ప్రపంచంలోనే అత్యంత సంపన్నుల జాబితాలో 11వ స్థానంలో ఉన్న ముఖేశ్ అంబానీ ఆస్తులు కరిగిపోవాలంటే ఎన్ని రోజులు పడుతుందోననే ఆలోచన ఎప్పుడైనా వచ్చిందా..‘కూర్చొని తింటే కొండలైనా కరిగిపోతాయ్’ కదా.. ఒకవేళ అంబానీ తన వ్యాపారం పరంగా ఎలాంటి మూలధన వ్యయం చేయకుండా ప్రస్తుతం ఉన్న ఆస్తిని అనుభవించాలంటే ఎన్నేళ్లు సమయం పడుతుందో తెలుసుకుందాం.
ఆసియాలోనే అత్యంత ధనవంతుడిగా పేరున్న రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్ అంబానీ నికర ఆస్తుల విలువ రూ.10.21 లక్షల కోట్లు ఉంటుందని అంచనా. ఒకవేళ అంబానీ రోజూ రూ.3 కోట్ల రూపాయలు చొప్పున ఖర్చు చేసినా లేదా విరాళంగా ఇచ్చినా ఆయన సంపద మొత్తం 3,40,379 రోజుల్లో జిరో అవుతుంది. అంటే ఏడాదికి 365 రోజులకుగాను లెక్కిస్తే తన సంపద పూర్తిగా కరిగిపోవాలంటే 932 సంవత్సరాల 6 నెలలు పడుతుందన్నమాట. బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ నివేదిక ప్రకారం 2024 ప్రారంభం నుంచి ఇప్పటివరకు అంబానీ ఆస్తుల నికర విలువ దాదాపు రూ.1.98 లక్షల కోట్లు పెరిగింది.
ఇదీ చదవండి: మరో సిమెంట్ కంపెనీపై అదానీ కన్ను?
ముఖేశ్ అంబానీ ఇటీవల తన చిన్న కుమారుడు అనంత్ అంబానీ-రాధిక మర్చంట్ల పెళ్లిని అంగరంగవైభవంగా నిర్వహించారు. రెండుసార్లు ప్రీ వెడ్డింగ్ ఈవెంట్లను జరుపుకున్నారు. దానికోసం రూ.కోట్లు ఖర్చు చేసినట్లు తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment