సాక్షి, న్యూడిల్లీ: దేశీయ టెలికాం దిగ్గజం భారతి ఎయిర్ టెల్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. తక్కువ ధరలో 4జీ స్టార్ట్‌ఫోన్లను అందించేందుకు కొత‍్త వ్యూహంతో వస్తోంది. ఇందుకు ఇంటర్నెట్ దిగ్గజం గూగుల్‌తో సరికొత్త భాగస్వామ్యాన్ని కుదుర్చుకున్నట్టు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపింది. ముఖ్యంగా లేటెస్ట్ ఆండ్రాయిడ్ వెర్షన్ ఓరియో తో కొత్త 4జీ స్మార్ట్‌ఫోన్లను కస్టమర్లకు అందుబాటులోకి తెస్తోంది. ఎంట్రీ లెవల్ స్మార్ట్‌ఫోన్లకు గూగుల్ స్పెషల్‌గా డిజైన్ చేసిన ఆండ్రాయిడ్ గో ప్లాట్‌ఫాంతో ఈ స్మార్ట్‌ఫోన్లను లాంచ్ చేయనుంది.
‘మేరా పహలా స్మార్ట్‌ఫోన్’ పథకం కింద ఆండ్రాయిడ్ గో 4జీ స్మార్ట్‌ఫోన్లను అందించనుంది. అదీ తక్కువ ధరలో. మై ఎయిర్‌టెల్ యాప్, ఎయిర్‌టెల్ టీవీ లాంటి ఎయిర్టెల్ యాప్స్, విన్క్ మ్యూజిక్ ప్రీ లోడెడ్‌గా వస్తున్న ఈ ఫోన్లను మార్చి నెలనుంచి అందుబాటులో తేనున్నట్టు ప్రకటించింది. ళసరసమైన ధరలో 4జీ స్మార్ట్‌ఫోన్‌ను అందించే ప్రయత్నాల్లో ఈ భాగస్వామ్యం ఒక ప్రధాన మైలురాయి అని ఎయిర్‌టెల్ చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ వాణి వెంకటేష్ వెల్లడించారు. దీని ద్వారా ఆన్‌లైన్‌కు దూరంగా ఉన్న లక్షలమంది పీచర్ ఫోన్ వినియోగదారులు ఆన్‌లైన్‌కు చేరువవుతారన్నారు. అటు ఆండ్రాయిడ్ డైరెక్టర్ జాన్ గోల్డ్ కూడా ఈ భాగస్వామ‍్యంపై సంతోషం వ్యక్తం చేశారు. అందరికీ కంప్యూటింగ్ పవర్‌ను అందించడంలో తాము ముందుంటామనీ, అయితే ఈ క్రమంలో ఎయిర్‌టెల్ లీడ్ రోల్ పోషించడం అభినందనీయమంటూ ఈ డీల్‌ను స్వాగతించారు.
Comments
Please login to add a commentAdd a comment