురు శుద్ధి కర్మాగారంలో పేలుడు సంభవించడం వల్లే ప్రాణనష్టం జరిగినట్లు అధికారులు తెలిపారు. పరారీలో ఉన్న ఆయిల్ రిఫైనరీ నిర్వాహకుల కోసం గాలిస్తున్నట్టు పోలీసులు వెల్లడించారు. శుక్రవారం రాత్రి ఈ ఘటన జరగగా తాజాగా వెలుగులోకి వచ్చింది. చదవండి👉🏼 58 ఏళ్ల తర్వాత ఫేస్బుక్ చేసిన మేలు కాగా, ఆఫ్రికాలో అతిపెద్ద ఆయిల్ ఉత్పత్తిదారు అయిన నైజీరియాలో అనుమతిలేకుండా చమురు శుద్ధి కర్మాగారాలను నిర్వహించడం మామూలే! పైప్ లైన్ల నిర్వహణ లోపాల కారణంగా ప్రమాదాలు సాధరణమైపోయాయి. ఆయిల్ దొంగలు కూడా రిఫైనరీల పైప్లైన్లను ధ్వంసం చేసి భారీ ఎత్తున పెట్రోల్, డీజిల్‌ను బ్లాక్‌లో అమ్ముకుంటున్నారు. ఈక్రమంలో ప్రమాదాలు జరిగి వందలాది అమాయక కార్మికులు ప్రాణాలు కోల్పోతున్నారు. మరోవైపు ఆయిల్ దందాలో అక్రమాలకు అడ్డుకట్టు వేసేందుకు మిలటీరిని రంగంలోకి దించామని, పటిష్ట చర్యలు చేపడుతున్నామని నైజీరియా ప్రభుత్వం చెబుతోంది. రోజూ 2 మిలియన్ల బ్యారెల్స్ చమురు ఉత్పత్తి చేస్తున్న నైజీరియాలో మెజారిటీ ప్రజలు బీదరికంలో మగ్గుతుండటం గమనార్హం. చదవండి👉 మొట్టమొదటిసారిగా.. యూఎస్‌లో పోర్నోగ్రఫీపై కోర్సు -
Russia-Ukraine War: ఉక్రెయిన్‌పై ఆగని బాంబుల వర్షం
బుచా/కీవ్: ఉక్రెయిన్‌పై రష్యా దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. ఒడెసా సమీపంలో ఆదివారం క్షిపణుల వర్షం కురిపించాయి. ఉక్రెయిన్ సైన్యం ఉపయోగిస్తున్న చమురు శుద్ధి కర్మాగారాన్ని, మూడు చమురు డిపోలను ధ్వంసం చేశామని రష్యా రక్షణ శాఖ ప్రకటించింది. కోస్తియాన్టినివ్కా, ఖ్రేసిచేలో ఆయుధ డిపోలను సైతం ధ్వంసం చేశామని తెలియజేసింది. మారియుపోల్ నుంచి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఖర్కీవ్‌పై 20 వైమానిక దాడులు జరిగాయి. బలాక్లియా పట్టణంలో ఆసుపత్రిపై రష్యా క్షిపణి దాడికి పాల్పడింది. మరోవైపు ఇరు దేశాల మధ్య చర్చలు సోమవారం మళ్లీ మొదలవనున్నాయి. బుచాలో దారుణ దృశ్యాలు కొన్ని వారాలుగా రష్యా సైన్యం నియంత్రణలో ఉన్న రాజధాని కీవ్ ఉత్తర ప్రాంతాన్ని పూర్తిగా స్వాధీనం చేసుకున్నామని ఉక్రెయిన్ సైన్యం ప్రకటించింది. కీవ్‌కు 37 కిలోమీటర్ల దూరంలో ఉన్న బుచా పట్టణం ఇప్పటికే ఉక్రెయిన్ అధీనంలోకి వచ్చింది. అక్కడ శవాలు వీధుల్లో చెల్లాచెదురుగా దర్శనమిచ్చాయని మీడియా ప్రతినిధలు చెప్పారు. వాటికి సామూహిక అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు. తూర్పు ప్రాంతంలో రష్యా భారీగా సైన్యాన్ని మోహరిస్తోంది. ఉత్తర ఉక్రెయిన్ నుంచి సైన్యాన్ని పూర్తిగా ఉపసంహరించింది. ఉక్రెయిన్‌లో మందుపాతర్ల బెడద రష్యా జవాన్లు తమ భూభాగంలో ఎక్కడిక్కడ మందుపాతరలు ఏర్పాటు చేశారని అధ్యక్షుడు జెలెన్స్కీ ఆరోపించారు. రోడ్లపై, వీధుల్లో, ఇళ్లలో, అఖరికి శవాల లోపలా మందుపాతరలు పె ట్టారన్నారు. మరిన్ని ఆధునిక ఆయుధాలు, యుద్ధ విమానాలివ్వాలని పశ్చిమ దేశాలను కోరారు. రంజాన్‌పై యుద్ధ ప్రభావం యుద్ధంతో చమురు, నిత్యావసరాల ధరలు భారీగా పెరిగినందున ఈసారి రంజాన్ జరుపుకోవడం కష్టమేనని లెబనాన్, ఇరాక్, సిరియా, సూడాన్, యెమెన్ తదితర దేశాల్లో జనం వాపోతున్నారు. వాటికి గోధుమలు, బార్లీ గింజలు, నూనె గింజలు రష్యా, ఉక్రెయిన్ నుంచే వెళ్తాయి. లిథువేనియాకు చెందిన ప్రముఖ సినీ దర్శకుడు రావిసియస్ మారియుపోల్‌లో కాల్పుల్లో మృతి చెందారు. రష్యా సైన్యంలో తిరుగుబాటు! సుదీర్ఘ యుద్ధంతో ఉక్రెయిన్‌లో రష్యా సైనికులు నీరసించిపోతున్నట్లు చెప్తున్నారు. ముందుకెళ్లడానికి వారు ససేమిరా అంటున్నారు. సొంత వాహనాలు, ఆయుధాలనూ ధ్వంసం చేస్తున్నారు. ఉన్నతాధికారుల ఉత్తర్వులను లెక్కచేయడం లేదు. సైనికుల్లో తిరుగుబాటు మొదలైందని, పుతిన్ మొండిపట్టుపై వారు రగిలిపోతున్నారని ఉక్రెయిన్ అంటోంది. ‘‘సహచరుల మరణాలు రష్యా సైనికులను కలచివేస్తున్నాయి. స్థైర్యం సన్నగిల్లి ఆస్త్ర సన్యాసం చేస్తున్నారు’’ అరని నాటో కూటమి అంటోంది. యుద్ధానికి రష్యా సైన్యం విముఖత వ్యక్తం చేయడం ఇదే మొదటిసారి కాదు. 1905 జూన్‌లో రూసో–జపనీస్ యుద్ధంలోనూ వారు ఇలాగే సహాయ నిరాకరణ చేశారు. ఉన్నతాధికారులపై తిరగబడ్డారు. వారి ఆదేశాలను ధక్కిరించారు. -
అమెరికన్ ‘కార్గిల్’ చేతికి నెల్లూరు వంట నూనెల రిఫైనరీ
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఆహారోత్పత్తుల రంగంలో ఉన్న యూఎస్ దిగ్గజం కార్గిల్ తాజాగా ఆంధ్రప్రదేశ్ నెల్లూరులోని వంట నూనెల శుద్ధి కేంద్రాన్ని కొనుగోలు చేసింది. కృష్ణపట్నం పోర్ట్ వద్ద ఉన్న ఈ రిఫైనరీని దక్కించుకోవడానికి, అలాగే ఆధునీకరణకు మొత్తం సుమారు రూ.262.5 కోట్లు వెచ్చిస్తున్నట్టు కంపెనీ మంగళవారం ప్రకటించింది. 2022 మే నాటికి ఈ ఫెసిలిటీ పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తుందని సంస్థ అంచనా వేస్తోంది. తద్వారా దక్షిణాదిన సంస్థ ఉత్పత్తి సామర్థ్యం గణనీయంగా పెరుగుతుందని, కంపెనీ విస్తరణకు దోహదం చేస్తుందని కార్గిల్ వంట నూనెల విభాగం భారత ఎండీ పియూష్ పట్నాయక్ తెలిపారు. 2001లో భారత్‌లో అడుగుపెట్టిన కార్గిల్ ప్రస్తుతం నేచుర్ఫ్రెష్, జెమిని, స్వీకార్, లియోనార్డో, సన్‌ఫ్లవర్ వంటి బ్రాండ్లలో వంట నూనెలు, కొవ్వుల వంటి ఉత్పత్తులను విక్రయిస్తోంది. దేశీయంగా 10 కోట్ల మందికిపైగా కస్టమర్లు ఉన్నారని కంపెనీ తెలిపింది. -
సౌదీపై దాడుల్లో ఇరాన్ హస్తం!
రియాద్ : సౌదీ అరేబియా చమురు క్షేత్రాలపై డ్రోన్ దాడులకు పాల్పడింది ఇరానేనని దానికి తగ్గ ప్రాథమిక ఆధారాలు తమ వద్ద ఉన్నాయని ఆ దేశ ప్రభుత్వం చెబుతోంది. ఈ దాడులపై విచారణ సమయంలో దొరికిన శిథిలాలను పరిశీలించి చూస్తే ఇరాన్ ప్రాంతం నుంచే దాడులు జరిగినట్టు అర్థం అవుతోందని సౌదీ నేతృత్వంలో సంకీర్ణ సర్కార్ అధికార ప్రతినిధి టర్కీ అల్ మాలికి రియాద్‌లో విలేకరుల సమావేశంలో వెల్లడించారు. హౌతీ తిరుగుబాటుదారులు ఈ దాడులు తాము చేసిన పనేనని, అత్యంత ఆధునికమైన ఇంజన్లు కలిగిన డ్రోన్లను వినియోగించి యెమన్ నుంచి దాడులకు పాల్పడినట్టు ఇప్పటివరకు చెబుతూ వచ్చారు. హౌతీ తిరుగుబాటుదారులకి ఇరాన్ మద్దతు ఉంది. అయితే సౌదీ ప్రభుత్వం దానికి పూర్తి విరుద్ధంగా యెమన్ నుంచి ఈ దాడులు జరిగినట్టు తమ విచారణలో తేలలేదని చెబుతున్నారు. ఈ డ్రోన్ల ప్రయోగం కచ్చితంగా ఎక్కడ నుంచి జరిగిందో మేము తెలుసుకునే ప్రయత్నాలు చేస్తున్నామని అల్ మాలికి వెల్లడించారు. దాడి జరిగిన ప్రాంతంలో లభించిన ఛిన్నాభిన్నమైన డ్రోన్, క్షిపణి శిథిలాలను అమెరికా, సౌదీ అరేబియాకు చెందిన నిపుణులు అణువణువు పరీక్షించి చూస్తున్నారు. ఇరాన్‌పైనే అమెరికా అనుమానాలు ఈ దాడులు జరిగిన దగ్గర్నుంచి అగ్రరాజ్యం అమెరికా ఇది ఇరాన్ చేసిన పనేనని ఆరోపిస్తోంది. అధ్యక్షుడు ట్రంప్ దీనికి సంబంధించి ట్వీట్లు కూడా చేశారు. దోషులు ఎవరో తమకు తెలుసునని, సౌదీ అరేబియా స్పందన కోసమే తాము ఎదురు చూస్తున్నామని చెప్పారు. అయితే ఇరాన్‌పై యుద్ధానికి దిగే ఉద్దేశం లేదని ట్రంప్ స్పష్టం చేశారు. గల్ఫ్‌లో తమ మిత్రదేశాల ప్రయోజనాల కోసం, అక్కడ ఉన్న అమెరికా దళాలను కాపాడుకోవడం కోసం ఎలాంటి చర్యలకైనా తాము సిద్ధమేనని అమెరికా ఉపాధ్యక్షుడు పెన్స్ చెప్పారు. దక్షిణ ఇరాన్ నుంచే దాడులు ? ఇరాన్లో దక్షిణ ప్రాంతం నుంచి డ్రోన్ల ప్రయోగం జరిగినట్టు అమెరికా ప్రభుత్వంలో సీనియర్ అధికారులు చెబుతున్నారు. యెమన్ నుంచి హౌతీ తిరుగుబాటుదారులు చేస్తున్న పోరాటాన్ని ఎదుర్కొంటున్న సౌదీ రక్షణ శాఖ ఇరాన్ నుంచి వచ్చిన ముప్పును గమనించలేకపోయిందని వెల్లడించారు. మరోవైపు ఈ ఆరోపణల్ని ఇరాన్ తోసిపుచ్చింది. ‘ నిరాధారమైన, ఆమోదయోగ్యం కాని ఆరోపణలు చేయడం అమెరికాకే చెల్లింది’ ఇరాన్ తెలిపింది. ఇరాన్‌కు కీలకమద్దతుదారు అయిన రష్యా నిజానిజాలు బయటపడే వరకు ఈ దాడులపై తుది నిర్ణయానికి ఎవరూ రావద్దంటూ ప్రపంచ దేశాలకు పిలుపునిచ్చింది. -
సౌదీ చమురు క్షేత్రాలపై డ్రోన్లతో దాడి
రియాధ్: యెమెన్ ఉగ్రవాదులు జరిపిన డ్రోన్ దాడులతో సౌదీ అరేబియా చమురు క్షేత్రాల్లో మంటలు చెలరేగాయి. సౌదీ తూర్పు ప్రాంతంలో ఆరామ్కోకు చెందిన అబ్కేయిక్, ఖురైస్ క్షేత్రాలపై శనివారం వేకువ జామున రెండు డ్రోన్లు కూలాయి. దీంతో భారీగా చెలరేగిన మంటలను సిబ్బంది దాదాపు రెండు గంటల అనంతరం అదుపులోకి తెచ్చారని ప్రభుత్వం తెలిపింది. ఈ దాడికి కారణం తామేనంటూ ఇరాన్ మద్దతుతో పనిచేస్తున్న యెమెన్‌లోని హౌతి ఉగ్రవాదులు ప్రకటించుకున్నారు. ఈ ఘటనపై విచారణ ప్రారంభించామని తెలిపిన అంతరంగిక శాఖ మంత్రి.. డ్రోన్లు ఎక్కడివి? ప్రాణాపాయం, పనులపై ప్రభావం వంటి వివరాలను వెల్లడించలేదు. కాగా, అబ్కేయిక్, ఖురైస్‌లపై శనివారం వేకువజామున పది వరకు డ్రోన్లతో తాము దాడి చేసినట్లు హౌతీ ఉగ్రవాదుల ప్రతినిధి అల్ మసీరా టీవీకి తెలిపారు. ఇటీవలి కాలంలో హౌతి ఉగ్రవాదులు సౌదీ అరేబియా వైమానిక స్థావరాలపై పలు క్షిపణి, డ్రోన్ దాడులు జరిపిన విషయం తెలిసిందే. యెమెన్‌లో తమ ప్రాంతాలపై సౌదీ అరేబియా దాడులకు ప్రతీకారంగానే ఈ దాడులు చేస్తున్నట్లు హౌతీలు అంటున్నారు. ఆరామ్కోకు ఉన్న అతిపెద్ద చమురు శుద్ధి కర్మాగారాల్లో ఒకటైన అబ్కేయిక్‌పై గతంలో అల్‌ఖైదా జరిపిన దాడిలో ఇద్దరు భద్రతా సిబ్బంది మరణించారు. తాజా ఘటనతో ప్రపంచంలోనే అత్యధికంగా చమురు ఎగుమతి చేసే సౌదీ అరేబియాలోని చమురు క్షేత్రాల భద్రతపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీంతోపాటు గల్ఫ్ జలాల్లోని ఆయిల్ ట్యాంకర్లపై జూన్, జూలైల్లో జరిగిన దాడులకు ఇరానే కారణమంటూ సౌదీ ప్రభుత్వం, అమెరికా ఆరోపిస్తుండగా తాజా ఘటనతో ఈ ప్రాంతంలో ఉద్రిక్తతలు మళ్లీ పెరిగాయి. వ్యాపార విస్తరణ కోసం ఆరామ్కో త్వరలోనే ఐపీవోకు వెల్లనుండగా ఈ పరిణామం సంభవించడం గమనార్హం. -
ఇండియాలో అతిపెద్ద చమురు రిఫైనరీ కేంద్రం
-
కృష్ణపట్నంలో ఆయిల్ రిఫైనరీ పెట్టండి
సాక్షి, అమరావతి: కృష్ణపట్నంలో ఆయిల్ రిఫైనరీ ఏర్పాటు చేయాలని సీఎం చంద్రబాబు సౌదీ ఆర్మ్‌కో సంస్థ ప్రెసిడెంట్‌ను సైద్ అల్ హద్ర మీని కోరగా ఆయన సంసిద్ధత వ్యక్తం చేశా రు. దావోస్ పర్యటనలో రెండోరోజు మంగ ళవారం సీఎం సౌదీ ఆర్మ్‌కో ప్రెసిడెంట్‌తో సమావేశమయ్యారు. తమ రాష్ట్రాన్ని తాకు తూ రెండు పారిశ్రామిక కారిడార్లున్నాయని, కృష్ణపట్నాన్ని లాజిస్టిక్ హబ్‌గా తీర్చిదిద్దు తామని, ఆయిల్ రిఫైనరీ ఏర్పాటు వాణిజ్య పరంగా ఎంతో లాభసాటి అవుతుందని చంద్రబాబు చెప్పారు. కృష్ణపట్నంలో ఆయి ల్ రిఫైనరీ ఏర్పాటు ప్రతిపాదనపై గతంలోనే చర్చించిన నేప థ్యంలో ఈ నెలాఖరులో ముంబై లో తమ ప్రతినిధులతో సంప్ర దించాలని హద్రమీ సూచిం చారు. ఫిబ్రవరిలో విశాఖలో నిర్వహించనున్న సీఐఐ సదస్సుకు హాజ రవాలని హద్రమీని సీఎం ఆహ్వానించారు. పలువురితో సీఎం భేటీ.. కాగా మిడ్‌టెక్ ఇన్నోవేషన్ సెంటర్ ప్రతి నిధులతో సీఎం సమావేశమై గతేడాది కుదు ర్చుకున్న ఒప్పందంపై చర్చించారు. ఏజిల్ లాజిస్టిక్స్ సీఈవో తరక్ సుల్తా అల్ ఎస్సా, డైరెక్టర్ ఉగెన్ మెన్‌తో, హిటాచీ ప్రెసిడెంట్ తొషైకీ హిగషిహరతో సీఎం భేటీ అయ్యారు. -
రూ.2 లక్షల కోట్లతో భారీ రిఫైనరీ!
♦ మహారాష్ట్రలో ఏర్పాట్లు ♦ చేతులు కలిపిన ఐవోసీ, బీపీసీఎల్, హెచ్‌పీసీఎల్ న్యూఢిల్లీ: ప్రభుత్వరంగంలోని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐవోసీ), భారత్ పెట్రోలియం కార్పొరేషన్ (బీపీసీఎల్), హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ (హెచ్‌పీసీఎల్) సంస్థలు సంయుక్తంగా మహారాష్ట్రలోని రత్నగిరి జిల్లాలో భారీ ఆయిల్ రిఫైనరీని ఏర్పాటు చేయనున్నాయి. ఈ మేరకు బుధవారం ఒక ఒప్పందంపై సంతకాలు జరిగాయి. 60 మిలియన్ టన్నుల రిఫైనరీ సామర్థ్యంతో ఏర్పాటు చేసే ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.2 లక్షల కోట్లు. ఒక్క ఐవోసీయే ఇందులో సగం వాటా తీసుకోనుంది. మిగిలిన రెండు సంస్థలు మరో సగం పెట్టుబడులతో 50 శాతం వాటాను పొందుతాయి.