వచ్చే పదేళ్ల పాటు 800 బిలియన్ డాలర్లు
టాటా, రిలయన్స్, అదానీ గ్రూప్‌ల ప్రణాళికలు
కొత్త వ్యాపారాలు, ప్రస్తుత వ్యాపార విస్తరణపై దృష్టి
దేశీయంగా వినియోగం పెరుగుతున్న కొద్దీ వ్యాపార అవకాశాలను అందిపుచ్చుకునే దిశగా దిగ్గజ కంపెనీలు భారీగా కార్యకలాపాలను విస్తరిస్తున్నాయి. ఇందుకోసం భారీగా ఇన్వెస్ట్ చేయబోతున్నాయి. ఇటీవలి మూడీస్ రేటింగ్స్ ప్రకారం.. కొన్నాళ్ల పాటు ఏటా 45–50 బిలియన్ డాలర్ల మేర పెట్టుబడులు పెడతాయనే అంచనాలు నెలకొన్నాయి.
ఆర్థిక వృద్ధి, ఉద్యోగాల కల్పన కోసం తయారీ రంగాన్ని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం అమలు చేస్తున్న విధానాలు కూడా ఈ పెట్టుబడులకు దోహదపడనున్నాయి. ఇక, స్టాండర్డ్ అండ్ పూర్ అంచనాల ప్రకారం వచ్చే దశాబ్దకాలంలో కార్పొరేట్ దిగ్గజాలు 800 బిలియన్ డాలర్లపైగా పెట్టుబడులు పెట్టబోతున్నాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్, టాటా, అదానీ, జేఎస్‌డబ్ల్యూ గ్రూప్, వేదాంత వంటి దిగ్గజాలు ఈ మేరకు ప్రణాళికలు వేసుకుంటున్నాయి. ఇందులో దాదాపు 40 శాతం పెట్టుబడులు, అంటే సుమారు 350 బిలియన్ డాలర్లు హరిత హైడ్రోజన్, పర్యావరణహిత ఇంధనాలు, ఏవియేషన్, సెమీకండక్టర్లు, ఎలక్ట్రిక్ వాహనాలు, డేటా సెంటర్లు వంటి .. కొత్త వ్యాపారాల్లోకి రానున్నాయి. అలాగే, ప్రస్తుత వ్యాపారాలను కూడా మరింత పటిష్టం చేసుకోవడంపై బిర్లా, మహీంద్రా, హిందుజా, హీరో, ఐటీసీ, బజాజ్ వంటి పలు దిగ్గజాలు దృష్టి పెడుతున్నాయి. గడిచిన రెండేళ్లుగా ఆయా సంస్థల పెట్టుబడుల సరళిని చూస్తే ఇందుకోసం వచ్చే పదేళ్లలో దాదాపు 400 బిలియన్ డాలర్ల నుంచి 500 బిలియన్ డాలర్ల వరకు ఇన్వెస్ట్ చేయొచ్చని అంచనాలు నెలకొన్నాయి.
రిస్క్‌లూ ఉన్నాయి..!
దేశీ దిగ్గజాల వ్యా పార వృద్ధికి అవకాశాలు భారీగానే ఉన్నప్పటికీ.. పెట్టుబడులపరంగా కొన్ని రిసు్కలు కూడా ఉంటాయని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. పెట్టుబడుల కోసం ఏవో కొన్ని సంస్థలు తప్ప చాలా మ టుకు కంపెనీలు పెద్ద ఎత్తున రుణాలపైనే ఆధారపడాల్సి ఉంటుందని పేర్కొన్నాయి. కాబట్టి లాభదాయకత ఎలా ఉంటుందో ఇంకా తెలియని కొత్త రంగాల్లో పెట్టుబడులపరంగా కావచ్చు ప్రణాళికల అమలుపరంగా కావ చ్చు ఏవైనా సమస్యలు ఎదురైతే రుణభారం గణనీ యంగా పెరిగిపోయే అవకాశాలు ఉన్నాయని ఆ వర్గాలు చెబుతున్నాయి. వీటిని గుర్తించే ఆయా కంపెనీలు కొత్త టెక్నాలజీలపై ఇన్వెస్ట్ చేసే విషయంలో ప్రత్యామ్నాయ ప్రణాళికలను కూడా సిద్ధంగా ఉంచుకుంటున్నాయి.
– సాక్షి, బిజినెస్ డెస్క్
Comments
Please login to add a commentAdd a comment