
సాక్షి, ముంబై: ఎయిర్‌టెల్ 4జీ స్మార్ట్‌ఫోన్ కోసం చూస్తున్న వినియోగదారులకు శుభవార్త. ఫెస్టివ్ సీజన్‌లో భారతి ఎయిర్‌టెల్ కస్టమర్లకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. కొత్తగా 4జీ స్మార్ట్ఫోన్ కొనుగోలు చేసిన వారికి రూ.2 వేలు క్యాష్ బ్యాక్ ఆఫర్‌తో మంగళవారం ఒక కొత్త పథకాన్ని ప్రకటించింది.
ఆన్‌లైన లేదా ఆఫ్‌లైన్ స్టోర్ల ద్వారా 4జీ స్మార్ట్ఫోన్ కొనుగోలు చేసినవారు ఈ ఆఫర్‌ను దక్కించుకోవచ్చు. ఈ ఆఫర్ అక్టోబర్ 31, 2018తో ముగియనుంది. 4జీ స్మార్ట్‌ఫోను కొనుగోలు చేసిన తరువాత ఎయిర్‌టెల్ 4జీ సిమ్ వేసి మై ఎయిర్‌టెల్ యాప్ ద్వారా ఫ్రీ ఆఫర్లను క్లెయిమ్ చేసుకోవాలి. ఇలా వారి అకౌంట్లోకి రూ.50 విలువైన 40 కూపన్లు క్రెడిట్ అవుతాయి. వాటిని తరువాత చేసుకునే రీ ఛార్జిలకు ఉపయోగించుకుని ఆ మేర రాయితీ పొందవచ్చు. ఈ కూపన్లను వాడుకోవాలనుకునే ప్రీ పెయిడ్ కస్టమర్లు రూ.199, రూ.249, రూ.448 ప్లాన్లను వాడాల్సి ఉంటుంది. పోస్ట్ పెయిడ్ కస్టమర్లు రూ.399 ఆపైన విలువ గల ప్లాన్‌ను రీచార్జ్ చేసుకోవాలి. నగదు చెల్లింపు పథకం మొదటి 40 నెలలు చెల్లుబాటు అవుతుంది. ఒక రీచార్జ్‌కి ఒక కూపన్‌ను మాత్రమే రిడీమ్ చేసుకునే అవకాశం.